Andhra Pradesh

News April 12, 2024

మొదటిసారి ఓటమి రుచి చూపించనున్న భీమిలి..!

image

భీమిలి నుంచి పోటీపడుతున్న గంటా శ్రీనివాసరావు(TDP), అవంతి శ్రీనివాస్‌(YCP)కి ఇప్పటివరకు ఓటమి తెలీదు. ఈసారి మాత్రం ఒకరికి ఓటమి తప్పదు. గంటా ఇప్పటి వరకు అనకాపల్లి ఎంపీ, చోడవరం, భీమిలి, విశాఖ నార్త్, అనకాపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించగా, అవంతి రెండు సార్లు భీమిలి ఎమ్మెల్యేగా ఒకసారి అనకాపల్లి ఎంపీగా గెలుపొందారు. మరి మొదటిసారి ఓటమి రుచిని వీరిద్దరిలో భీమిలి ఎవరికి చూపిస్తుందో కామెంట్ చెయ్యండి.

News April 12, 2024

ప్రకాశం: నేడు తేలనున్న ఇంటర్ విద్యార్థుల‌ భవితవ్యం

image

ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయని ఆర్ ఐవో సైమన్ విక్టర్ చెప్పారు. జిల్లాలో ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షలను 39,377మంది రాశారు. వీరిలో 19,233 మంది మొదటి సంవత్సరం, 18,128 మంది రెండో సంవత్సరం పరీక్షలకు హాజరయ్యారు. వీరి భవితవ్యం కొన్ని నిమిషాలలో తేలనుంది. ఇప్పటికే విద్యార్థులు ఫలితాల కోసం నెట్ సెంటర్ల వద్దకు చేరారు.

News April 12, 2024

కర్నూల్ జిల్లాలో ఇంటర్ ఫలితాల కోసం 47,412 మంది వెయిటింగ్

image

ఏపీ ప్రభుత్వం ఇంటర్ ఫలితాలను శుక్రవారం ఉ.11 గంటలకు విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా 47,412 మంది విద్యార్థులు భవితవ్యం నేడు తేలనుంది. ఇందులో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 22,239 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 25,173 మంది ఉన్నారు.

News April 12, 2024

కాకినాడ జిల్లాలో రూ.5కోట్ల విలువైన ఆభరణాల పట్టివేత

image

కాకినాడ జిల్లాలో రూ.5 కోట్ల విలువైన 8కిలోల బంగారం, 46కిలోల వెండి పట్టుబడింది. ఆభరణాలతో వెళుతున్న వాహనాన్ని పెద్దాపురం పోలీసులు పట్టుకున్నారు. ఓ వాహనంలో ఎలాంటి పత్రాలు లేకుండా వాటిని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కాకినాడ నుంచి విశాఖ వెళ్తూ మధ్యలో పెద్దాపురంలోని ఓ నగల దుకాణానికి రావడంతో డీఎస్పీ లతాకుమారి ఆదేశాల మేరకు సీఐ రవికుమార్, ఎస్ఐ సురేష్ ఆ వాహనం, నగలను స్వాధీనం చేసుకున్నారు.

News April 12, 2024

అనంత: రంజాన్ పండుగ వేళ విషాదం

image

కనేకల్ మండలం సొల్లాపురం గ్రామంలో రంజాన్ పండుగ రోజున విషాదం చోటుచేసుకుంది. నమాజు చదివేందుకు మసీదుకు వెళ్లిన డ్రైవర్ లాల్ బాషా విద్యుత్ ఘాతంతో మృతి చెందారు. నమాజు చదువుకునే ముందు వుజూ చేసుకునేందుకు నీళ్లు తీసుకుంటుండగా నీటి తొట్టిలో విద్యుత్ వైర్ తెగి పడింది. ఈ విషయాన్ని లాల్ బాషా గమనించకపోవడంతో ప్రమాదం జరిగింది.  ఉరవకొండలో చికిత్స పొందుతూ బాషా మృతి చెందాడు. 

News April 12, 2024

ఎలమంచిలి రైల్వే స్టేషన్‌లో యువకుడి మృతదేహం

image

ఎలమంచిలి రైల్వే స్టేషన్‌లో ఈనెల 7న పురుగుల మందు తాగిన గుర్తుతెలియని వ్యక్తి అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు రైల్వే ఎస్సై బి.లోవరాజు తెలిపారు. మృతుడి వయసు 35 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. మృతుడి ఊరు పేరూ తెలియదని పేర్కొన్నారు. బూడిద రంగు ఫ్యాంటు, బూడిద రంగు చొక్కా ధరించి ఉన్నట్లు ఎస్సై తెలిపారు.

News April 12, 2024

ఉండి టికెట్ పంచాయితీ.. CBN వద్దకు రామరాజు

image

ప.గో జిల్లాలో ఉండి టికెట్ పంచాతీ రాజకీయ కాక రేపుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి మరోసారి పిలుపు వచ్చింది. రామరాజుకు CBN నచ్చజెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధినేతను కలవడానికి రామరాజు అతికొద్ది మంది అనుచరులతో కలిసి బయలుదేరినట్లు సమాచారం.

News April 12, 2024

ఎచ్చెర్ల ఎమ్మెల్యే వాహనంలో తనిఖీలు 

image

లావేరు మండలం వెంకటాపురం జంక్షన్ వద్ద శుక్రవారం ఉదయం ఎచ్చెర్ల ఎమ్మెల్యే వాహనాన్ని ఫ్లయింగ్ స్కాడ్ తనిఖీ చేపట్టింది. ఎలక్షన్ క్యాంపెనింగ్‌కి వెళ్తున్న ఎమ్మెల్యే వాహనంతో పాటు ఇతర వాహనాలను కూడా లావేరు, జి.సిగడాం ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. రెండు మండలాలలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈ తనిఖీలలో ఏవో ఉషారాణి, ఏఎస్ఐ రామారావు, పోలీస్ సిబ్బంది, పాల్గొన్నారు.

News April 12, 2024

సీఎం జగన్ పోటీ చేసేది ఈమెనే

image

భారత చైతన్య యువజన పార్టీ తరఫున పులివెందులలో సీఎం జగన్‌పై సూరే నిర్మల పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పేరును ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ప్రకటించారు. ఈ క్రమంలో జగన్ పై పోటీ చేస్తున్న మొదటి మహిళగా నిలవనున్నారు. వైఎస్ కుటుంబానికి కంచుకోట అయిన పులివెందులలో నిర్మల పోటీ చేస్తుండటంతో బీసీల ఓట్లు తమకే వస్తాయని ధీమాగా ఉన్నారు. మరోవైపు టీడీపీ నుంచి బీటెక్ రవి పోటీలో ఉన్నారు.

News April 12, 2024

ఈనెల 14న గాజువాకలో చంద్రబాబు సభ

image

ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈనెల 14న జిల్లాకు రానున్నారు. ఆరోజు సాయంత్రం గాజువాక లంకా మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. రాత్రికి అనకాపల్లి వెళ్లి బస చేయనున్నారు. 15న అనకాపల్లి జిల్లాలో జరిగే ఎన్నికల సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఈ మేరకు సమాచారం వచ్చిందని, అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని టీడీపీ విశాఖ లోక్ సభ నియోజకవర్గ అధ్యక్షులు గండి బాబ్జి తెలిపారు.