Andhra Pradesh

News April 17, 2024

పిడుగురాళ్లలో గుర్తు తెలియని మృతదేహం కలకలం

image

మండలంలోని తుమ్మలచెరువు గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం పోలేరమ్మ గుడి వెనుక గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పిడుగురాళ్ల సీఐ ఆంజనేయులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వయస్సు 30 నుంచి 40 సంవత్సరాలు ఉంటుదని చెప్పారు. ఆచూకీ తెలిసిన వారు స్టేషన్‌కి సమాచారం ఇవ్వాలన్నారు. 

News April 17, 2024

తిరుపతి ప్రజల మనసులో ఏముందో..?

image

తిరుపతిలో గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే జనసేన,YCP అభ్యర్థులు శ్రీనివాసులు, భూమన అభినయ్ ప్రచారం చేస్తున్నారు. తొలుత జనసేన అభ్యర్థిని వ్యతిరేకించిన సుగుణమ్మ(TDP), కిరణ్ రాయల్(జనసేన) తదితర నేతలు సైతం ఇప్పుడు ఆయనకు మద్దతుగా ఇంటింటికీ తిరుగుతున్నారు. నాన్ లోకల్ వద్దు.. లోకల్ ముద్దు అని భూమన అంటున్నారు. ఎన్నికల నాటికి తిరుపతి ప్రజల నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.

News April 17, 2024

నిబంధనలు తూచా తప్పక పాటించాలి: కడప కలెక్టర్

image

కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలను తూచా తప్పక పాటిస్తూ.. నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందని కడప జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.విజయ్ రామరాజు రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. సాధారణ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు గానీ, ప్రతిపాదకులు గానీ నామినేషన్లు దాఖలు చేసే సమయంలో నిబంధనలు పాటించాలన్నారు.

News April 17, 2024

కనిగిరి వ్యక్తికి యూపీఎస్సీ ఫలితాల్లో 504వ ర్యాంక్

image

కనిగిరికి చెందిన వంగిపురం రాహుల్ బుధవారం ప్రకటించిన యూపీఎస్సీ ఫలితాల్లో 504వ ర్యాంక్ సాధించారు. తల్లితండ్రులు వంగేపురం రతన్ కుమార్, వయోల రాణి, పెద్ద కుమారుడు రాహుల్ 1 నుంచి 5 వరకు కనిగిరిలో, 6-10 తరగతులు ఒంగోలులో, విజయవాడలో ఇంటర్ చదివారు. మొదటి ప్రయత్నంలోనే ర్యాంక్ సాధించిన రాహుల్ కు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

News April 17, 2024

గుంటూరు: టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే 

image

తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే షేక్ నంబూరు సుభాని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో బుధవారం టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా  లోకేశ్ మాజీ ఎమ్మెల్యే నంబూరు సుభాని, పలువురు వైసీపీ నేతలు, మాజీ కార్పోరేటర్లకు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి మొహమ్మద్ నజీర్, తదితరులు పాల్గొన్నారు. 

News April 17, 2024

బిక్కవోలు: కాలువలో యువకుడి గల్లంతు

image

బిక్కవోలు మండలం కొమరిపాలెంలో కాలువలోకి దిగి ఓ యువకుడు గల్లంతైన ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. అనపర్తి మండలం పీరా రామచంద్రపురానికి చెందిన మహేష్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు బిక్కవోలు మండలం కొమరిపాలెం వెళ్లారు. స్నేహితులతో కలిసి కాలవలోకి దిగిన మహేష్ గల్లంతయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు యువకుడి కోసం గాలిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

News April 17, 2024

పెడన చేరుకున్న చంద్రబాబు.. మరికాసేపట్లో ప్రజాగళం సభ

image

టీడీపీ అధినేత చంద్రబాబు పెడన చేరుకున్నారు. ప్రజాగళం సభలో పాల్గొనేందుకు గాను చంద్రబాబు గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో బయలుదేరి పెడన చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద మచిలీపట్నం, పెడన అభ్యర్థులు కొల్లు రవీంద్ర, కృష్ణప్రసాద్ ఆయనకు స్వాగతం పలికారు. హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గాన పెడన బస్టాండ్ సెంటర్‌లోని సభా స్థలికి చంద్రబాబు బయలుదేరి వెళ్లారు. మరికాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా రానున్నారని సమాచారం.

News April 17, 2024

18 నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది: కలెక్టర్

image

కర్నూలు కలెక్టరేట్‌లోని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో బుధవారం సాధారణ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల మీడియా సెంటర్‌ను కలెక్టర్ డాక్టర్ సృజన ప్రారంభించారు. అనంతరం నామినేషన్ ప్రక్రియ, ఎన్నికల సంసిద్ధతపై మీడియాతో మాట్లాడారు. 18వ తేదీ 11 గంటల నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. నామినేషన్‌కు 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంటుందన్నారు.

News April 17, 2024

బొల్లాపల్లి: అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

image

అప్పులబాధ తాళలేక పురుగు మందు తాగి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు బొల్లాపల్లి మండలం రేమిడిచర్లకు చెందిన వెంకటేశ్వర్లు (44) అప్పుల బాధతో పురుగు మందు తాగి చికిత్స పొందుతూ.. మృతిచెందాడు. వెంకటేశ్వర్లు ఏప్రిల్ 14న పురుగు మందు తాగగా.. కుటుంబ సభ్యులు అతనిని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారన్నారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. రైతు మృతిచెందాడని చెప్పారు. 

News April 17, 2024

19న నామినేషన్ పెద్దిరెడ్డి నామినేషన్

image

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ పుంగనూరు MLA అభ్యర్థిగా ఈనెల 19న శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు తరలి రావాలని చౌడేపల్లి వైస్ ఎంపీపీ సుధాకర్ రెడ్డి కోరారు. ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి చౌడేపల్లెకు చేరుకోవాలని సూచించారు. అనంతరం భారీ ర్యాలీగా పుంగనూరుకు వెళ్తామన్నారు.