Andhra Pradesh

News April 14, 2024

VZM: సీఎం జగన్‌పై దాడిని ఖండించిన కోలగట్ల

image

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిన్న జరిగిన దాడిని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఖండించారు. ప్రతిపక్షాలు చేసిన పిరికిపంద చర్యగా అభివర్ణించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి జరగడం హేయమైన చర్య అన్నారు. చేతకానితనంతో చేసే దాష్టీక చర్యగా పేర్కొన్నారు.

News April 14, 2024

దీని వెనుక మర్మమేమిటి: గంటా

image

చంద్రబాబు అరెస్టుకు ముందు హైకోర్టు జడ్జిలను దూషించిన కేసులో ప్రధాన నిందితుడైన సీఎం జగన్ సన్నిహితుడు శ్రీధర్ రెడ్డి, సంచలనం జరగబోతుంది అంటూ ట్విట్ చేసినట్లు భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. సరిగ్గా నాలుగు రోజుల కిందట అదేవిధంగా శ్రీధర్ రెడ్డి ట్విట్ చేసినట్లు పేర్కొన్నారు. దీని వెనుక మర్మమేమిటి అనే విషయాన్ని సీబీఐ తేల్చాలంటూ గంటా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

News April 14, 2024

గుంటూరు: మరికొద్ది గంటలే గడువు

image

జిల్లాలో అర్హత కలిగిన యువతి, యువకులు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శివ శంకర్ కోరారు. కొత్తగా ఓటు హక్కు పొందేందుకు ఏప్రిల్14 ఆదివారం రాత్రి 12 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. భారత ఎన్నికల సంఘం నూతన ఓటర్లుకు అవకాశం కల్పించిందని అన్నారు. 2024 ఏప్రిల్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటు పొందేందుకు బీఎల్‌ఓలకు గాని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.

News April 14, 2024

ప.గో. జిల్లాలో సీఎం జగన్ పర్యటన వాయిదా

image

భీమవరంలో 15వ తేదీన జరగాల్సిన సీఎం పర్యటన వాయిదా పడిందని.. 16వ తేదీన ఉంటుదని వైసీపీ నాయకులు తెలిపారు. విజయవాడలో సీఎంపై జరిగిన దాడి నేపథ్యంలోనే వాయిదా పడిందని చెప్పారు. కాగా 16న జరిగే బస్సుయాత్ర, బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

News April 14, 2024

విశాఖ: ‘కొత్త డ్రామాకు తెరలేపిన జగన్’

image

సీఎం జగన్ రెడ్డి కొత్త డ్రామాకు తెర లేపినట్లు విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జి అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్ల కాలంలో ప్రజల కోసం జగన్ రెడ్డి ఒక్క మంచి పని చేయలేదని విమర్శించారు. కేవలం దోచుకోవడం ప్రతిపక్షాలపై దాడులు చేయడం తప్ప ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. రాష్ట్రంలో ఐటీ రంగాన్ని సర్వనాశనం చేశాడన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేశాడన్నారు.

News April 14, 2024

మరో కోడి కత్తి డ్రామాకు తెర లేపిన జగన్: అచ్చెన్న

image

ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే సీఎం జగన్ మరో కోడి కత్తి డ్రామాకు తెరలేపారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు అన్నాడు. ఆదివారం పలాసలోని పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతోందని తెలిసే జగన్ కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 160 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  

News April 14, 2024

ప్రకాశం: బాబోయ్.. మండిపోతున్న ఎండలు

image

ప్రకాశం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రతిరోజు 38 డిగ్రీలు పైబడి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఇళ్లకే పరిమితమైపోతున్నారు. ఒకవైపు పాలిటిక్స్ హీట్ పుట్టిస్తుంటే మరి వైపు భానుడు తన ప్రతాపాన్ని చాటుతున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం ఉక్కుపోతకు గురవడంతో పాటు వృద్ధులు, చిన్న పిల్లలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.

News April 14, 2024

రేపు, ఎల్లుండి కర్నూలు జిల్లాలో బాలకృష్ణ పర్యటన: బీటీ నాయుడు

image

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఈనెల 15, 16వ తేదీలలో కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు వెల్లడించారు. 15న కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్ ఆటో స్టాండ్ నుంచి ర్యాలీ ప్రారంభమై కొండరెడ్డి బురుజు వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. రాత్రికి కర్నూలులోనే బస చేసి, 16న ఎమ్మిగనూరులో సాయంత్రం 4 గంటలకు, కోసిగిలో సాయంత్రం 6 గంటలకు ప్రసంగిస్తారని వివరించారు.

News April 14, 2024

బాపట్ల: అగ్ని ప్రమాదంలో వరిగడ్డి ట్రాక్టర్ దగ్ధం

image

అగ్ని ప్రమాదం జరిగి గడ్డి తరలిస్తున్న ట్రాక్టర్ దగ్ధమైన సంఘటన పొన్నూరు మండలం కసుకర్రు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెం గ్రామం నుంచి గడ్డిని తరలిస్తుండగా కసుకర్రు గ్రామం వద్ద విద్యుత్ వైర్లు తగిలి ట్రాక్టర్లు మంటలు చెలరేగాయి. ట్రాక్టర్ వల్లూరు గ్రామానికి చెందిన శివారెడ్డిదిగా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు.

News April 14, 2024

కోవూరులో 30 మంది వాలంటీర్లు రాజీనామా

image

కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం చౌకచర్ల పంచాయతీ పరిధిలోని13 మంది వాలంటీర్లు, కోవూరు మండలం పాటూరు పంచాయతీకి సంబంధించిన 17 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి మద్దతు పలికి వైసీపీలో చేరారు. కార్యక్రమంలో నల్లపరెడ్డి రాజేంద్రరెడ్డి, నిరంజన్ బాబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.