India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి ప.గో. జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. 14న పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. ప.గో. జిల్లాలో 2 మండలాల్లో, ఏలూరు జిల్లాలోని 5 మండలాల్లో వడగాలులు ఉండనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఉమ్మడి తూ.గో.జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. 13, 14వ తేదీల్లో పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. 13న తూ.గో. జిల్లాలోని 6, కాకినాడ జిల్లాలో 5 మండలాల్లో వడగాలులు ఉంటాయని తెలిపింది. 14న తూ.గో జిల్లాలో 18 మండలాలు, కాకినాడ జిల్లాలో 11 మండలాలు, కోనసీమలో 9 మండలాల్లో ఈ ప్రభావం ఉండనున్నట్లు తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఎన్నికల వేళ ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఎస్పీ అమిత్ బర్దర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆత్మకూరు మండలం పంపనూరులో శుక్రవారం కేంద్ర సాయుధ బలగాలచే నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్‌లో ఎస్పీ పాల్గొన్నారు. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలే తమ లక్ష్యమన్నారు. నిర్భయంగా ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రశాంత ఎన్నికలకు అందరూ సహకరించాలని కోరారు. గొడవలు, అల్లర్లకు దూరంగా ఉండాలని సూచించారు.
నంద్యాల జిల్లా కేంద్రంలోని టెక్కే మార్కెట్ యార్డులో భద్రపరిచిన ఈవీఎంల గోడౌన్‌ను నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈవీఎం, వీవీ ప్యాట్ల మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను అధికారులు చేపట్టారు. నియోజకవర్గాల వారిగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు.
నియోజకవర్గం మారడంపై వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ చేసిన వ్యాఖ్యలపై గంటా శ్రీనివాసరావు స్పందించారు. రాజకీయాల్లో పార్టీ అధిష్ఠీన వర్గం చెప్పినట్లు నడుచుకోవాలనే కనీస పరిజ్ఞానం సుబ్బారెడ్డికి లేదా అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. వైసీపీలో ఎంతమంది ఎమ్మెల్యేలను స్థానాలు మార్చి పోటీ చేయిస్తున్నారో ఆయనకు తెలియదా అన్నారు. YCP నేతలు ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తే డిపాజిట్లు రాకుండా ఓడిపోతారని కౌంటర్ ఇచ్చారు.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎస్ఎంవి బెంగళూరు ఖరగ్ పూర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ రైల్వే డీసీఎం త్రిపాఠి తెలిపారు. ఈనెల 12 నుంచి 17 వరకు నడిచే ఈ రైలు మధ్యాహ్నం 3.30 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి దువ్వాడ మీదుగా ఖరగ్ పూర్ చేరుకుంటుందన్నారు. ఈనెల 15 నుంచి 20 వరకు నడిచే ఖరగ్ పూర్-ఎస్ఎంవి బెంగళూరు ప్రత్యేక రైలు సాయంత్రం నాలుగు గంటలకు ఖరగ్ పూర్‌లో బయలుదేరుతుందన్నారు.
నరసరావుపేట మండలం ఇక్కురు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో విద్యార్థిని మనస్తాపం చెంది ఉరేసుకుంది. మృతురాలు ఇంటర్ సెకండియర్ చదువుతున్న అర్చనగా గుర్తించారు.
శ్రీశైలం మండలంలో వైసీపీకి షాక్ తగిలింది. మండల అధ్యక్షుడు, బీసీ సంఘం కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు, బీసీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జింకా గుండయ్య యాదవ్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం ఆయన గృహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి సమక్షంలో తన అనుచర గణంతో టీడీపీలో చేరారు. నియోజకవర్గం నుంచి రాజన్న భారీ మెజార్టీతో గెలుస్తారని గుండయ్య ధీమా వ్యక్తం చేశారు.
వడదెబ్బపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో వడగాలులు- వేసవి యాక్షన్ ప్రణాళిక -నీటి సరఫరా, తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వడదెబ్బ నేపథ్యంలో ఏం చేయాలో ఐఈసీ మెటీరియల్‌పై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా.. అంగన్వాడీ కేంద్రాలలో కుండలు ఏర్పాటు చేయాలన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో జరిగిన సమావేశంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల మన పార్టీ కార్యకర్తలని అన్నారు. నామినేషన్ రోజు 25 మంది వాలంటీర్లను తీసుకురావాలని కోరారు. వాలంటీర్లను రాజీనామాలు చేయించండి అని కార్యకర్తలకు సూచించారు. వాలంటీర్లతో పని చేయించాలని జిల్లాలోని ఆ పార్టీ కేడర్‌కు సూచించారు. మళ్ళీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.