India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాలకొండ మండలం గొట్ట మంగళాపురం గ్రామానికి చెందిన సామంతుల రాంబాబు (31) ఢిల్లీలో సీఐఎస్ఎఫ్ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన హోలీ సంబరాల్లో విద్యుత్ షాక్‌కు గురై ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా మృతునికి 8 నెలల క్రితమే వివాహమైంది. నేడు ప్రత్యేక విమానంలో సైనికుని మృతదేహం స్వగ్రామానికి తీసుకురానున్నారు.
సంతమాగులూరు ఎంపీడీవో కార్యాలయ సమీపంలో శనివారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. మండల కేంద్రమైన ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు పాఠశాలలోపలికి వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు పాక్షికంగా దెబ్బతినగా ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించడమే లక్ష్యంగా సాయుధ బలగాలతో కవాతు నిర్వహిస్తున్నామని ఎస్పీ కె.ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. జిల్లాలోని ఏఎస్ పేట, చిన్న బజారు తదితర ప్రాంతాల్లో సాయుధ బలగాలతో శనివారం కవాతు నిర్వహించారు. ప్రజలు భయాన్ని వీడి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు.
ఏలూరు జిల్లా భీమడోలులో బాల్యవివాహాన్ని అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న బాలికకు భీమవరానికి చెందిన ఓ యువకుడితో వివాహం జరుగుతుందన్న సమాచారం మేరకు జిల్లా డీసీపీయూ అధికారులు, భీమడోలు అంగన్వాడీ, ఐసీడీఎస్ సిబ్బంది రంగంలోకి దిగారు. శుక్రవారం బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలికను ఏలూరు ప్రభుత్వ సంరక్షణ కేంద్రానికి తరలించామని శనివారం వెల్లడించారు.
తాను మరణించినా అవయవదానంతో మరికొందరికి ప్రాణం పోయాలనే ఆలోచన ఈరోజుల్లో కొంతమందికే కలుగుతోంది. తమ వాళ్లు మరణించినా అంత దు:ఖంలోనూ అవయవదానానికి ముందుకు వచ్చే వాళ్లకు నిజంగా హ్యాట్సాఫ్. శనివారం ప్రత్యేక హెలికాప్టర్లో కర్నూలు నుండి గుండె, లివర్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంది. అనంతరం అక్కడ నుండి పోలీసుల భద్రత నడుమ ప్రత్యేక ఆంబులెన్స్ లలో గుండెను శ్రీ వెంకటేశ్వర చిల్డ్రన్స్ ఆసుపత్రికి తరలించారు.
పి.గన్నవరం MLA కొండేటి చిట్టిబాబు కాంగ్రెస్‌లో చేరారు. మామిడికుదురు మండలం నగరంలో జన్మించిన చిట్టిబాబు.. విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్‌లో ఉన్నారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడగా.. 2019లో TDP అభ్యర్థి నేలపూడి స్టాలిన్ బాబుపై గెలిచారు. ఈసారి వైసీపీ టికెట్ దక్కక అసంతృప్తిగా ఉన్న చిట్టిబాబు.. ఈరోజు హస్తం గూటికి చేరారు. చిట్టిబాబు నిర్ణయంతో వైసీపీకి నష్టమెంత..? కాంగ్రెస్‌కు కలిసొచ్చేదెంత.? కామెంట్..
రాజాం మండలం పొగిరి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన ఎలక్షన్ చెక్ పోస్ట్ వద్ద రాజాo సిఐ దాడి మోహన్ రావు రూ.20 లక్షలు విలువచేసే 25 కేజీల వెండిని స్వాధీనం చేసున్నారు. విశాఖ నుంచి పాలకొండ వైపు వస్తున్న బస్సులో తనిఖీ చేయగా.. వారి వద్ద ఎటువంటి పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఇందులో భాగంగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు.
చేజర్ల మండల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ మెుదటి సంవత్సరంలో 43 మంది విద్యార్థులు చదువుతున్నారు. నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో మొదటి సంవత్సరంలో ఒక్క విద్యార్థి మాత్రమే పాసయ్యారు. 42 మంది విద్యార్థులు ఫెయిల్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది ప్రభుత్వ అధ్యాపకుల నిర్లక్ష్యమని విమర్శలు వస్తున్నాయి. సీనియర్ ఇంటర్ లో 27 మందికి గాను 13 మంది ఫెయిల్ అయ్యారు.
అనంత జిల్లా పామిడికి చెందిన రామచంద్ర నాయక్, రమాదేవి దంపతుల కుమార్తె గీతాంజలి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ఫలితాలలో 433/440 (బైపీసీ) మార్కులు పొంది రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించింది. ఆమె మాట్లాడుతూ.. తన తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ ఫలితం సాధించగలిగానని తెలిపింది. ఆమెకు కుటుంబసభ్యులు, పట్టణ ప్రజలు అభినందనలు తెలిపారు.
పర్చూరు ఇందిరా కాలనీకి చెందిన షేక్ ఖాసిం సైదా రానున్న ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నానని శనివారం స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఏ ప్రధాన రాజకీయ పార్టీ కూడా పర్చూరులో తిష్ట వేసిన సమస్యలను పట్టించుకోవడం లేదని, పేదలకు చేస్తున్నది ఏమీ లేదని ఆరోపించారు. స్థానికుడైన తనకు నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉందని, పేదల బాధలు తనకు తెలుసునని చెప్పారు. అందుకే పేదల ప్రతినిధిగా పోటీకి దిగుతున్నానన్నారు.
Sorry, no posts matched your criteria.