Andhra Pradesh

News April 17, 2024

వైసీపీకి రాజీనామా చేసిన రాజంపేట ముఖ్య నేతలు

image

రాజంపేట నియోజకవర్గంలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాజంపేట మైనార్టీ నేత గండికోట గుల్జార్ భాష రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి, వైసీపీకి బుధవారం రాజీనామా చేశారు. నందలూరుకు చెందిన భువనబోయిన లక్ష్మీనరసయ్య రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. మైనార్టీ నాయకుడు సయ్యద్ అమీర్ వక్ఫ్ బోర్డ్ సెక్రటరీ పదవికి, పార్టీకి రాజీనామా చేశారని తెలిపారు.

News April 17, 2024

విశాఖ ఎంపీ, గాజువాక ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తా: కేఏ.పాల్

image

విశాఖ ఎంపీ, గాజువాక ఎమ్మెల్యేగా రేపు(గురువారం) నామినేషన్ వేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ.పాల్ తెలిపారు. బుధవారం రైల్వే న్యూకాలనీలో గల పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని కోరారు. ఏపీ, తెలంగాణలో మోదీని వ్యతిరేకించే సత్తా ఉన్న ఏకైక పార్టీ వారిదే అన్నారు. పార్టీ గుర్తు హెలికాప్టర్‌కు బదులు కుండ ఇచ్చారని చెప్పారు.

News April 17, 2024

పుంగనూరులో ఉద్రిక్తత

image

పుంగనూరు పట్టణంలో బుధవారం మధ్యాహ్నం ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యకర్త హేమాద్రిని వైసీపీ నాయకులు కిడ్నాప్ చేశారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జానపద కళల అకాడమీ ఛైర్మన్ కొండవీటి నాగభూషణం ఇంటి వద్దకు వారు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వైసీపీ, టీడీపీ నాయకులను వెళ్లగొట్టారు. పట్టణంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

News April 17, 2024

కర్నూలు: ఏ నియోజకవర్గంలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయంటే..

image

కర్నూలు జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో గతేడాది జనవరి 5వ తేదీ నాటికి 2,186 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అదనంగా పాణ్యంలో 17, ఎమ్మిగనూరులో ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంతో మరో 18 కేంద్రాలు పెరిగాయి. దీంతో ప్రస్తుతం వాటి సంఖ్య2,204కు చేరింది. కర్నూలులో 258, పాణ్యంలో 357, పత్తికొండలో 255, కోడుమూరులో 275, ఎమ్మిగనూరులో 272, మంత్రాలయంలో 237, ఆదోనిలో 256, ఆలూరులో 294 పోలింగ్ కేంద్రాలున్నాయి.

News April 17, 2024

తూ.గో.: పండగ పూట విషాదం.. దారుణ హత్య

image

కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి గ్రామంలో సవుదాల వెర్రెమ్మ (55) దారుణ హత్యకు గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సాదే రామకృష్ణ (38) అనే వ్యక్తి తన భార్యకు అమ్మమ్మ అయిన వెర్రెమ్మను బుధవారం గొంతు కోసి హత్యచేశాడు.  కుటుంబ కలహాలే కారణమని కొత్తపేట పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 17, 2024

మే 5 నుంచి ఇంటి వద్ద ఓటు: కలెక్టర్

image

మే 5వ తేదీ నుంచి అర్హత ఉన్నవారికి ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలో 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40 శాతం వికలాంగులకు ఎన్నికల కమిషన్ ఈ అవకాశం కల్పించిందని కలెక్టర్ పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఓటు హక్కు కల్పిస్తామని కలెక్టర్ తెలియజేశారు. కావున ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.

News April 17, 2024

20న నెల్లూరుకు చంద్రబాబు నాయుడు

image

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 20న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం సర్వేపల్లి నియోజకవర్గంలో, సాయంత్రం కందుకూరు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడి ప్రచార సభలు జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా టీడీపీ కార్యాలయానికి సమాచారం అందింది.

News April 17, 2024

తూ.గో.: అక్కడ 6 సార్లు కాంగ్రెస్.. 5 సార్లు TDP మరి ఈ సారి..?

image

కోనసీమ జిల్లా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ 6 సార్లు, టీడీపీ 5 సార్లు, జనసేన, సీపీఐ, ఇండిపెండెంట్ ఒక్కోసారి విజయం సాధించాయి. ప్రస్తుతం వైసీపీ, జనసేన మధ్య పోటీ జరుగుతుంది. 1962, 67, 78, 89, 2004, 2009లో కాంగ్రెస్, 1983, 85, 94, 99, 2014లో TDP, 1955లో సీపీఐ, 1972లో ఇండిపెండెంట్, 2019లో జనసేన విజయం సాధించాయి. మరి ఈసారి విజయం ఎవరిదో చూడాలి.

News April 17, 2024

ఒంటిమిట్టలో చైత్రశుద్ధ పౌర్ణమి రోజు సీతారాముడి వివాహం

image

ఒంటిమిట్టలో 22న పున్నమి వెన్నెలలో రాములోరి కళ్యాణం నిర్వహిస్తారు. రాత్రే కళ్యాణం జరగడానికి పురాణాల్లో ఓ కథ ఉంది.. విష్ణుమూర్తి, లక్ష్మిదేవి వివాహం పగలు జరుగుతుంది. తాను అక్క లక్ష్మిదేవి పెళ్లిని చూడలేకపోతున్నానని చంద్రుడు విష్ణుమూర్తికి చెప్పడంతో.. నీ కోరిక రామావతారంలో తీరుతుందని చంద్రుడికి విష్ణుమూర్తి వరమిస్తాడు. అందుకే ఈ ఆలయంలో నవమి రోజు కాకుండా చైత్రశుద్ధ పౌర్ణమిన సీతారాముల వివాహం జరుగుతుంది.

News April 17, 2024

రాచర్ల: ట్రాక్టర్ బోల్తా.. ఒకరి మృతి

image

రాచర్ల మండలం చినగానపల్లె గ్రామ సమీపంలో బుధవారం ట్రాక్టర్ వాటర్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు 108 వాహనంలో బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.