Andhra Pradesh

News April 11, 2024

కుప్పం మీదుగా స్పెషల్ రైలు

image

గోరఖ్‌పూర్ స్పెషల్ రైలును రేపటి నుంచి కుప్పం మీదుగా నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కుప్పం మీదుగా కాట్పాడి, రేణిగుంట, విజయవాడ, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస మీదుగా గోరఖ్‌పూర్ చేరుకుంటుంది. ఇదే మార్గంలో సోమవారం సాయంత్రం 5.40గంటలకు కుప్పం మీదుగా బెంగళూరు కృష్ణరాజపురానికి వెళ్తుంది. 6 వారాలు మాత్రమే ఈ స్పెషల్ రైలు నడవనుంది.

News April 11, 2024

నెల్లూరు: మద్యం దుకాణాలపై ఆంక్షలు..?

image

ఆంక్షలతో నెల్లూరు జిల్లాలో కొన్నిచోట్ల సాయంత్రానికే మద్యం దుకాణాలు మూతపడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 271 షాపులు ఉన్నాయి. గతేడాది ఏప్రిల్‌లో ఒకరోజులో ఎంత మొత్తం మద్యం విక్రయించారో.. ప్రస్తుతం కూడా రోజుకు అంతే విక్రయించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఉదయం 11 గంటలకు తెరుచుకుంటున్న షాపుల్లో సాయంత్రానికే టార్గెట్ పూర్తి కావడంతో మూతపడుతున్నాయి. మీ ఏరియాలో పరిస్థితి ఏంటో కామెంట్ చేయండి.

News April 11, 2024

కర్నూల్ నగరంలో చిన్నారుల రంజాన్ వేడుకలు

image

కర్నూలులో గురువారం రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు. నగరంలోని ఆయా మసీదుల దగ్గరకు ముస్లింలు చేరుకొని ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని సమైక్యత భావాన్ని చాటుకున్నారు. రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ క్రమంలో పాత సంతోష్ నగర్‌లోని కొత్త ఈద్గా వద్ద చిన్నారుల రంజాన్ ప్రార్థనలు పలువురిని ఆకట్టుకున్నాయి.

News April 11, 2024

పాచిపెంట: ఉపాధి హామీ ఉద్యోగి అనుమానాస్పద మృతి

image

అనుమానాస్పద స్థితిలో ఉపాధి హామీ ఉద్యోగి మృతి చెందిన ఘటన మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. పాచిపెంట మండల కేంద్రానికి చెందిన డోలా శంకరరావు పాచిపెంట ఉపాధి హామీలో టెక్నీకల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. గురువారం ఉదయం పారమ్మకొండ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న కాలువ దగ్గర అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీంచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

News April 11, 2024

పవన్.. రాజకీయాల్లో నటించొద్దు ప్లీజ్: ముద్రగడ

image

‘సినిమాల్లో నటించండి. రాజకీయాల్లో నటించకండి ప్లీజ్‌..’ అంటూ పవన్‌‌పై ముద్రగడ పద్మనాభం సెటైర్స్ వేశారు. తాడేపల్లిగూడెంలో జరిగిన కాపు ఆత్మీయ సమావేశంలో గురువారం ముద్రగడ మాట్లాడుతూ.. పవన్ రాజకీయాల్లో నటించి యువతను పాడు చేయొద్దని అన్నారు. అధికారంలోకి వస్తే స్వచ్ఛ నీరు ఇస్తామని కాకుండా స్వచ్ఛ సారా అందిస్తామనడమేంటని ప్రశ్నించారు. పవన్ తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేసి ఉంటే బాగుంటుందని ముద్రగడ అన్నారు.

News April 11, 2024

పవన్.. రాజకీయాల్లో నటించొద్దు ప్లీజ్: ముద్రగడ

image

‘సినిమాల్లో నటించండి. రాజకీయాల్లో నటించకండి ప్లీజ్‌..’ అంటూ పవన్‌‌పై ముద్రగడ పద్మనాభం సెటైర్స్ వేశారు. తాడేపల్లిగూడెంలో జరిగిన కాపు ఆత్మీయ సమావేశంలో గురువారం ముద్రగడ మాట్లాడుతూ.. పవన్ రాజకీయాల్లో నటించి యువతను పాడు చేయొద్దని అన్నారు. అధికారంలోకి వస్తే స్వచ్ఛ నీరు ఇస్తామని కాకుండా స్వచ్ఛ సారా అందిస్తామనడమేంటని ప్రశ్నించారు. పవన్ తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేసి ఉంటే బాగుంటుందని ముద్రగడ అన్నారు.

News April 11, 2024

చిత్తూరు: తల్లిదండ్రుల ఎదుటే మృతి

image

తల్లిదండ్రుల కళ్ల ఎదుటే ఓ యువకుడు చనిపోయిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. బైరెడ్డిపల్లె(M) రామనపల్లికి చెందిన జయప్ప కుమారుడు యాదగిరి(26) MBA చదివి బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. ఉగాది సందర్భంగా ఇంటికి వచ్చాడు. నిన్న ఉదయం పశువులకు మేత వేసి ఇంట్లోకి వచ్చాడు. తల్లిదండ్రులతో ఒంట్లో బాగోలేదని కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు తెలిపారు.

News April 11, 2024

VZM: ‘ఫలితాలు సరే.. మూల్యాంకనం డబ్బులేవీ’?

image

ఈ ఏడాది ఇంటర్ ఫలితాలు రికార్డు స్థాయిలో మూల్యాంకనం పూర్తయిన వారం రోజుల లోపే విడుదల కానున్నాయి. అయితే పరీక్షలు నిరాటంకంగా జరిపించిన అధ్యాపకుల సేవలు మాత్రం ఇంటర్ బోర్డు విస్మరించిందని అధ్యాపకులు వాపోతున్నారు. ఫిబ్రవరిలో జరిగిన ప్రాక్టికల్స్ రెమ్యూనరేషన్ గానీ, మార్చిలో జరిగిన పరీక్షల ఇన్విజిలేషన్ రెమ్యూనరేషన్ గానీ అనంతరం జరిగిన పేపర్ల మూల్యాంకనం రెమ్యూనరేషన్ గానీ తమకి అందకపోవడం దారుణమని అంటున్నారు.

News April 11, 2024

కడప: షర్మిల బస్సు యాత్ర షెడ్యూల్ విడుదల

image

12, 13వ తేదీ కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి బస్సు యాత్ర షెడ్యూల్ విడుదలైంది.
12వ తేదీ వేంపల్లి, వేముల, పులివెందుల, లింగాల, సింహాద్రిపురం మండలాల్లో బస్సు యాత్ర సాగనుంది. అనంతరం పులివెందుల పూలంగళ్ళో మీటింగ్ నిర్వహించనున్నారు.
13వ తేదీ ఎర్రగుంట్ల, ముద్దనూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో బస్సు యాత్రను షర్మిల చేపట్టనున్నారు.

News April 11, 2024

నెల్లూరు: జనసేనలో కీలక నేతగా ఎదిగినా..

image

చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి నెల్లూరు రూరల్ మండలం కలివెలపాళేనికి చెందిన వారు. NRI అయిన ఆయన జనసేన ఆవిర్భావంలోనే పార్టీలో చేరారు. కీలక విభాగమైన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసి ఓడిన మనుక్రాంత్ ఈ ఎన్నికల్లో సిటీ సీటు ఆశించారు. కీలకనేతగా ఉన్నా కేడర్ తో కనెక్ట్ కాలేకపోయారని విమర్శలు ఉన్నాయి.