Andhra Pradesh

News April 12, 2024

మన్యం: మొదటి రేండమైజేషన్ పూర్తి

image

జిల్లాలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ మొదటి రేండమైజేషన్ శుక్రవారం పూర్తి అయ్యింది. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ నేతృత్వంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రేండమైజేషన్ చేపట్టారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి రేండమైజేషన్ విధానాన్ని వివరించారు. రేండమైజేశన్ ద్వారా ఏ ఈవీఎం ఏ నియోజక వర్గానికి వెళుతుందో వివరించారు.

News April 12, 2024

కర్నూల్: జగన్ సమక్షంలో వైసీపీలోకి ప్రకాశ్‌రెడ్డి

image

మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి శుక్రవారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈయనతో పాటు కోట్ల హరిచక్రపాణి రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ మసాల పద్మజ, ఆలూరు నియోజకవర్గ నేత కురువ శశికళ, ఏపీ కురవ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్ తదితరులు సైతం ఇదే దారిలో నడిచారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి చేయాలని సీఎం సూచించినట్లు తెలిపారు.  

News April 12, 2024

నెల్లూరు: 25 నుంచి లా పరీక్షలు

image

నెల్లూరు వీఆర్ లా కళాశాల విద్యార్థులకు ఏప్రిల్ 25 నుంచి పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెమిస్టరు, 6వ సెమిస్టరు పరీక్షలు నిర్వహిస్తారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు 6వ సెమిస్టర్ పరీక్షలతో కోర్స్ పూర్తి కానుంది. మే 8న మొదటి సెమిస్టరు విద్యార్థులకు, మే 2న 6వ సెమిస్టరు విద్యార్థులకు పరీక్షలు ముగియనున్నాయి.

News April 12, 2024

విశాఖ: పరీక్ష రాసిన.. పాసైన వారి వివరాలు ఇలా..

image

ఉమ్మడి విశాఖ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు.. పాసైన వారి సంఖ్య ఇలా ఉంది.
➠ ఫస్ట్ ఇయర్: విశాఖలో 38,818 మందికి గానూ 30,050 మంది(77%)..అనకాపల్లిలో 10,443 మందికి 5,442 మంది(52%).. అల్లూరిలో 5,623 మందికి 2,689 మంది (48%) పాసయ్యారు.
➠ సెంకడ్ ఇయర్: విశాఖలో 34,672 మందికి గానూ 29,258 మంది (84%).. అనకాపల్లిలో 9,248 మందికి 6,119 మంది(66%).. అల్లూరిలో 4,542 మందికి 3,172 (70%) మంది పాసయ్యారు.

News April 12, 2024

ప.గో: ఇంటర్ పరీక్షలు రాసిన.. పాసైన వారి వివరాలిలా..

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు.. పాసైన వారి సంఖ్య ఇలా ఉంది.
➠ ఫస్ట్ ఇయర్: ప.గో జిల్లాలో 15,645 మందికి గానూ 10,843 మంది (69%).. ఏలూరు జిల్లాలో 13,078 మందికి గానూ 9,421 మంది (72%) పాసయ్యారు.
➠ సెంకడ్ ఇయర్: ప.గో జిల్లాలో 13,161 మందికి గానూ 10,470 మంది (80%).. ఏలూరు జిల్లాలో 11,539 మందికి గానూ 9,211 మంది (80%) పాసయ్యారు.

News April 12, 2024

తూ.గో: ఇంటర్ పరీక్షలు రాసిన.. పాసైన వారి వివరాలిలా..

image

ఉమ్మడి తూ.గో వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు.. పాసైన వారి సంఖ్య ఇలా ఉంది.
➠ ఫస్ట్ ఇయర్: తూ.గోలో 19,039 మందికి గానూ 14,357 మంది(75%).. కాకినాడలో 19,656 మందికి 11,873 మంది(60%).. కోనసీమలో 10,745 మందికి 6,444 మంది (60%) పాసయ్యారు.
➠ సెంకడ్ ఇయర్: తూ.గోలో 15,394 మందికి గానూ 12,837 మంది (83%).. కాకినాడలో 15,969 మందికి 11,337 మంది(71%).. కోనసీమలో 8,844 మందికి 6,338 మంది (72%) పాసయ్యారు.

News April 12, 2024

ప్రకాశం జిల్లాలో ఇంటర్‌లో ఎంతమంది పాసయ్యారంటే?

image

ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ప్రకాశం జిల్లాలో ఫస్ట్ ఇయర్‌లో 18,349 మందికి 10,868 మంది పాసయ్యారు. దీంతో 59 శాతం ఉత్తీర్ణతతో 18వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌‌లో 15,238 మందికి 10,993 మంది విద్యార్థులు పాసయ్యారు. 72 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 15వ స్థానం సాధించింది. మొదటి సంవత్సరం కంటే ద్వితీయ సంవత్సరంలో జిల్లాలో మెరుగైన ఫలితాలు వచ్చాయి.

News April 12, 2024

చిత్తూరు: ఫస్ట్ ఇయర్‌లో సగం మంది ఫెయిల్

image

ఇంటర్ సెకండ్ ఇయర్‌లో చిత్తూరు జిల్లా చివరిస్థానంలో నిలవగా ఫస్ట్ ఇయర్‌ విద్యార్థులూ నిరాశపరిచారు. 50 శాతంతో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో 25వ స్థానంలో నిలిచింది. 13,224 మంది పరీక్షలు రాయగా 6,566మంది పాసయ్యారు. తిరుపతి జిల్లా 70 శాతంతో 7వ స్థానంలో నిలిచింది. 29,915 మందికి 20,919మంది పాసయ్యారు. అన్నమయ్య జిల్లా 53 శాతంతో 23వ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 12,978 మంది పరీక్షలు రాయగా 6,886 మంది పాసయ్యారు.

News April 12, 2024

శ్రీకాకుళం: ఫస్టియర్‌లో 21, సెకండియర్‌లో 24వ స్థానం

image

శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ పరీక్షలను 18,249 మంది రాయగా.. వారిలో 10,408 మంది ఉత్తీర్ణత సాధించారు. 57 శాతంతో రాష్ట్రంలో 21వ స్థానంలో నిలిచింది. సెకండియర్‌లో 16,769 మందికి 11,300 మంది పాసయ్యారు. 67%తో 24వ స్థానంలో ఉంది.

News April 12, 2024

పార్వతీపురం 11వ స్థానం.. విజయనగరం 13వ స్థానం

image

➠ విజయనగరంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు 16,584 మందికి 10,267 మంది పాసయ్యారు. 62%తో రాష్ట్రంలో 13వ స్థానంలో నిలిచింది. సెకండియర్‌లో 15,180 మందికి 10,591 మంది పాసయ్యారు. 70%తో 21వ స్థానంలో ఉంది.
➠ పార్వతీపురం మన్యం జిల్లాలో ఫస్ట్ ఇయర్‌లో 5,475 మందికి 3,565 మంది ఉత్తీర్ణత సాధించారు. 65 శాతంతో 11వ స్థానంలో ఉంది. సెకండ్ ఇయర్‌లో 5,292 మంది రాయగా..4,054 మంది పాసయ్యారు. 77%తో 11వ స్థానంలో ఉంది.