Andhra Pradesh

News October 2, 2024

అనకాపల్లి నగరానికి ఇదో ఆభరణం..!

image

ఏపీలో చెన్నై-కోల్ కతా నగరాలను కలిపే జాతీయ రహదారి నాలుగు వరుసలుగా ఉండేది. అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు ఆరు వరుసలుగా ఇటీవల దానిని అభివృద్ధి చేశారు. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో జిల్లా కేంద్రం అనకాపల్లిని ఆనుకుని ఇలా తీర్చిదిద్దారు. పాము మెలికలు కనిపించే ఈ డబుల్ ట్రంపెట్ ఇంటర్ ఛేంజ్ కూడలి రాష్ట్రంలో ఇదే మొదటిది కావటం విశేషం.

News October 2, 2024

హెచ్‌ఎల్‌సీ కెనాల్‌లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

బీ.సముద్రం మండల పరిధిలో ఉన్న హెచ్ఎల్‌సీ కెనాల్‌లో గుర్తుతెలియని మగ మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెడీమేడ్ ఫుల్ షర్ట్‌పైన నలుపు, తెలుపు రంగు చుక్కలు, డార్క్ బ్లూ కలర్ జీన్స్ దుస్తులు ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. కీప్యాడ్ ఫోన్, ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉందన్నారు. గుర్తించి వారు సీఐ 9440796816 నంబర్‌కు సంప్రదించాలని కోరారు.

News October 2, 2024

మహాత్మా గాంధీ ఆశయాలను కొనసాగిస్తాము: ఎస్పీ

image

మచిలీపట్నం జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఎస్పీ గంగాధర్ రావు ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా గాంధీ ఆశయాలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ కార్యక్రమం జిల్లాలో నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. దేశం కోసమే జీవించి దేశం కోసమే మరణించిన వ్యక్తులలో లాల్ బహుదూర్ శాస్త్రి ఒకరని తెలిపారు.

News October 2, 2024

ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే

image

ప్రయాణీకుల రద్దీ మేరకు ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా నరసాపురం(NS), హైదరాబాద్(HYD) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) పేర్కొంది. నం.07631 HYD- NS ట్రైన్‌ను OCT 5 నుంచి NOV 30 వరకు ప్రతి శనివారం, నం.07632 NS- HYD ట్రైన్‌ను OCT 6 నుంచి DEC 1 వరకు ప్రతి ఆదివారం నడపనున్నట్లు SCR తెలిపింది. కాగా ఈ ట్రైన్లు జిల్లాలో విజయవాడ, గుడివాడ, కైకలూరు స్టేషన్లలో ఆగుతాయి.

News October 2, 2024

కర్నూలు: 24 గంటల్లో మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు

image

పత్తికొండ మండలం పుచ్చకాయలమడకు చెందిన అశోక్ అనే నిరుద్యోగి తనకు ఆటో ఇప్పించాలని నిన్న సీఎం చంద్రబాబును కోరిన విషయం తెలిసిందే. సీఎం హామీ మేరకు బుధవారం అశోక్‌కు ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, కలెక్టర్ రంజిత్ బాషా ఆటో పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రామలక్ష్మి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సాంబ శివారెడ్డి పాల్గొన్నారు.

News October 2, 2024

సీఎం చంద్రబాబును కలిసిన ఎంపీ మాగుంట

image

ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో CM చంద్రబాబు నాయుడును ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గృహ, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా తనను నియమించిన సందర్భంగా సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సీఎం సైతం మాగుంటకు శుభాకాంక్షలు తెలిపారు.

News October 2, 2024

రాష్ట్రంలోనే విశాఖకు మొదటి స్థానం

image

స్వచ్ఛత హీ కార్యక్రమంలో విశాఖకు రాష్ట్రస్థాయిలోనే ప్రథమ స్థానం దక్కింది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా మచిలీపట్నంలో జరిగిన కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ అవార్డును అందుకున్నారు. గత నెల 17 నుంచి నేటి వరకు నాలుగు రకాలుగా స్వచ్ఛత హీ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను భాగస్వామ్యంతో విజయవంతమయ్యారని సీఎం కొనియాడారు. అవార్డు రావడంతో అధికారులు ఆనందం వ్యక్తంచేశారు.

News October 2, 2024

రేపటి నుంచి టెట్ పరీక్ష ప్రారంభం

image

కర్నూలు జిల్లాలో 6 పరీక్ష కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహణకు ఏర్పాటు చేశారు. దాదాపు 40,660 మంది పరీక్ష రాయనున్నారు. ఉదయం 9:30 నుంచి 12 గంటలు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు 2 విడతలుగా నిర్వహిస్తున్నారు. కర్నూలులో 4, ఆదోని, ఎమ్మిగనూరులో ఒక్కొక్క కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర పరిశీలకుడు నరసింహారావు, విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ఏర్పాట్లను పరిశీలించారు.

News October 2, 2024

విధుల్లోకి విశాఖ ఉక్కు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు

image

ఇటీవల స్టీల్ ప్లాంట్ నుంచి తొలగించిన 4,000 మంది ఉద్యోగులను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు బుధవారం కార్మిక శాఖ అధికారి పేరిట ఒక ప్రకటన విడుదలైంది. ఇటీవల స్టీల్ ప్లాంట్ నుంచి తొలగించిన వారిని యథావిధిగా మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని ఆ ప్రకటనలో అధికారి కోరారు. దీంతో కార్మికుల ఆందోళన కొంత మేరకు ఫలించింది.

News October 2, 2024

అభివృద్ధికి అవసరమైన సలహాలు ఇవ్వండి: ప్రకాశం కలెక్టర్

image

రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం పిలుపునిచ్చారు. ఆ దిశగా స్వర్ణాంధ్ర- 2047 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సర్వేలో ప్రజలు పాల్గొనాలని సూచించారు. “https://swarnandhra.ap.gov.in” వెబ్సైట్ ఓపెన్ చేసి పేరు, వయస్సు, జిల్లా తదితర వివరాలను పూర్తిచేసిన తర్వాత వచ్చే 11 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు.