Andhra Pradesh

News April 17, 2024

తూ.గో.: సీతారాముల కళ్యాణానికి 24 ఏళ్లుగా..

image

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఒంటిమిట్ట, భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కళ్యాణోత్సవాలకు మండపేటకు చెందిన కేవీఏ.రామారెడ్డి 24 ఏళ్లుగా అలంకరించిన బోండాలను అందిస్తున్నారు. అక్కడ పరిణయోత్సవం ముగిసిన తర్వాత వాడపల్లి వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం, జి.మామిడాడ, సత్యవాడ, రామతీర్థంలో నిర్వహించే వేడుకలకు ఇస్తారని తెలిపారు.

News April 17, 2024

VZM: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

విజయనగరంలోని ఎత్తు వంతెన సమీపంలో ట్రావెల్ బస్సు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గంట్యాడ మండలానికి చెందిన ఎస్ చిమ్మనాయుడు (43) విజయనగరంలోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి పని ముగించుకొని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా, విశాఖ వైపు వెళ్తున్న బస్సు వంతెన వద్ద ఢీకొంది. ప్రమాదంలో చిమ్మనాయుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News April 17, 2024

ప్రకాశం: ఎలుకల మందు తిని యువకుడు మృతి

image

ఎలుకల మందు తిని యువకుడు మృతిచెందిన ఘటన కొత్తపట్నం మండలం రంగాయపాలెం పంచాయతీ క్రాంతినగర్‌లో మంగళవారం జరిగింది. SI సాంబశివరావు వివరాల మేరకు.. గ్రామానికి చెందిన విశ్వనాథపల్లి కల్యాణ్‌ (39) చేపల వేటతో జీవనం సాగిస్తుంటాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అప్పు చేసి తీర్చలేకపోయాడు. దీంతో మనస్తాపం చెంది ఎలుకలు మందు తిని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.

News April 17, 2024

అవనిగడ్డలో బాలికపై అఘాయిత్యం

image

అవనిగడ్డలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్న యువకుడు మరో ఇద్దరు యువకులతో కలసి కబడ్డీ క్రీడలో మెలకువలు నేర్పిస్తామని బాలికను లోబరుచుకున్నట్లు సమచారం. ఈ క్రమంలో బాలిక వీడియోలు తీసి, తమకు సహకరించకుంటే వీడియోలు బయట పెడతామని బెదిరించినట్లు తెలుస్తోంది. ఘటనపై డీఎస్పీ మురళీధర్ విచారణ చేస్తున్నారు.

News April 17, 2024

పులివెందుల: టన్ను చీనీ ధర రూ. 40 వేలు

image

పులివెందుల వ్యవసాయ చీనీ మార్కెట్లో చీనీ కాయల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే టన్ను ధర రూ.35 వేల నుంచి రూ.40 వేలు పలకడంతో చీనీ సాగు చేసిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లింగాల, సింహాద్రిపురం, తొండూరు, వేముల, పులివెందుల మండలాల్లోని పలు గ్రామాల నుంచి మంగళవారం ఒక్కరోజే 650 టన్నుల చీనీ కాయలు పులివెందుల చీనీ మార్కెట్‌కు వచ్చినట్లు నిర్వహకులు తెలిపారు.

News April 17, 2024

కాకినాడ: అచ్చంపేటలో 19న మేమంతా సిద్ధం సభ

image

కాకినాడ రూరల్‌ మండలం తిమ్మాపురం పరిధిలోని అచ్చంపేటలో ఈ నెల 19వ తేదీన సీఎం జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం సభ జరగనుంది. ఈ సందర్భంగా సభా ఏర్పాట్లను రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తదితరులు మంగళవారం పరిశీలించారు. సభా వేదిక, ర్యాంపు ఏర్పాటు, ప్రజలకు ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌, తదితరులు ఉన్నారు.

News April 17, 2024

విశాఖ: సివిల్స్ ఫలితాల్లో 545వ ర్యాంకు

image

అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ తుది ఫలితాలు మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలానికి చెందిన విద్యార్థి సత్తా చాటారు. హుకుంపేట మండలంలోని అండిభ గ్రామానికి చెందిన చిట్టపులి నరేంద్ర పడాల్ అనే విద్యార్థి జాతీయ స్థాయిలో 545 ర్యాంకు సాధించారు. ఈమేరకు ఆయనను పలువురు అభినందించారు.

News April 17, 2024

విశాఖలో పెన్సిల్ ముల్లుపై శ్రీరాముడి రూపం

image

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకి చెందిన సూక్ష్మ కళాకారుడు గట్టెం వెంకటేశ్ పెన్సిల్ ముల్లుపై శ్రీరాముడి రూపాన్ని అద్భుతంగా చెక్కారు. ఇప్పటికే గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి, ఎన్నో అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. తాజాగా 6 హెచ్‌బీ పెన్సిల్ ముల్లుపై, 6 గంటల పాటు శ్రమించి 8మి.మీ వెడల్పు, 20మి.మీ పొడవులో శ్రీరాముడి రూపాన్ని చెక్కారు.

News April 17, 2024

సివిల్స్‌లో మెరిసిన శాసనమండలి ఛైర్మన్ తనయుడు

image

శాసనమండలి ఛైర్మన్ కొయ్యె మోషేను రాజు తనయుడు చిట్టి రాజు ఈరోజు విడుదలైన 2024 సివిల్స్ ఫలితాల్లో 833వ ర్యాంక్ సాధించారు. సంతోషం వ్యక్తం చేసిన శాసనమండలి ఛైర్మన్ కుటుంబ సభ్యులు ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చిట్టి రాజును పట్టణంలోని పలువురు ప్రముఖులు అభినందించారు.

News April 17, 2024

నెల్లూరును ఇండస్ట్రియల్  కారిడార్‌గా అభివృద్ధి చేస్తా: వేమిరెడ్డి

image

తాను గెలిస్తే నెల్లూరును ఇండస్ట్రియల్ కారిడార్‌గా అభివృద్ధి చేస్తానని నెల్లూరు టిడిపి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం రామలింగపురం, ముత్యాలపాలెం ప్రాంతాలలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.