India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరు పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల విధుల నిర్వహణకు 4600 మంది పోలింగ్ అధికారులను నియమించారు. ఇందులో సోమవారం మొదటి విడతగా 2300 మందికి శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరవ్వని 45 మందికి షోకాజు నోటీసులు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. నోటీసులు అందుకున్న వారు 24 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలని స్పష్టం చేశారు.
గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ప్రవేశానికి మిగిలిన సీట్లు భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని, మెరిట్ లిస్టులో పేర్లు ఉన్న విద్యార్థులు హాజరు కావాలని గురుకుల విద్యాలయ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ఎన్ బాలాజీ ప్రకటించారు. ఈ ఏడాది పరీక్ష రాసిన విద్యార్థులలో బాలురకు ఈనెల 18వ తేదీన దుప్పలవలస గురుకుల పాఠశాలలో, 19న బాలికలకు పెద్దపాడు గురుకుల పాఠశాలలో ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సిద్ధం బస్సు యాత్ర మంగళవారం తూ.గో.జిల్లాలో ప్రవేశించనుంది. జిల్లాలోని సిద్ధాంతం మీదుగా రావులపాలెం మండలం ఈతకోట చేరుకుంటుంది. అక్కడ జాతీయ రహదారి పక్కన లేఔట్‌లో ఏర్పాటుచేసిన శిబిరంలో రాత్రి బసచేస్తారు. 17న శ్రీరామనవమి నేపథ్యంలో ప్రచారానికి విరామం ప్రకటించారు. 18వ తేదీ ఉదయం 10 గంటలకు రోడ్ షో ప్రారంభమవుతుంది. రావులపాలెం మీదుగా రాజమండ్రి చేరుకుంటారు.
సీఎం జగన్‌పై సింపతీ ఎక్కడ పెరిగిపోతుందోనన్న భయం టీడీపీలో మొదలైందని.. అందుకే చంద్రబాబు తన మీద తానే రాళ్లు వేయించుకుంటున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ‘అలిపిరి బాంబ్ బ్లాస్ట్ తర్వాత చంద్రబాబు ఎన్నికలకు వెళ్లారు. సింపతీతో ప్రజలు ఓట్లు వేయరని ఆ ఘటన నిరూపించింది. సీఎం జగన్‌పై దాడి విషయంలో చంద్రబాబు, లోకేశ్ నీచంగా మాట్లాడుతున్నారు’ అని పెద్దిరెడ్డి మండిపడ్డారు.
తెలుగు సినిమా హాస్యనటుడు M.S నారాయణగా పిలవబడే మైలవరపు సూర్యనారాయణది ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు. నేడు ఆయన జయంతి. ఎమ్మెస్ నారాయణ 1951 ఏప్రిల్ 16న జన్మించారు. ఆయన రచయితగా, దర్శకుడిగా, హాస్యనటుడిగా 17 సంవత్సరాలు సినీ రంగంలో సుమారు 700కు పైగా చిత్రాలలో నటించారు. అలాగే అనారోగ్య కారణాలతో 2015 జనవరి 23వ తేదీన హైదరాబాదులో మరణించారు.
రాష్ట్రంలో సీఎం జగన్ రెడ్డి పాలనలో శాంతిభద్రతలు లోపించాయని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జి విమర్శించారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గాజువాక ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్న సమయంలో రాయితో దాడి చేయడానికి ఖండించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగన్ సీఎం అయ్యాక దాడుల సంస్కృతి పెరిగిపోయిందన్నారు. అలాగే శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడిందన్నారు.
తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక కూతురు మృతిచెందిన ఘటన పార్వీతీపురం మండలంలో జరిగింది. పెదమరికి గ్రామానికి చెందిన భుజంగరావు (45), ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడిపేవాడు. అతని కుమార్తె రోషిణి (19) తండ్రికి చేదోడుగా ఉండేది. మార్చి 31న భుజంగరావు మృతిచెందాడు. అప్పటి నుంచి సరిగా భోజనం చేయక, నిద్రపోకుండా ఉండిపోయింది. ఆదివారం రాత్రి నీరసంగా ఉందని నిద్రపోయింది. ఎంతకీ లేవకపోవడంతో తల్లి చూడగా అప్పటికే మృతిచెందింది.
జిల్లాలోని కురిచేడు మండలం మర్లపాలెం వద్ద రైల్వే ట్రాక్‌పై ఉన్న పాత పట్టాలను లారీలోకి లోడు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు ఒకటి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం బిహార్‌కు చెందిన అనిష (40) రైలు పాత పట్టాలను లారీకి లోడ్ చేస్తుండగా, అతనిపై రైలు పట్టా జారి పడింది. క్షతగాత్రుడిని దర్శి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందారని వైద్యులు తెలిపారు.
ఓబులవారిపల్లె మండలంలోని చిన్నఓరంపాడులో YCP, TDP వర్గాలు కత్తులతో దాడి చేసుకున్నారు. గ్రామానికి చెందిన నరసింహులు, శంకరయ్యల మధ్య ఇంటి స్థలానికి సంబంధించి 2ఏళ్లుగా వివాదం ఉండటంతో సోమవారం రాత్రి ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగినట్లు స్థానికలు తెలిపారు. TDPకి చెందిన నరసింహులు, లక్ష్మీదేవి, చెంగమ్మ, నాగేశ్వరి, YCPకి చెందిన శంకరయ్య, నాగేంద్ర గాయపడ్డారు. కేసు నమోదు చేసినట్లు SI చిన్న పెద్దయ్య తెలిపారు.
ఢిల్లీ వెళ్లి తిట్లు తిని, చంద్రబాబుని CM చేయడానికి పవన్ నానా కష్టాలు పడినా క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలు పవన్‌ను పట్టించుకోవడం లేదని వైసీపీ నేత పోతిన మహేశ్ ట్వీట్ చేశారు. అభిమానుల్ని జెండా కూలీలుగా మార్చి, నమ్మిన వారిని నట్టేట ముంచి విశ్వాసం చూపినా తెనాలిలో జరిగిన పవన్ సభకు అక్కడి టీడీపీ నేత ఆలపాటి రాజా హాజరు కాలేదన్నారు. టీడీపీ నేతలు పవన్ మొహం చూడటంలేదంటూ పోతిన పవన్‌పై ఫైరయ్యారు.
Sorry, no posts matched your criteria.