Andhra Pradesh

News April 17, 2024

తిరుపతి MLA అభ్యర్థికి బీఫాం అందజేత

image

తిరుపతి జిల్లాలో గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈక్రమంలో జనసేన తిరుపతి MLA అభ్యర్థి శ్రీనివాసులు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా మంగళగిరిలో బీఫాం అందుకున్నారు. చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరారు. ఆయనకే టికెట్ వచ్చింది. నాన్ లోకల్ అంటూ పలువురు ఆయన్ను వ్యతిరేకించినా అధినేత పవన్ అందరికీ సర్దిచెప్పారు.

News April 17, 2024

మాడుగుల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మారనున్నారా..?

image

మాడుగుల టీడీపీ అభ్యర్థిగా పైలా ప్రసాదరావును తప్పించి మాజీ మంత్రి బండారు సత్యనారాయణకు ఆసీటు కేటాయిస్తారని ఇటీవల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ తరుణంలో రేపు(గురువారం) మాడుగులలో బండారు పర్యటించనున్నట్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పీవీజీ కుమార్, మాజీ MLA గవిరెడ్డి రామానాయుడు తెలిపారు. ఆయన పర్యటన నేపథ్యంలో కార్యకర్తల్లో చర్చ మొదలైంది. కాగా.. ఆ సీటుపై రేపో ఎల్లుండో స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.

News April 17, 2024

నెల్లూరు జిల్లాలో నామినేషన్ల కేంద్రాలు ఇవే..!

image

☞ నెల్లూరు MP: నెల్లూరు కలెక్టర్ ఆఫీసు
☞ నెల్లూరు సిటీ MLA: కార్పొరేషన్ ఆఫీసు
☞ రూరల్ MLA: నెల్లూరు RDO ఆఫీసు
☞ కావలి MLA: కావలి RDO ఆఫీసు
☞ ఆత్మకూరు MLA: మున్సిపల్ ఆఫీసు
☞ కోవూరు MLA: కోవూరు MRO ఆఫీసు
☞ సర్వేపల్లి MLA: వెంకటాచలం MPDO ఆఫీసు
☞ ఉదయగిరి MLA: ఉదయగిరి MRO ఆఫీసు
☞ వెంకటగిరి MLA: వెంకటగిరి MRO ఆఫీసు
☞ గూడూరుMLA: గూడూరు RDO ఆఫీసు
☞ సూళ్లూరుపేట MLA: SLPT RDO ఆఫీసు

News April 17, 2024

సింహాచలంలో మే 4 వరకు ఆర్జిత సేవలు రద్దు

image

సింహాచలం ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు సందర్భంగా ఈనెల 18 నుంచి మే 4వ తేదీ వరకు స్వామివారి ఆర్జిత సేవలు అన్ని రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే 18 నుంచి ఈనెల 25 వరకు రాత్రి 7 గంటల తర్వాత భక్తులకు స్వామివారి దర్శనాలు లభించవని తెలిపారు. 24న పుష్పయాగం సందర్భంగా సాయంత్రం 6 గంటల నుంచి దర్శనాలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.

News April 17, 2024

VZM: బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బహిష్కరణ

image

బీజేపీ యువమోర్చా నాయకులు, మాజీ MLA నిమ్మక జయరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అరకు ఎంపీ బీజేపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీతను పార్టీ అధిష్ఠానం ప్రకటించడంతో జయరాజు వ్యతిరేక గళం విప్పారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న పార్టీ అదిష్ఠానం జయరాజును పార్టీ నుంచి సస్పెండ్‌తో పాటు ప్రాథమిక సభ్యుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ పాకా సత్యన్నారాయణ రాజు తెలిపారు.

News April 17, 2024

ప.గో: సివిల్స్‌లో సత్తా చాటిన నవ్యశ్రీ

image

తాడెపల్లిగూడెం పట్టణంలోని ఏపీ నిట్ పూర్వ విద్యార్థి గోవాడ నవ్యశ్రీ సివిల్స్ 2023 ఫలితాల్లో జాతీయ స్థాయిలో 995వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. నాలుగో సారి రాసిన సివిల్స్ పరీక్షలో విజయం సాధించడంతో పాటు ఐఆర్ఎస్ ర్యాంకు అధికారిగా ఉద్యోగం సాధించే అవకాశం ఉన్నట్టు నిట్ వర్గాలు తెలిపాయి. ఆమెను నిట్ ఇన్చార్జ్ డైరెక్టర్ మూర్తి, అధ్యాపకులు అభినందించారు.

News April 17, 2024

ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

image

నరసరావుపేట కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, పోలీసు సిబ్బంది తదితరులతో ఎన్నికల సన్నద్ధపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ.. పోలింగ్ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందరూ కమిట్మెంట్‌, డెడికేషన్‌తో విధులు నిర్వహించాలన్నారు. సీ విజిల్ యాప్ అమలులో జిల్లా ముందు వరుసలో పల్నాడు జిల్లా ఉందని అన్నారు.

News April 17, 2024

శ్రీకాకుళం: అప్పులు బాధ తాళలేక ఆత్మహత్య

image

నియోజకవర్గ పరిధి రూరల్ మండలం ఒప్పంగి గ్రామానికి చెందిన మంత్రి శ్రీధర్ (38) అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు నిర్ధారించారు. మునసబుపేట సమీపంలోగల ఓ లేఅవుట్ వద్ద మృతి చెందిన విషయాన్ని స్థానికులు ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ ఎస్సై ఎం.వాసుదేవరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 17, 2024

తూ.గో: వైసీపీకి ఇద్దరు ప్రముఖుల రాజీనామా

image

కమ్మ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పదవికి, వైసీపీ పార్టీ సభ్యత్వానికి కొటారు అశోక్ బాబా, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యుడు లంకసాని శ్రీనివాసరావు బుధవారం రాజీనామా చేశారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు ప్రెస్ క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఇద్దరు నాయకులు త్వరలో టీడీపీలో చేరతామని వెల్లడించారు.

News April 17, 2024

VIDEO: సమస్యలను పరిష్కరించాలని విరుపాక్షిని  గ్రామస్థుల నీలదీత

image

ఆస్పరిలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై వైసీపీ ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థి విరుపాక్షిని గ్రామస్థులు నిలదీశారు. వైసీపీ ప్రభుత్వంలో గ్రామంలో అభివృద్ధి జరగలేదని, సమస్యలను ఎందుకు పరిష్కరించలేదంటూ ఎన్నికల ప్రచారానికి
వచ్చిన విరుపాక్షిని ప్రశ్నించారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తానంటూ సముదాయించటానికి ప్రయత్నించినప్పటికీ
వినకపోవడంతో విరుపాక్షి అక్కడి నుంచి వెనుదిరిగారు.