India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆత్మకూరు మండలం కొత్తపల్లి సమీపంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బైక్‌ను ఢీకొడంతో ఎర్రిస్వామి గాల్లోకి ఎగిరి కారుపై పడి మృతిచెందాడు. డ్రైవర్ కారును ఆపకుండా సుమారు 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించి హనిమిరెడ్డిపల్లి వద్ద ఆపాడు. అనంతరం పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
జబర్దస్త్ రోజా ఇంట్లో నలుగురు మంత్రులు ఉన్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. పుత్తూరులో నిన్న రాత్రి జరిగిన న్యాయ యాత్రలో ఆమె మాట్లాడారు. ‘రోజా, ఆమె భర్త, ఇద్దరు అన్నలు కలిసి భూములు కబ్జా చేశారు. ఇసుక దోచుకున్నారు. రోజమ్మ నగరి కోసం ఏ ఒక్క రోజూ పని చేయలేదు. ఇసుక, మట్టితో దోచుకున్న డబ్బులే ఆమె మీకు ఇస్తోంది. రానున్న ఎన్నికల్లో ఆమె ఓడిపోతుంది’ అని షర్మిల జోస్యం చెప్పారు.
నారా చంద్రబాబు నాయుడు నేడు శ్రీకాకుళం జిల్లాకు రానున్నారు. పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు సాయంత్రం 5.15 గంటలకు చేరుకుంటారు. అనంతరం బస్సులో ఇందిరా చౌక్ కూడలి వద్దకు చేరుకుని 6 నుంచి 7.30 గంటల వరకు ప్రసంగిస్తారు. 7.40 గంటలకు సభా కూడలి నుంచి బస్సులో పలాస టీడీపీ నూతన కార్యాలయానికి వెళ్లి అక్కడే బస చేస్తారు. తరువాత రోజు శ్రీకాకుళం నాయకులతో సమీక్ష నిర్వహిస్తారు.
గత ఎన్నికలకు ముందు జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన కోడికత్తి దాడి విషయంలోనూ అందరూ ముందు దాడి అన్నారని, ఆ తర్వాత డ్రామా అన్నారని ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. రాజమండ్రిలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం జరిగిన దాడి కూడా నిజంగా జరిగిందా లేదా ఓట్ల సానుభూతి కోసం చేయించారా అన్నది తెలియాల్సి ఉందన్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీచేసే విషయంపై ఆలోచిస్తానన్నారు.
ఇడుపులపాయలోని IIITలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. మెకానికల్ ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సురేఖ హాస్టల్ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే స్పందించిన IIIT అధికారులు ఆమెను కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ సురేఖ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతి చెందిన విద్యార్థి ప్రకాశం జిల్లా జంగం గుంట్ల గ్రామానికి చెందిన అమ్మాయిగా గుర్తించారు. వివరాలు
సీఎం జగన్ యాత్ర నేడు కేసరపల్లి నుంచి ప్రారంభం కానుందని సీఎం కార్యాలయం తెలిపింది. ఈ మేరకు రూట్ మ్యాప్‌ను విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, జొన్నపాడు మీదుగా యాత్ర గుడివాడ చేరుకుంటుంది.
మధ్యాహ్నం 3.30 గంటలకు అక్కడ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. అనంతరం గుండుగొలను మీదుగా నారాయణపురం చేరుకుని రాత్రికి అక్కడే జగన్ బస చేస్తారని తెలిపారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఆశయాలు, ఆలోచనలు భావితరాలకు ఆదర్శనీయమని సినీ దర్శకుడు, నటుడు ఆర్ నారాయణ మూర్తి అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆదివారం రాత్రి హిరమండలం మండలం కొండరాగోలు గ్రామంలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు అంబేడ్కర్ విగ్రహాలను నిర్మించడం గొప్ప విషయం అన్నారు. గ్రామస్తులు నారాయణమూర్తికి ఘన స్వాగతం పలికారు.
అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని
కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఆదివారం కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించాలన్నారు.
కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో పేదరికంలో పుట్టి, బాల్య వివాహంను ఎదిరించి అధికారుల సహకారంతో ఇంటర్ టాపర్‌గా నిలిచిన నిర్మలను ఆదివారం జిల్లా కలెక్టర్ సృజన అభినందించారు. కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయంలో ఆస్పరి మండలం కేజీబీవీ కళాశాల విద్యార్థిని నిర్మల తన కుటుంబ సభ్యులతో కలెక్టర్‌ను కలిశారు. ఇంటర్మీడియట్ బైపీసీ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షల్లో నిర్మల టాపర్‌గా నిలవడం అభినందనీయమన్నారు.
కదిరి నియోజక వర్గానికి చెందిన పవన్ కుమార్ రెడ్డికి టీడీపీ రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించినందుకు చంద్రబాబు, లోకేశ్, నియోజక వర్గం అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్, చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.