Andhra Pradesh

News April 17, 2024

సివిల్స్‌లో అనంత జిల్లా వాసికి జాతీయ స్థాయి ర్యాంక్

image

మంగళవారం విడుదల చేసిన సివిల్స్ ఫలితాలలో గుంతకల్లు పట్టణానికి చెందిన ధనుశ్‌కు జాతీయస్థాయిలో 480వ ర్యాంకు వచ్చింది. గుంతకల్లు పట్టణంలో పుట్టి పెరిగిన ధనుశ్ బీటెక్ పూర్తి చేశారు. సివిల్స్ పరీక్షలకు తాను ఎటువంటి కోచింగ్ తీసుకోలేదని పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను, ఆంగ్ల దినపత్రికలను చదువుతూ ముఖ్యమైన విషయాలను నోట్స్ లో రాసుకుంటూ పరీక్షలకు సిద్ధమైనట్లు ఆయన చెప్పారు.

News April 17, 2024

కాకినాడ: వరుపుల V/S వరుపుల

image

ప్రత్తిపాడులో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ పోటీచేస్తున్న వైసీపీ, TDP- జనసేన- BJP కూటమి అభ్యర్థుల ఇంటిపేర్లు ఒకటే కావడం గమనార్హం. YCP నుంచి వరుపుల సుబ్బారావు బరిలో నిలవగా..కూటమి నుంచి వరుపుల సత్యప్రభ ఉన్నారు. 1985, 1989, 1999లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన సుబ్బారావు 3 సార్లు ఓటమి చెందారు. ఆ తర్వాత 2004లో గెలుపొందారు. 2009 ఓడి, 2014లో గెలిచారు. 2019లో పోటీలో లేరు. తాజాగా మరోసారి బరిలో నిలిచారు.

News April 17, 2024

సత్తెనపల్లిలో మంత్రి అంబటి ఫొటోతో టీ కప్పులు

image

సత్తెనపల్లిలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో పట్టణంలోని టీ స్టాల్‌లలో మంత్రి అంబటి రాంబాబు, నరసరావుపేట పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్‌ల ఫొటోలతో ఉన్న టీ కప్పులు దర్శనమిస్తున్నాయి. కొందరు వైసీపీ నాయకులు తమకు ఈ కప్పులు ఇచ్చారని, టీ కొట్టు నిర్వాహకులు చెబుతున్నారు.

News April 17, 2024

NTR: ఇన్‌స్టాలో లవ్.. సొంతింటికే బాలిక కన్నం

image

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన శ్రీనివాసరావు హైదరాబాద్‌లో ఉంటున్నారు. మరదలి కూతురు(13) ఇతని వద్దే ఉంటోంది. ఆ బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో బెంగళూరులో చదివే విజయ్‌తో పరిచయం ఏర్పడి, ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలో బాలిక శ్రీనివాసరావు ఇంట్లోని నగలు, నగదు చోరీ చేసి అతనికి పంపేది. ఇటీవల డబ్బులు పోవడం గమనించిన శ్రీనివాసరావు బాలిక ఫోన్లో వాట్సాప్ చూడగా బండారం బయటపడింది. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు.

News April 17, 2024

కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలివే.!

image

కర్నూలులో బుధవారం లీటర్ పెట్రోల్ ధర రూ.108.91 ఉండగా గత పది రోజులుగా 109.22 ఉంది. అలాగే లీటర్ డీజిల్ ధర నేడు రూ.96.80గా ఉండగా..గత పది రోజులుగా రూ.97.09 ఉంది.అలాగే నంద్యాల జిల్లాలో పెట్రోల్ నేడు రూ.109.89 ఉండగా మంగళవారం రూ.109.76 ఉంది. డీజిల్ రూ.97.69 ఉంది.

News April 17, 2024

కడప: సెల్‌ఫోన్‌లోనే అసలు నిజం?

image

కడప YVUలో ఆదివారం విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. రంజాన్‌కు ఇంటికి వెళ్లి తిరిగి వచ్చిన సుల్తానా(23) మరుసటి రోజు కాలేజ్‌కు వెళ్లి అరగంట ముందే హాస్టల్‌కు వచ్చి ఉరివేసుకున్నట్లు తోటి విద్యార్థినిలు తెలిపారు. అయితే ఆత్మహత్యకు పాల్పడే ముందు ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడిందని చెప్పారు. దీంతో ఫోన్‌కాల్‌పై అనుమానం వ్యక్తం చేసి సెల్‌ఫోన్‌ను సీజ్ చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

News April 17, 2024

గుర్రంకొండ: విషం తాగి ఇద్దరి ఆత్మహత్యాయత్నం

image

గుర్రంకొండ దవలత్ ఖాన్ పల్లికి చెందిన ఇద్దరు వాస్మాల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం.. గ్రామానికి చెందిన ఒకరి భార్య మరోక పురుషుడితో ఒకచోట ఉండగా భర్త గమనించి భార్యను మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె వాస్మొల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి కూడా విషం తాగేశాడు. ఇద్దరిని వేరువేరు వాహనాల్లో మదనపల్లికి తరలించారు.

News April 17, 2024

శ్రీకాకుళం: శ్రీరామనవమి శుభాకాంక్షలతో సైకత శిల్పం

image

ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస సమీపంలో గల శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం కొండ దిగువన శిల్పి గేదెల హరికృష్ణ రూపొందించిన శ్రీరాముని సైకత శిల్పం పలువురిని ఆకట్టుకుంది. శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సైకత శిల్పం రూపొందించినట్లు హరికృష్ణ పేర్కొన్నారు. ఈ సైకత శిల్పాన్ని మంగళవారం తిలకించిన పలువురు భక్తులు ఆయనను అభినందించారు.

News April 17, 2024

కర్నూలు: క్లస్టర్ యూనివర్సిటీలో సెమిస్టర్ పరీక్షలు

image

కర్నూలులోని క్లస్టర్ యూనివర్సిటీ అనుసంధానంలో ఉన్న కే.వీ.ఆర్ డిగ్రీ కాలేజ్, సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ కాలేజీలలో సెమిస్టర్ 2, 4వ రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.రేపటి నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డీవీఆర్ సాయి గోపాల్ తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు హాల్ టికెట్, ఐడి కార్డ్, యూనిఫామ్ తప్పనిసరి అన్నారు.

News April 17, 2024

గుంటూరు జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలివే.!

image

గుంటూరులో బుధవారం లీటర్ పెట్రోల్ ధర రూ.109.73, లీటర్ డీజిల్ ధర రూ.97.56గా ఉంది. పది రోజులుగా వీటి ధరలు నిలకడగానే ఉన్నాయి. బాపట్లలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.98 ఉండగా, డీజిల్ ధర రూ.96.85గా ఉంది. పల్నాడులో డీజిల్ ధర రూ.97.42 ఉండగా, పెట్రోల్‌ను రూ.109.60కి విక్రయిస్తున్నారు.