India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కృష్ణా వర్సిటీ పరిధిలో డిసెంబర్ 2023లో నిర్వహించిన Mcom, MA, MED, MHR, SWO 3వ సెమిస్టర్ పరీక్షలకు(2022-23 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 22వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.9,00 చెల్లించాల్సి ఉంటుందని పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలన్నారు.
శ్రీకాకుళంలోని పలాస మండలం కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందిన సూక్ష్మకళాకారుడు కొత్తపల్లి రమేష్ ఆచారి రామభక్తి చాటుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా బంగారంతో సూది మీద నిలబడే రామబాణంను మంగళవారం తయారుచేశారు. ఏటా వివిధ ప్రత్యేకతలు కలిగిన రోజుల్లో ఆయా పండగలకు తగ్గట్టుగా సూక్ష్మ ఆకృతులు తయారుచేయడం అలవాటు అని చెబుతున్నారు.
రౌతులపూడి మండలం గిడజాంకు చెందిన పూడి తాతాజీ తన కౌలు భూమిలో కొబ్బరి మొక్కలు వేసి రక్షణకు విద్యుత్ తీగలు అమర్చాడు. సోమవారం అదే గ్రామానికి చెందిన సత్తిబాబు(42) గేదెలు మేపేందుకని వెళ్లి ఆ తీగలు తగిలి చనిపోయాడు. తాతాజీ భయంతో మృతదేహాన్ని ఖననం చేశాడు. రాత్రయినా సత్తిబాబు ఇంటికి రావట్లేదని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. వారు రంగంలోకి దిగి తాతాజీని విచారించగా నిజం ఒప్పుకున్నాడు. కేసు నమోదైంది.
ఇంటర్ అడ్మిషన్లపై షెడ్యూల్ ను బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ విడుదల చేసినట్లు ఆర్ ఐవో సైమన్ విక్టర్ తెలిపారు. అడ్మిషన్లను రెండు దశల్లో నిర్వహిస్తారు. మే 15 నుంచి కళాశాలల్లో దరఖాస్తులు విక్రయిస్తారు. మే 22నుంచి విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తారు. రెండో దశ అడ్మిషన్లకు జూన్ 10నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. జూలై 1కి అడ్మిషన్లు పూర్తి చేయాలి.
బద్వేల్‌కు చెందిన మర్రిపాటి నాగ భరత్ యూపీఎస్సీ ప్రకటించిన సివిల్స్ ఫలితాలలో 580 ర్యాంక్ సాధించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎంటెక్ పూర్తి చేశారు. సివిల్స్ పరీక్షలకు ఢిల్లీ, హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకున్నారు. గతేడాది కూడా ఇంటర్వ్యూ స్థాయికి వెళ్లారు. 580వ ర్యాంకు సాధించడం పట్ల నాగ భరత్ తండ్రి ఎం.నాగరాజ సంతోషం వ్యక్తం చేశారు. నాగరాజు బద్వేల్ ఏడీఏగా పనిచేస్తున్నారు.
గుర్రంకొండ మండలం తుమ్మల గొందిలో భూ వివాదం తలెత్తి తమ్ముడిని అన్న తుపాకీతో కాల్చి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితుని కథనం.. మండలంలోని తుమ్మల గొంది హరిజనవాడలో కాపురం ఉంటున్న బాలపోగు విశ్వనాథ(45)కు అతని అన్న బాలపోగు జయప్పకు కొంతకాలంగా భూ వివాదమై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాత్రి ఇద్దరూ గొడవపడగా జయప్ప తుపాకీతో కాల్చారు.
నెల్లూరు సిటీ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ ప్రాతినిధ్యం వహిస్తున్న 43వ డివిజన్‌కు చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు పలువురు టీడీపీలో చేరారు. మంగళవారం సాయంత్రం నగరంలోని జండా వీధిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారందరికీ ఎన్డీఏ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ పార్టీ కండువాలు కప్పారు.
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచే అభ్యర్ధుల ఖాతాలో ఖర్చు లెక్కించేందుకు సిద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అభ్యర్థి నామినేషన్ వేసిన దగ్గరనుంచీ అతని ఖాతాలో పక్కాగా ఖర్చు నమోదు చేయాలన్నారు.
ఎన్నికల ఏర్పాట్లపై చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ సమీక్షలో విశాఖ నుంచి కలెక్టర్ మల్లికార్జున, జాయింట్ కలెక్టర్ కే మయూరి అశోక్, డిఆర్ఓ మోహన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే నామినేషన్ల ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ మల్లికార్జున తెలిపారు.
చినమేరంగి, జియ్యమ్మవలస పోలీస్ స్టేషన్ పరిధిలో గల వివిధ పోలింగ్ కేంద్రాలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి ఎన్నికల ప్రవర్తన నియమావళి గూర్చి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమస్యాత్మక గ్రామాలలో ఎన్నికల ప్రశాంతంగా జరుగుటకు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు అందించారు.
Sorry, no posts matched your criteria.