India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉస్మాన్ కాంగ్రెస్‌ను, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు చందు సాంబశివరావు బీజేపీని వీడారు. వీరు సీఎం జగన్ సమక్షంలో శనివారం వైసీపీలో చేరారు. సీఎం జగన్ ఉస్మాన్, సాంబశివరావులను వైసీపీలోకి ఆహ్వానించారు.
ఆల్ ఇండియా క్యారమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గత నెలలో వారణాసిలో జరిగిన జాతీయస్థాయి క్యారమ్స్ న్యాయం నిర్ణేతలు పరీక్షలో కర్నూలు జిల్లాకు చెందిన నాగేంద్ర హాజరై పరీక్షల ఉత్తీర్ణత సాధించినట్లు జిల్లా సంఘం కార్యదర్శి చెన్నకేశవరాజు తెలిపారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ.. జాతీయ స్థాయి న్యాయం నిర్ణేతగా అర్హత సాధించిన రెండో జిల్లా వాసిగా గర్వకారణం ఉందన్నారు.
విజయవాడలో సీఎం జగన్ చేస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర సింగ్‌నగర్‌లో జరుగుతున్న నేఫథంలో, జగన్ ప్రజలకు అభివాదం చేస్తుండగా కొందరు ఆగంతకులు పూలతోపాటు రాయి విసరడంతో జగన్ ఎడమ కంటికి గాయమైంది. క్యాట్‌బాల్‌లో రాయిపెట్టి విసరడంతో గాయం అయినట్లు సమాచారం. వెంటనే వైద్యులు ట్రీట్‌మెంట్ చేశారు. ఈ ఘటనలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయపడ్డాడు.
*24న టెక్కలిలో సీఎం జగన్ బస్సుయాత్ర ముగింపు
*శ్రీకాకుళం నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు
* 22న అచ్చెన్నాయుడు నామినేషన్
*శ్రీకాకుళం: ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
* నందిగం రహదారిపై కారు బోల్తా
*చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు: ధర్మాన
*దిల్లీలో పాలకొండ సైనికుడు మృతి
*కొత్తూరు: ఆర్టీసీ బస్సులో గంజాయి లభ్యం
*15న పలాసకు చంద్రబాబు రాక
* రాజాంలో రూ.20 లక్షల నగలు స్వాధీనం
* నరసన్నపేటలో వాలంటీర్ల రాజీనామా
ఎన్నికలకు సంబంధించి ఏ అంశంపై నైనా సందేహాలు నివృత్తి చేసుకునేందుకు, ఫిర్యాదులు చేయడానికి జిల్లా కలెక్టరేట్‌లో టోల్ ఫ్రీ నంబరు 1950ను ఏర్పాటు చేశారు. ఎన్నికలకు సంబంధించి ఎవరైనా ఓటరు తమ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ఈ నంబరుకు ఫోన్ చేస్తే చాలు సమాధానం ఇచ్చేందుకు సిబ్బంది సిద్ధంగా ఉంటారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఫిర్యాదులు చేసేందుకు ప్రతి పౌరునికి హక్కు ఉంది.
ఇంటర్ విద్యార్థుల పరీక్ష ఫలితాలు రావడం, ఆదివారం తమిళ ఉగాది కావడంతో శనివారం తిరుమలలో భక్తల రద్దీ పెరిగింది. నడక మార్గం, రోడ్డు మార్గం ద్వారా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తిరుమలకు వస్తున్నారు. భక్తుల కోసం టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. సర్వ దర్శనానికి 20 గంటలు సమయం పడుతుందన్నారు.
చదువుకి పేదరికం అడ్డు కాదని కోసిగికి చెందిన S.లోకేష్ నిరూపించాడు. కోసిగి ప్రభుత్వ కాలేజీలో చదివి ఇంటర్ బైపీసీలో 964 మార్కులు సాధించాడు. తల్లిదండ్రులు బెంగళూరుకి వలస వెళ్లారు. కుటుంబానికి అండగా ప్రభుత్వ ఉద్యోగమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నానని విద్యార్థి తెలిపాడు.
ధర్మవరం పట్టణం యాదవ వీధికి చెందిన ఒక చిరు వ్యాపారి కూతురు ఓలేటి వర్షిత సత్యసాయి జిల్లా మొదట ర్యాంక్‌ను సాధించింది. పట్టణంలోని ఓ కళాశాలలో ఎంపీసీ ఫస్ట్ ఇయర్‌లో 466/470 మార్కులు సాధించి ఔరా అనిపించింది. ఇంటర్ ఫలితాలలో జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు. తమ కూతురుకి చదువు చెప్పిన అధ్యాపకులకు ధన్యవాదాలు తెలిపారు.
జూపాడుబంగ్లా మండలంలోని మండ్లెం గ్రామంలో జరిగిన కర్రెమ్మ దేవత ఉత్సవాల సందర్భంగా దేవతకు బలి ఇచ్చిన దున్నపోతు మాంసం కోసం ఇరు వర్గాలకు చెందిన యువకులు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో పదిమందికి గాయాలయ్యాయి. అందులో ఒకరు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం నందికొట్కూరు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రి వద్ద కూడా యువకులు ఘర్షణ పడటంతో పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.
పుంగనూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈనెల 19న నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ఆ పార్టీ కార్యాలయం శనివారం తెలిపింది. నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
Sorry, no posts matched your criteria.