Andhra Pradesh

News April 11, 2024

విశాఖలో జనావాసాల్లోకి వణ్యప్రాణులు

image

ఎండ తీవ్రతకు వన్యప్రాణులు జనావాసాల్లోకి వణ్యప్రాణులు వచ్చేస్తున్నాయి. విశాఖలోని కొండవాలు ప్రాంతాల్లో తరచూ ఈ ఘటనలు కనిపిస్తున్నాయి. విశాలాక్షి నగర్‌లో నిన్న ఓ కొమ్ముల దుప్పి రోడ్లపై సంచరించింది. వీటితో ప్రమాదం లేనప్పటికీ.. అధికారులు తగల చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

News April 11, 2024

విశాఖ: రైల్వే లైన్ నిర్మాణానికి నోటిఫికేషన్

image

విశాఖ జిల్లా పరిధిలో దువ్వాడ-సింహాచలం నార్త్ మధ్య 2,4 నాల్గవ రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.2.543 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టే రైల్వే లైన్‌ను స్పెషల్ రైల్వే ప్రాజెక్ట్‌గా గుర్తిస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. రైల్వే యాక్ట్ -1989లోని సెక్షన్ 2, క్లాస్-37ఏ కింద అధికారాలను ఉపయోగించి ఈ ప్రాజెక్టును స్పెషల్ ప్రాజెక్టుగా ప్రకటిస్తున్నట్లు తెలియజేసింది.

News April 11, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ఊరట

image

ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా హైదరాబాద్‌(HYB), కటక్(CTC) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.07165 HYB- CTC ట్రైన్‌ను ఈ నెల 16, 23, 30 తేదీల్లో, నం.07166 CTC- HYB ట్రైన్‌ను ఈ నెల 17, 24, మే 1వ తేదీన నడుపుతామన్నారు. ఈ స్పెషల్ ట్రైన్లు ఏపీలో విజయవాడతో పాటు గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ తదితర స్టేషన్‌లలో ఆగుతాయన్నారు.

News April 11, 2024

సిద్దవటం: రైలు కిందపడి యువకుడి సూసైడ్

image

సిద్దవటం గాంధీ వీధిలో నివాసమున్న రెడ్డి మోహన్(18) భాకరాపేట-కనుములోపల్లి మార్గ మధ్యలో రైల్వే ట్రాక్ పై రైలు కింద మృతి చెందాడు. బుధవారం రాత్రి 2:30 గంటలకు గుర్తించామని, మృతికి గల కారణాలు విచారిస్తున్నామని రైల్వే పోలీసులు తెలియజేశారు. మృత్యువాత పడ్డ వ్యక్తి రెడ్డి మోహన్ ద్విచక్రవాహనంలో వచ్చాడని తెలిపాడు. స్వాధీనం చేసుకుని, పంచనామా నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించామని రైల్వే పోలీసులు అన్నారు.

News April 11, 2024

విశాఖ: కానిస్టేబుల్ కుటుంబంలో విషాదం

image

విశాఖలో ద్వారక నగర్ ఐఓబీలో ఎస్పీఎఫ్ <<13030401>>కానిస్టేబుల్ శంకరరావు<<>> ఆత్మహత్య ఘటన ఆయన కుటుంబంలో పెను విషాదం నింపింది. ఉ.5 గంటలకు విధులకు వచ్చిన శంకర్రావు..7 గంటలకు తుపాకీతో కాల్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడిది వంగర మండలం పొత్తిస గ్రామంగా సమాచారం. ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. కాగా.. కానిస్టేబుల్ ఛాతీపై కాల్చుకున్నట్లు తెలుస్తోంది.

News April 11, 2024

టీడీపీలో చేరిన మేకపాటి మేనల్లుడు

image

మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మేనల్లుడు బిజవేముల సురేంద్ర నాధ్ రెడ్డి గురువారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నెల్లూరులోని ఆనం నివాసంలో ఆత్మకూరు టీడీపీ MLA అభ్యర్థి ఆనం రామ్ నారాయణ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఆయనతో పాటు మర్రిపాడు మండలం, బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన పలువురు టీడీపీలో చేరారు.

News April 11, 2024

తిరుపతి: సీజ్ చేసిన నగదు విడుదల

image

జిల్లా గ్రీవెన్స్ త్రిసభ్య కమిటీ ద్వారా సామాన్య ప్రజల నుంచి సీజ్ చేసిన రూ.26.07 లక్షలను విడుదల చేసినట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రింట్ మీడియా నుంచి 223 ఫిర్యాదులు రాగా 213 పరిష్కరించామన్నారు. కంప్లైంట్ మానిటరింగ్ యాప్ ద్వారా 47 ఫిర్యాదులు రాగా అందులో 44 పరిష్కరించినట్లు పేర్కొన్నారు.

News April 11, 2024

విశాఖ సూసైడ్ చేసుకున్న కానిస్టేబుల్‌ వివరాలు గుర్తింపు

image

విశాఖ ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో SPF కానిస్టేబుల్ శంకర్రావు గురువారం ఉదయం సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఐఓబీలో గన్‌మెన్‌గా పని చేసే ఇతని స్వగ్రామం రాజాం నియోజకవర్గంలోని వంగర మండలం కొట్టిస. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఉ. 5 గంటలకు డ్యూటీ‌కి హాజరైన శంకర్రావు తన వద్ద ఉన్న SLRతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News April 11, 2024

విశాఖ: పలు రైళ్లు రద్దు

image

ప్రీ-నాన్ -ఇంటర్లాకింగ్, నాన్ -ఇంటర్లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు చేస్తునట్లు రైల్వే శాఖ అధికారి ఏ.కె. త్రిపాఠి తెలిపారు. 08527 విశాఖ- రాయ్ పూర్, 08528 రాయ్‌పూర్ -విశాఖ, 08504 విశాఖ-భవానీపట్నం ప్యాసింజర్, 18301 సంబల్పూర్ – రాయగడ, 18302 రాయగడ -సంబల్పూర్ ఇంటర్ సిటీని ఈనెల 15 నుంచి 24వ తేదీ వరకు… 08503 భవానీపట్న-విశాఖ ప్యాసింజర్ ఈనెల 16 నుంచి 25వ వరకు రద్దు చేసినట్లు తెలిపారు.

News April 11, 2024

సోమల: భర్తను ప్రియుడితో కలసి హత్య చేసిన నిందితురాలి అరెస్టు

image

భర్తను హత్య చేసి కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా పరారీలో ఉన్న భార్యను అరెస్ట్ చేసి చిత్తూరు ఏడీజే కోర్టుకు తరలించగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు SI వెంకట నరసింహులు తెలిపారు. 2018లో సోమల(M), ఆవులపల్లెకు చెందిన గోవిందప్ప(35)ను భార్య కుమారి, ప్రియుడు వెంకటరమణతో కలిసి రోకలి బండతో కొట్టి హతమార్చింది. కుమారి రిమాండుకు వెళ్లివచ్చిన తర్వాత కోర్టు వాయిదాలకు హాజరుకాలేదు.