Andhra Pradesh

News April 18, 2024

కర్నూలు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్

image

కర్నూలులో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. టీడీపీ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బస్తిపాడు నాగరాజ్ కలెక్టర్ సృజనకు నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ నేపథ్యంలో కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ ఆంక్షలు విధించారు. ఇది తొలి సెట్ కావడంతో ఆయన ఎటువంటి ఆర్భాటం లేకుండా వచ్చారు. మరో సెట్ వేసేటప్పుడు కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీ చేయనున్నారు.

News April 18, 2024

తూర్పు గోదావరిలో జగన్ బస్సుయాత్ర

image

సీఎం జగన్ బస్సు యాత్ర తేతలి నుంచి తణుకు మీదుగా రావులపాలెంలోకి సాగింది. తూ.గో జిల్లాలో సిద్దాంతం వంతెన నుంచి జిల్లాలోకి ప్రవేశించింది. రావులపాలెం, జొన్నాడ, పొట్టిలంక, రాజానగరం మీదుగా ఎస్టీ రాజపురం వరకు బస్సుయాత్ర సాగనుంది. ఎస్టీ రాజపురంలో రాత్రి సీఎం జగన్ బస చేయనున్నారు. అందరికి అభివాదం చేస్తూ
సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు.

News April 18, 2024

అనంత: హాల్ టికెట్లు వచ్చేశాయ్..!

image

గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు ఈనెల 25వ తేదీన నిర్వహించే రాత పరీక్షలకు హాల్ టికెట్లు వచ్చాయని APRS, APRJC, DC – 2024 జిల్లా కోఆర్డినేటర్ విజయలత తెలిపారు. 5, 6, 7, 8 తరగతుల ప్రవేశాలకు APRS క్యాట్- 2024 పరీక్ష ఉదయం 10 – 12 గంటలకు, జూనియర్, డిగ్రీ కళాశాల ప్రవేశాలకు APRJC DC సెట్ మధ్యాహ్నం 2:30 – 5 గంటలకు ఉంటుందన్నారు. వివరాలకు https://aprs.apcfss.in సైట్ చూడాలన్నారు.

News April 18, 2024

అనంత: 108లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

అనంతపురం జిల్లాలో 108 వాహనాల్లో ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ (ఈఎంటీ), డ్రైవర్‌, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్‌ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు 108 జిల్లా మేనేజర్‌ సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి కల్గిన వారు ఈ నెల19వ తేదీ లోపు అనంతపురం సర్వజనాస్పత్రిలో 108 కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

News April 18, 2024

ఏలూరు: కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తొలి నామినేషన్

image

దెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆలపాటి నరసింహామూర్తి నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు గురువారం దెందులూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ లావణ్యవేణికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.

News April 18, 2024

ఉరవకొండ: పయ్యావుల కేశవ్ తరఫున సతీమణి నామినేషన్

image

ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ తరఫున ఆయన సతీమణి పయ్యావుల హేమలత నామినేషన్ వేశారు. గురువారం ఉదయం తనయుడు పయ్యావుల విజయ్ సింహ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆమె రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం నామినేషన్ పత్రాలను నియోజకవర్గ ఎన్నికల అధికారి కేతన్ గార్గ్‌కు అందజేశారు.

News April 18, 2024

గుంటూరు: కాలువలో మృతదేహం 

image

జిల్లాలోని నగరం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని అఖిలేరు కాలవలో 30 నుంచి 40 సంవత్సరాల మధ్య గల గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. ఎస్సై కోటేశ్వరరావు తెలిపిన వివరాలు.. మృతుడు 5.5 అడుగుల ఎత్తు, ఫ్రెంచ్ గడ్డం, సిమెంట్ కలర్ కాటన్ ప్యాంట్, ఎరుపు, నలుపు రంగు చెక్స్ చొక్కా, నలుపు రంగు బెల్ట్ ధరించి, గోల్డ్ కలర్ బకిల్ కలిగి ఉందన్నారు. ఆచూకీ తెలిసిన వారు స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.  

News April 18, 2024

పట్టువదలని విశాఖ యువతి

image

విశాఖలోని కిర్లంపూడికి చెందిన హనిత సివిల్స్‌లో 887వ ర్యాంక్ సాధించారు. ఇంటర్ వరకు విశాఖలోనే చదివిన ఆమె 2012లో ఖరగ్‌పూర్‌లో ఇంజినీరింగ్‌లో చేరారు. 2013లో సడెన్‌గా పెరాలసిస్ రావడంతో రెండు కాళ్లు పడిపోయాయి. వీల్ ఛైర్‌కు పరిమితమైన ఆమె రెండేళ్ల పాటు డిప్రెషన్‌కి గురయ్యారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో డిస్టెన్స్‌లో డిగ్రీ పూర్తిచేసి 2020లో తొలిసారి సివిల్స్‌ రాశారు. నాలుగో ప్రయత్నంలో ర్యాంక్ సాధించారు

News April 18, 2024

శ్రీకాకుళం: నేడు, రేపు భానుడి భగభగలు

image

నిన్నటి వరకు మోస్తరు వర్షాలు, చలిగాలులతో ఉపశమనం పొందిన ప్రజలకు ఎండలు మళ్లీ దంచికొడుతున్నాయి. బుధవారం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ పైగా నమోదయ్యాయి. గరిష్ఠంగా శ్రీకాకుళం(D) విజయనగరం, పార్వతీపురంమన్యం(D) సీతంపేట మండలాల్లో 42.7 డిగ్రీలు నమోదైంది. నేడు, రేపు ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరగొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు.

News April 18, 2024

పట్టువదలని విశాఖ యువతి

image

విశాఖలోని కిర్లంపూడికి చెందిన <<13067957>>హనిత<<>> సివిల్స్‌లో 887వ ర్యాంక్ సాధించారు. ఇంటర్ వరకు విశాఖలోనే చదివిన ఆమె 2012లో ఖరగ్‌పూర్‌లో ఇంజినీరింగ్‌లో చేరారు. 2013లో సడెన్‌గా పెరాలసిస్ రావడంతో రెండు కాళ్లు పడిపోయాయి. వీల్ ఛైర్‌కు పరిమితమైన ఆమె రెండేళ్ల పాటు డిప్రెషన్‌కి గురయ్యారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో డిస్టెన్స్‌లో డిగ్రీ పూర్తిచేసి 2020లో తొలిసారి సివిల్స్‌ రాశారు. నాలుగో ప్రయత్నంలో ర్యాంక్ సాధించారు.