Andhra Pradesh

News April 12, 2024

ఈనెల 15న విజయనగరం జిల్లాకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటన తేదీలు ఖరారైనట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఈనెల 15న రాజాంలో సాయంత్రం 3గంటలకు జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. మరుసటి రోజు విజయనరగంలో సాయంత్రం 4 గంటలకు, నెల్లిమర్ల ప్రధాన కూడలిలిలో రాత్రి 7 గంటలకు జరిగే సభల్లో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పాల్గొనున్నట్లు వెల్లడించారు. కాగా.. అభ్యర్థుల ప్రకటన అనంతరం మొదటిసారి వీరు జిల్లాకు వస్తున్నారు.

News April 12, 2024

అనంతలో ఫలితాల కోసం 41,556 మంది వెయిటింగ్

image

అనంతపురం జిల్లాలో 170 జూనియర్‌ కళాశాలల నుంచి 41,556 మంది ఇంటర్ విద్యార్థులు రెగ్యులర్‌, ఒకేషనల్‌ వార్షిక పరీక్షలు రాశారు. వీరిలో 24,446 మంది మొదటి సంవత్సరం, 17,110 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 70 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మార్చి 21న మూల్యాంకనం ప్రారంభం కాగా ఈనెల 4 నాటికి పూర్తయింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి.

News April 12, 2024

ఈనెల 15న భీమవరానికి సీఎం జగన్

image

ఈనెల 15న (సోమవారం) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భీమవరం రానున్నారు. ఆయన చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా భీమవరం చేరుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.

News April 12, 2024

విజయవాడలో రూ. 6.74 కోట్ల విలువైన న‌గ‌దు సీజ్

image

జిల్లాలో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియమావ‌ళిని స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లుచేస్తున్నామ‌ని క‌లెక్ట‌ర్ డిల్లీరావు గురువారం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అదే విధంగా సీజ‌ర్ మేనేజ్‌మెంట్ వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా అమ‌ల‌వుతోంద‌ని తెలిపారు. నేటి వ‌ర‌కు రూ. 6.74 కోట్ల విలువైన న‌గ‌దు, మ‌ద్యం, మ‌త్తు ప‌దార్థాలు, విలువైన వ‌స్తువులు, ఉచితాలు త‌దిత‌రాల‌ను సీజ్ చేసిన‌ట్లు స్పష్టం చేశారు.

News April 12, 2024

నేటి సీఎం జగన్ బస్సు యాత్ర షెడ్యూల్

image

CM జగన్ మేమంతా సిద్ధం శుక్రవారం షెడ్యూల్ విడుదలైంది. ఉదయం 9:00 గంటలకు ధూళిపాళ్ల నుంచి బయలుదేరి సత్తెనపల్లి, కొర్రపాడు, మేడికొండూరు, పేరేచర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా మధ్యాహ్నం హౌసింగ్ బోర్డుకు చేరుకుంటారు. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చుట్టుగుంట సర్కిల్, వీఐపీ రోడ్ మీదుగా ఏటుకూరు బైపాస్‌కు చేరుకుంటారు. అక్కడ జరగనున్న బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు.

News April 12, 2024

రుషికొండ బీచ్‌లో విద్యార్థి గల్లంతు

image

రుషికొండ బీచ్‌లో ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. కంచరపాలెం ఊర్వశి జంక్షన్‌కు చెందిన తేజ (20) గురువారం సాయంత్రం తన స్నేహితులతో రుషికొండ బీచ్‌కు వెళ్లాడు. రాత్రి 7 గంటల సమయంలో వారు స్నానాలకు దిగారు. పెద్ద కెరటం రావడంతో తేజా సముద్రంలోకి కొట్టుకుపోయాడు. లైఫ్ గార్డ్స్ గాలించినప్పటికీ తేజ ఆచూకీ లభ్యం కాలేదు. బ్లూకోర్టు పోలీసులు గాలిస్తున్నారు. తేజ ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు.

News April 12, 2024

విశాఖ జిల్లాలో ఎన్నికల పరిశీలకులు పర్యటన

image

రాష్ట్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు రామ్మోహన్‌ మిశ్రా జిల్లాలో గురువారం పర్యటించారు. దీనిలో భాగంగా గాజువాక నియోజకవర్గ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కార్యాలయానికి చేరుకుని కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌లో ఏర్పాటుచేసిన వివిధ కంట్రోల్‌రూమ్‌లను, అనుమతి జారీ కేంద్రాలను తనిఖీ చేశారు.

News April 12, 2024

చీరాల: పురుగు మందు తాగి యువకుడి సూసైడ్

image

ఇంట్లో వారు మందలించారనే మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చీరాల మండలం వాడరేవులో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై శివకుమార్ వివరాల మేరకు.. వేటపాలెం మండలం రామన్నపేటకు చెందిన ఎం.నాగేంద్ర(23) చీరాలలో ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తున్నాడు. ఇటీవల కాలంలో ఉద్యోగానికి వెళ్లకపోవడంతో ఇంట్లో వారు మందలించారు. దీంతో మనస్థాపం చెందిన నాగేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

News April 12, 2024

ఏలూరు: నేడు ఈవీఎం, వీవీపాట్స్ ర్యాండమైజేషన్

image

ఎన్నికల నేపధ్యంలో ఈవీఎం, వీవీపాట్స్ ర్యాండమైజేషన్ ప్రక్రియ రాజకీయ పార్టీల సమక్షంలో ఈనెల 12న (శుక్రవారం) నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ర్యాండమైజేషన్ నిర్వహణకు సంబంధిత అధికారులు, సిబ్బందికి విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. జిల్లాలోని 1743 పోలింగ్ స్టేషన్లకు 4184 బ్యాలెట్ యూనిట్లు, 4184 కంట్రోల్ యూనిట్లు, 4534 వీవీప్యాట్స్ సిద్ధం చేస్తున్నామన్నారు.

News April 12, 2024

రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న సినీ నటుడు సుమన్

image

మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని గురువారం సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు. ఆయనకు శ్రీ మఠం అధికారులు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించారు. అనంతరం శ్రీ మఠం రథోత్సవంలో సుమన్ పాల్గొన్నారు. శ్రీ మఠం పీఠాధిపతులు సుమన్‌కు తీర్థ ప్రసాదాలు అందజేశారు.