India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంతకల్లులోని కసాపురం రోడ్డులోని అయ్యప్ప దేవాలయం వద్ద బుధవారం హైఓల్టేజ్ విద్యుత్ స్తంభం నుంచి హైటెన్షన్ వైరు తెగిపడటంతో స్థానికులు భయాందోళన చెందారు. అయితే శాటిలైట్ అనుసంధానంగా ఆ లైన్ బ్రేక్ డౌన్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్పందించిన ట్రాన్స్ కో ఉన్నతాధికారులు సిబ్బందిని పురమాయించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఒంగోలులో బుధవారం రాత్రి జరిగిన ఘటనలో సమతానగర్ పరిధిలోని వాలంటీర్ సుజన ప్రియా ఫిర్యాదు మేరకు 30 మంది TDP నేతలపై గురువారం పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వాలంటీర్‌తో కలిసి YCP నేతలు ప్రచారం చేస్తున్నారని కొందరు ఫొటో తీశారు. దీనిపై రగడ జరగడం, ఆ వార్డు టీడీపీ బాధ్యుడు మోహన్ రావు అక్కడికి వెళ్లడంతో గొడవ పెద్దదైంది. అనంతరం రిమ్స్‌లో ఇరు వర్గాల కవ్వింపు చర్యల నేపథ్యంలో TDP నేతలపై కేసు నమోదైంది.
కల్లూరు మండలం చిన్నటేకూరులో ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ప్రభ లాగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ప్రతి ఏడాది చెక్క రథంతో చేసి ప్రభ లాగేవారు. ఈ ఏడాది మాత్రం ఇందుకు భిన్నంగా ఇనుప రథంతో చేసిన ప్రభ లాగడంతో హైటెన్షన్ వైర్లు తగలి రథంపై ఉన్న సుమారు 17 మంది చిన్నారులు విద్యుత్ షాక్‌కు గురయ్యారు.
ప్రీ-నాన్ -ఇంటర్లాకింగ్, నాన్ -ఇంటర్లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు చేస్తునట్లు స్టేషన్ సూపరిండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. 08527 విశాఖ- రాయ్‌పూర్, 08528 రాయ్‌పూర్ -విశాఖ, 08504 విశాఖ-భవానీపట్నం ప్యాసింజర్, 18301 సంబల్పూర్ – రాయగడ, 18302 రాయగడ -సంబల్పూర్ ఇంటర్ సిటీని ఈనెల 15 నుంచి 24వ తేదీ వరకు.. 08503 భవానీపట్న-విశాఖ ప్యాసింజర్ ఈనెల 16 నుంచి 25వ వరకు రద్దు చేసినట్ల వెల్లడించారు.
యలమంచిలి మండలం చించినాడ వశిష్ఠ గోదావరి వంతెనపై నుంచి దూకి బుధవారం కుటుంబం గల్లంతైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భీమవరానికి చెందిన కిషోర్ కుమార్, భార్య యోచన, కుమార్తె శ్రీనిధి అమలాపురంలో ఉంటున్నారు. అయితే వీరు ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆ నిర్ణయం తీసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వీరి బ్యాగు, ఫోను, చించినాడ గోదావరి వంతెనపై ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర అనుసరణీయమని కలెక్టర్ డాక్టర్ జి.సృజన అన్నారు. గురువారం ఆయన జయంతిని పురస్కరించుకుని కర్నూలులోని శరీన్ నగర్‌లో ఉన్న పూలేతో పాటు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనకు విశేష కృషి చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు.
ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం సమీపంలో బుధవారం శిల్పి గేదెల హరికృష్ణ నిర్మించిన సైకత శిల్పం పలువురిని ఆకట్టుకుంది. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఈ సైకత శిల్పం చేసినట్లు ఆయన చెప్పారు. పలువురు ముస్లిం సోదరులకు తన సైకత శిల్పం ద్వారా ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. శిల్పి హరికృష్ణ నైపుణ్యాన్ని పలువురు అభినందించారు
డీఎస్సీ-2018లో స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసుకుని, వెరిఫికేషన్ పూర్తి చేసిన పీఈటీ అభ్యర్థుల వివరాలు డీఈవో కార్యాలయంలోని నోటీసు బోర్డులో ఉంచినట్లు డీఈవో దేవరాజు తెలిపారు. జాబితాను పరిశీలించుకుని ఏవేని అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈనెల 19వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు డీఈవో కార్యాలయంలో తెలియజేయాలని కోరారు. గడువు తర్వాత వచ్చే అభ్యర్థనలు స్వీకరించబడవని డీఈవో స్పష్టం చేశారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. మంగళ, బుధవారాల్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 16.90 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దాంతో పాటు అక్రమంగా తరలిస్తున్న 164 మద్యం బాటిళ్లను సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కృష్ణా వర్సిటీ పరిధిలో అక్టోబర్ 2023లో నిర్వహించిన ఎం-ఫార్మసీ 2వ సెమిస్టర్ పరీక్షలకు(2022- 23) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 16వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1100 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చన్నారు.
Sorry, no posts matched your criteria.