India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యద్దనపూడి మండలంలోని జాగర్లమూడికి చెందిన వీఆర్వో కాలేషావలి(46) ఆకస్మికంగా మృతిచెందాడు. ఎన్నికల నేపథ్యంలో బాపట్లలోని ఈవీఎంల స్ట్రాంగ్ రూం వద్ద విధులకు హాజరయ్యారని సహచర వీఆర్వోలు వెల్లడించారు. రాత్రి సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురవ్వడంతో వైద్య సేవల కోసం చీరాలకు తరలించినట్లు చెప్పారు. వైద్యులు వచ్చి సేవలందించే సరికి అప్పటికే మృతిచెందినట్లు వెల్లడించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై జరిగిన రాయి దాడిని తన సోదరి వైఎస్ షర్మిల ఖండించారు. ప్రొద్దుటూరులో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రిపై జరిగిన రాయి దాడిని ఆమె దురదృష్టకరమైన ఘటన అంటూ ఖండిస్తూ ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందని భావిస్తున్నామని ఆమె తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో హింసకు తావు లేదని స్పష్టం చేశారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదివారం పాయకరావుపేట, గాజువాకల్లో ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. ప్రత్యేక విమానంలో బయలుదేరి 2.05కు విశాఖ చేరుకుంటారు. అక్కడ నుంచి 2.10కు హెలికాప్టర్‌లో బయలుదేరి 2.35కు పాయకరావుపేట సభలో పాల్గొంటారు. సాయంత్రం 4.40కు హెలికాప్టర్‌లో విశాఖ ఎయిర్‌పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గాన 5.35కు పాతగాజువాక చేరుకుంటారు. సా. 6 నుంచి 7.30 వరకు ఎన్నికల సభలో పాల్గొంటారు.
ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రంజాన్ పండగ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న విక్రమ్ రెడ్డి ఎన్నికల నిబంధనలను అతిక్రమించారని ఎంసీసీ నోడల్ అధికారి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఆత్మకూరు ఎస్సై ముత్యాలరావు తెలిపారు.
శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాహు కేతు పూజలు చేయించారు. దర్శనం అనంతరం స్వామి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎస్ వి నాగేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.
సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో భాగంగా సోషల్ మీడియాలో ప్రసారమయ్యే కథనాలపై ఎన్నికల కమీషన్ ప్రత్యేక దృష్టి సారించిందని కలెక్టర్ విజయ్ రామరాజు శనివారం పేర్కొన్నారు. ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, లా & ఆర్డర్, ఎన్నికల సమగ్రత, ఎన్నికల ప్రణాళిక అంశాలపై నకిలీ కథనాలు ప్రసారం చేయద్దన్నారు.
కొత్త కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ శనివారం సందర్శించారు. కంట్రోల్ రూంలో ఎంసీఎంసీ, సోషల్ మీడియా, డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ సెంటర్ 1950, కంప్లైంట్ మోనిటరింగ్ సెల్, పోలీసు కంట్రోల్ రూం, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, సీ-విజిల్ విభాగాల్లో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో అక్రమ మద్యం ఛాయలు కూడా ఉండకుండా గట్టి నిఘా వేసి చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అమిత్ ఆదేశించారు. శనివారం ఆయన స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని సెబ్ విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది ఆరంభం నుంచి జిల్లాలో సెబ్ విభాగం అధికారులు, బృందాలు జరిపిన దాడులు, నమోదైన కేసులు, నిందితుల అరెస్టులు, బైండోవర్లు, NDPL & DPL సీజర్స్, నాటుసారా స్వాధీనంపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు.
ఓటు హక్కును నమోదు చేసుకోనివారు నమోదుకు మూడు రోజులు మాత్రమే గడువు ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి.సృజన శనివారం పేర్కొన్నారు. కొత్తగా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 15తో ముగియనుందన్నారు. 2006 మార్చి 31లోపు పుట్టిన వారు ఓటు హక్కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. ఇప్పటికే 18ఏళ్లు నిండినా ఓటు హక్కు లేని వారు కూడా అప్లై చేసుకోవాలని సూచించారు.
ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ సభ మందిరంలో శనివారం సాయంత్రం తమిళనాడు, కేరళకు చెందిన సత్యసాయి భక్తులు సత్య సాయి బాబాపై భక్తి గేయాలను ఆలపించారు. రెండు రాష్ట్రాలకు చెందిన భక్తులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకొన్నారు.
Sorry, no posts matched your criteria.