India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం మండల పరిధిలోని డీసీసీబీ కాలనీలో నివాసం ఉంటున్న కింతలి శ్రీవాణి (30) శుక్రవారం తన ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ..శ్రీవాణి, ఆమె భర్త హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేసేవారు. కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అయితే ఆమెకు పిల్లలు లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.
బీజేపీ సీనియర్ నాయకుడు, ప్రముఖ శాస్త్రవేత్త చందు సాంబశివరావు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. నేడు ఆయన సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. గుంటూరు పశ్చిమ నుంచి బీజేపీ తరఫున ఈయన ఎమ్మెల్యే సీటు ఆశించారు. అయితే టీడీపీ అభ్యర్థికి సీటు కేటాయించడంతో బీజేపీకి రాజీనామా చేశారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో కాపులకు తగిన ప్రాధాన్యం లేదని గతంలో ఆయన చెప్పారు.
నంద్యాల విశ్వ నగర్‌కు చెందిన గిద్దలూరు సందీప్ ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం ఫలితాల్లో టౌన్ టాపర్‌గా నిలిచాడు. 460/470 మార్కులు సాధించి సత్తా చాటాడు. పదో తరగతిలో కూడా అత్యుత్తమ మార్కులు సాధించాడు. ఇంజినీరింగ్ చదవడం తన కల అని, ఆ కలను నిజం చేసుకుంటానని తెలిపాడు. తన తండ్రి మధు బాబు ఎలక్ట్రీషియన్ పని చేస్తారని పేర్కొన్నాడు. తన తల్లిదండ్రులను బాగా చూసుకోవడమే తన ముందున్న లక్ష్యం అని తెలిపాడు.
ఆర్థిక ఇబ్బందులతో భీమవరానికి చెందిన కిషోర్‌కుమార్(32), అతని భార్య యోచన(24) కుమార్తె నిధిశ్రీ(2)తో చించినాడ వశిష్ఠ వంతెనపై నుంచి గోదావరిలో దూకిన విషయం తెలిసిందే. గురువారం కిషోర్ మృతదేహం.. శుక్రవారం తల్లీ, కుమార్తె మృతదేహాలు దొరికాయి. పాలకొల్లులో పోస్టుమార్టం చేశారు. మరణంలోనూ పేగు బంధాన్ని వీడలేక యోచన చున్నీతో కుమార్తెను కట్టేసుకొని దూకినట్లు తెలుస్తోంది. వీరు కొద్దిరోజులుగా అమలాపురంలో ఉన్నారు.
ఆర్థిక ఇబ్బందులతో భీమవరానికి చెందిన కిషోర్‌కుమార్(32), అతని భార్య యోచన(24) కుమార్తె నిధిశ్రీ(2)తో చించినాడ వశిష్ఠ వంతెనపై నుంచి గోదావరిలో దూకిన విషయం తెలిసిందే. గురువారం కిషోర్ మృతదేహం.. శుక్రవారం తల్లీ, కుమార్తె మృతదేహాలు దొరికాయి. పాలకొల్లులో పోస్టుమార్టం చేశారు. మరణంలోనూ పేగు బంధాన్ని వీడలేక యోచన చున్నీతో కుమార్తెను కట్టేసుకొని దూకినట్లు తెలుస్తోంది. వీరు కొద్దిరోజులుగా అమలాపురంలో ఉన్నారు.
15వ తేదీ రాత్రితో ఓట్ల నమోదుకు గడువు ముగియనుంది. 18 ఏళ్లు నిండి ఇంకా ఓటు నమోదు చేసుకోని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యంత్రాంగం సూచిస్తోంది. ఇటీవల విడుదలైన జాబితాలో జిల్లాలో 18 నుంచి 19 వయసు ఓటర్లు 36,175 మంది ఉండగా… 40-49 ఏళ్ల వారు అత్యధికంగా 4,29,668 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.
సీఎం జగన్ ఈ నెల 14వ తేదీన పెడనలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం 5గంటలకు నడుపూరు సెంటర్ నుంచి బైపాస్ రోడ్డు మీదుగా తోటమూల సెంటర్ చేరుకుంటారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం సింగరాయపాలెం, మడక, నందమూరు, ముంజులూరు, బంటుమిల్లి, పెందుర్రు, మునిపెడ మీదుగా బస్సు యాత్ర సాగనుంది. రాత్రికి కృత్తివెన్ను చేరుకుని అక్కడ బస చేస్తారని ఆ పార్టీ నేతలు తెలిపారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం ఒక్క రోజు 123 మంది వాలంటీర్స్ రాజీనామా చేశారని అధికారులు తెలిపారు. పాచిపెంట , సీతం పేట, వీరఘట్టం, గరుగుబిల్లి, జియమ్మవలస గ్రామ వాలంటీర్స్ రాజీనామా చేస్తూ ఆయా మండలాలలో సంబంధిత అధికారులకు రాజీనామా పత్రాలను అందజేశారు. ఎన్నికల కోడ్ తో తమను దూరం పెట్టడంతో రాజీనామా చేసినట్లు వాలంటీర్స్ తెలిపారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా పర్యటన ఖరారు అయ్యింది. ఈనెల 15న రాజాంలో సభ నిర్వహించిన అనంతరం టెక్కలి, పలాసలో జరిగే టీడీపీ ‘ప్రజాగళం’ సభకు చంద్రబాబు నాయుడు హాజరవుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు టీడీపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అధినేత ఎన్నికల ప్రచారానికి వస్తుండడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
దొనకొండ మండల కేంద్రానికి చెందిన సయ్యద్ ఇర్ఫాన్ (38) అనే వ్యక్తి ఒంగోలు ఇస్లాంపేటలో నివాసం ఉంటున్నాడు. స్నేహితులతో సరదాగా కొత్తపట్నం కె.పల్లెపాలెం బీచ్ కు వచ్చి సముద్రంలో స్నానం చేస్తూ అలల ఉధృతికి లోపలికి కొట్టుకుపోతుండగా మత్స్యకారులు బయటకులాగారు. కొన ఊపిరితో ఉండగా, స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు.
Sorry, no posts matched your criteria.