India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ అభ్యర్థులను బుధవారం ఆ పార్టీ ప్రకటించింది. ఏలేశ్వరంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నైనాలశెట్టి మూర్తి ఎంపీ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు. కాకినాడ ఎంపీగా బుగతా బంగార్రావు, ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా ఏగుపాటి అర్జునరావు, తుని ఎమ్మెల్యే స్థానానికి శివ పోటీ చేస్తారని ఆయన చెప్పారు.
జిల్లాలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి గురువారం గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 3 పార్లమెంటు, 21 అసెంబ్లీ నియోజకవర్గల నామినేషన్ల స్వీకరణకు ఎన్నికలు సంఘం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసింది. లోక్‌సభ అభ్యర్థి రూ.25,000 వేలు, ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.10,000 వేలు ధరావత్తు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇందులో 50 % ధరవత్తు ఉంటుంది.
మడకశిరలో వైఎస్ షర్మిలకు రాష్ట్ర ఉపాధ్యక్షులు కేటి శ్రీధర్, మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థి కే. సుధాకర్, కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం స్వాగతం పలికారు. మడకశిర పట్టణంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలో షర్మిల పాల్గొంటున్నారు. ఈ సభలో పాల్గొనడానికి జిల్లావ్యాప్తంగా కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివస్తున్నారని అన్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవనుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా నారా లోకేశ్, నరసరావుపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చదలవాడ అరవిందబాబు, ప్రత్తిపాడు బీసీవై ఎమ్మెల్యే అభ్యర్థిగా స్తోత్రరాణి నామినేషన్లను దాఖలు చేయనున్నారు.
MPగా పోటీ చేసే అభ్యర్థులు ఫారం-2ఎ, MLAగా పోటీ చేసే వాళ్లు ఫారం-2బీ ద్వారా నామినేషన్లు దాఖలు చేయాలి. అభ్యర్థులందరూ నవీకరించిన ఫారం-26 అఫిడవిట్‌ను ఖాళీలు లేకుండా పూర్తి చేసి నామినేషన్ పత్రంతో జతచేయాలి . పోటీ చేసే అభ్యర్థి లేక ప్రతిపాదకుడు నామినేషన్ దాఖలు చేయవచ్చని కలెక్టర్ బాలాజీ తెలిపారు. MPఅభ్యర్థి రూ.25వేలు, MLAఅభ్యర్థి రూ.10వేలు, SC, STలు రూ.12,500, రూ.5వేల డిపాజిట్ చేయాలని చెప్పారు.
ఎన్నికల అధికారులమంటూ నమ్మించి వాహన తనిఖీల పేరుతో మంగళాపురం మాజీ సర్పంచ్ అల్లంకి వెంకటప్పారావు నుంచి గుర్తు తెలియని వ్యక్తులు బంగారం దోచుకున్నారు. అల్లంకి బుధవారం స్కూటీపై వెళుతుండగా, విజయరామరాజుపేట దాటాక ఇద్దరు బైకుపై వచ్చి అడ్డగించి బ్యాగు తీసుకుని తనిఖీ చేశారు. ఆయన ధరించిన బంగారు చైన్, ఉంగరాలు, బ్రాస్‌లైట్ తీసి బ్యాగులో వేస్తున్నట్లు వేసి వారి జేబులో వేసుకొని అక్కడ్నుంచి వెళ్లిపోయారు.
ఆర్డీవో, శ్రీకాకుళం, ఆమదాలవలస తహశీల్దారు కార్యాలయం, పాతపట్నం తహశీల్దారు కార్యాలయం, ఇచ్ఛాపురం తహశీల్దారు కార్యాలయం, పలాస తహశీల్దార్ కార్యాలయం, టెక్కలి తహశీల్దారు, నరసన్నపేట, ఎచ్చెర్ల తహశీల్దార్ కార్యాలయాలో నామపత్రాలు స్వీకరిస్తారు. నామపత్రాలు నేటి నుంచి 25 వరకు స్వీకరిస్తారు. 26న అధికారులు నామపత్రాలను పరిశీలిస్తారు.
జగన్మోహన్ రెడ్డి బస చేసిన తణుకు మండలం తేతలి గ్రామంలోని శిబిరం వద్ద సందడి నెలకొంది. మరికొద్ది కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో నాయకులు, కార్యకర్తల తాకిడి పెరిగింది. జగన్ మోహన్ రెడ్డిని చూసేందుకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు చేరుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల ఆవరణలో ఇటీవల జరిగిన హోలీ వేడుకల్లో కొందరు విద్యార్థులు ‘జగనన్న’ పాటకు నృత్యాలు చేశారన్న విషయమై విచారణ కొనసాగుతోంది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలని ఎన్నికల సంఘం కోరడంతో 3వ పట్టణ పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌కి చెందిన ఒక అధికారి న్యాయ కళాశాలకు వెళ్లి అధికారులను విచారించినట్లు తెలిపారు.
గుమ్మగట్ట మండలం వీరాపురం గ్రామంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అవంతి(13) అనే బాలిక పాముకాటుతో మృత్యువాత పడింది. ఆసుపత్రికి తరలించేలోపు బాలిక మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.