India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బ్రహ్మంగారిమఠం మండలంలోని నందిపల్లె దొడ్ల డైరీ సమీపంలో జరిగిన కారును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో బద్వేల్‌కు చెందిన టీవీఎస్ షోరూం నిర్వాహకుడు అంబవరపు జయసుబ్బారెడ్డి(55) మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. టిప్పర్ కారును ఢీకొట్టడంతో కారులో ఉన్న సుబ్బారెడ్డికి తలకు తీవ్ర గాయాలుకావడంతో 108లో కడపకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ట్రాక్టర్ బోల్తా పడి వివాహిత మృతి చెందిన ఘటన ముప్పాళ్ల మండలం తురకపాలెంలో జరిగింది. తురకపాలెం గ్రామానికి చెందిన పలువురు పొలం పనుల నిమిత్తం ట్రాక్టర్‌లో వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో కృపావతి (40) మృతి చెందగా.. నలుగురికి గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాల తరలించి, క్షతగాత్రులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
గుంటూరులో ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటనపై మంగళవారం రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రైల్వే స్టేషన్‌లోని నాలుగో ఫ్లాట్ ఫారంపై వృద్ధుడు అపస్మారక స్థితిలో పడి ఉండగా అక్కడి సిబ్బంది ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని వివరాలు తెలిసిన వాళ్ళు గుంటూరు రైల్వే పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
సారవకోట మండల కేంద్రంలో 100 మంది వాలంటీర్లు మంగళవారం స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు. తమ రాజీనామా పత్రాన్ని సచివాలయం సెక్రటరీ ద్వారా ఎంపీడీవోకి అందజేశారు. తామంతా నిరుపేదలకు ఎన్నో సంక్షేమ , అభివృద్ధి పథకాలు అందించామన్నారు. కానీ కూటమి నాయకులు తమపై చేస్తున్న ఆరోపణలు బాధించాయన్నారు.
తూ.గో. జిల్లా రాజవొమ్మంగి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ మిరియాల పెంటారావు (42) మంగళవారం అనారోగ్యంతో మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు. కాకినాడ ఏపీఎస్పీలో పనిచేస్తున్న ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటివద్దే ఉంటున్నారు. పరిస్థితి విషమించడంతో అంబులెన్సులో కాకినాడ GGHకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ గురువారం వెలువడనుంది. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నెల్లూరు కలెక్టర్ హరినారాయణ్ ప్రకటించారు. మరోవైపు అభ్యర్థులు తమ నామినేషన్ల దాఖలుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మంచి ముహూర్తం కోసం జ్యోతిష్య పండితులను ఆశ్రయిస్తున్నారు. ప్రధాన అభ్యర్థులందరూ నామినేషన్ పత్రాలను నింపే బాధ్యతను అనుభవం ఉన్న న్యాయవాదులకు అప్పగిస్తున్నారు.
ఫుట్ పాత్ కోసం వేసే టైల్ రాయిని జేబులో వేసుకుని వచ్చి సడన్‌గా సీఎం జగన్‍పై సతీశ్ అనే యువకుడు దాడి చేసినట్లు సిట్ అధికారులు మంగళవారం తెలిపారు. వారు మాట్లాడుతూ.. అతడితో పాటు ఉన్న ఆకాశ్, దుర్గారావు, చిన్న, సంతోష్‍లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. దాడి వెనుక ఉన్న కారణాలపై యువకులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
పాలకొండ రోడ్డులో ఉన్న కోదండ రామాలయం 200 ఏళ్ల కిందట అళ్వార్లు నిర్మించారు. 1826లో అయోధ్య నుంచి నాటు బండ్లపై సీతారామ విగ్రహాలను తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. కోదండ రామాలయంగా ఉన్న ఈ ప్రదేశంలో అద్దమడుగుల వెంకన్న పంతులు పేదవారికి, అనాథల కోసం అన్నసత్రం ఏర్పాటు చేశారని, ఆయన ఆధ్వర్యంలోనే కోదండ రామాలయం నిర్మించినట్టు అర్చకులు బంకుపల్లి శేషాచార్యులు తెలిపారు.
తాను ఎక్కడ నుండి పోటీ చేస్తానన్న విషయంపై ఈ నెల 18వ తేదీ లోపు స్పష్టత వస్తుందని సస్పెన్స్‌కి తెరపడుతుందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు తెలిపారు. మంగళవారం ఆయన నివాసంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాను ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయు విషయంపైన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి తన నుదుటిన ఏం రాశాడో అంటూ వ్యంగంగా స్పందించారు.
తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలు ఇస్తామని వచ్చిన మెసేజ్‌కు యువతి మోసపోయిన ఘటన గజపతినగరం మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని పురిటిపెంటకి చెందిన ఓ యువతికి తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలు ఇస్తామని మెసేజ్ వచ్చింది. నమ్మిన యువతి దశలో వారీగా రూ.14.15 లక్షలు జమ చేసింది. అటు నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో మోసపోయానని గ్రహించి ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.