Andhra Pradesh

News April 10, 2024

కిర్లంపూడి: పవన్‌కు ముద్రగడ సవాల్

image

జనసేన అధినేత పవన్ మగాడయితే.. నేరుగా తనమీద మాట్లాడాలంటూ YCP నాయకులు ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు. ‘పవన్ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. పవన్ హైదరాబాద్‌లో పుట్టారు. ఆ రాష్ట్రం వేరు, ఈ రాష్ట్రం వేరు. హైదరాబాద్ నుంచి పిఠాపురం వచ్చి పవన్ MLA కావాలనుకోవడం ఎంత వరకు సబబు?’ అని ప్రశ్నించారు.

News April 10, 2024

పార్వతీపురంలో పశువుల వ్యాన్ సీజ్

image

పార్వతీపురంలో ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న పశువుల వ్యాన్ సీజ్ చేసినట్లు పార్వతీపురం తహశీల్దార్ కె.ఆనందరావు తెలిపారు. స్థానిక ఎస్సై సంతోషి కుమారితో పార్వతీపురంలో బుధవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వ్యాన్‌లో అనుమతులు లేకుండా పశువుల రవాణా చేస్తున్నట్లు గుర్తించి.. వాహనాన్ని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో రెవెన్యూ ఇనస్పెక్టర్ వి.రామకృష్ణ ఉన్నారు.

News April 10, 2024

కావలిలో ‘ఓటరు సెల్ఫీ’ బూత్ ప్రారంభం

image

కావలి రెవెన్యూ కార్యాలయంలో 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను చైతన్యపరిచేందుకు ఏర్పాటు చేసిన సెల్ఫీ బూత్‌ను కావలి రిటర్నింగ్ అధికారి శీనానాయక్‌తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ధృడమైన ప్రజాస్వామ్యం కోసం తప్పనిసరిగా ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

News April 10, 2024

చీమకుర్తిలో 2.6 కేజీల గంజాయి పట్టివేత

image

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గ్రానైట్ కు నిలయమైన చీమకుర్తి పట్టణంలో గంజాయి భూతం జడలు విప్పుతోంది. ఇటీవల బడ్డీ బంకుల్లో సైతం గంజాయి చాక్లెట్లు అమ్ముతుండగా అధికారులు పట్టుకున్నారు. తాజాగా 2.6 కేజీల గంజాయిని వారు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం చీమకుర్తిలో ఎస్ఈబీ డీఎస్పీ గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశామని తెలిపారు.

News April 10, 2024

రాజంపేట: ‘ఇప్పటికైనా గుర్తించి, సీటు ఇస్తే గెలుచుకొస్తా’

image

టీడీపీ అధిష్ఠానం ఇప్పటికైనా గుర్తించి, తనకు టీడీపీ టికెట్ ఇస్తే అత్యధిక మెజార్టీతో గెలుస్తానని రాజంపేట టీడీపీ ఇన్‌ఛార్జ్ బత్యాల చెంగల్రాయుడు ధీమా వ్యక్తం చేశారు. రాజంపేట రాంనగర్‌లో బుధవారం తెలుగుదేశం పార్టీ తరఫున బత్యాల ప్రచారం ప్రారంభించారు. రాజంపేట టీడీపీ అభ్యర్థి సుగవాసి ఈరోజు ప్రచారం ప్రారంభించగా, అదే సమయానికి బత్యాల మరో చోటు నుంచి ప్రచారం ప్రారంభించడం అందరినీ అయోమయ పర్చింది.

News April 10, 2024

ఉండి టీడీపీ శ్రేణుల వరుస రాజీనామాలు

image

ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే మంతెన రామరాజు టిక్కెట్ మారుస్తున్నారు అంటూ వస్తున్న ప్రచారానికి రామరాజు అభిమానులు పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు. ఈ రాజీనామా లేఖను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపినట్లుగా కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఈ రాజీనామాలు నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు చేసినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు.

News April 10, 2024

నెల్లూరు: 20 రోజుల్లో 981 మంది వాలంటీర్లు రాజీనామా

image

నెల్లూరు జిల్లాలో వాలంటీర్ల రాజీనామాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 20 రోజుల్లో దాదాపు 981 మంది రాజీనామా చేయగా… ఇంకా వందల సంఖ్యలో రాజీనామాలు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో సుమారు 13 వేల మంది వాలంటీర్లు ఉండగా.. వారిలో దాదాపు పదిశాతం మంది రాజీనామాలు చేశారు. కావలి, కోవూరు నియోజకవర్గాల నుంచి అత్యధికంగా వాలంటీర్లు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

News April 10, 2024

కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్ధం: ఉమ్మి యూసుఫ్

image

ఆదోని ప్ర‌జ‌లు మార్పును కోరుకుంటున్నార‌ని, కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశిస్తే ఆదోని నుంచి ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా బ‌రిలో ఉంటాన‌ని ఉమ్మి యూసుఫ్ తెలిపారు. ఆయన ఇటీవ‌లే ఎంఐఎం నుంచి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆదోనిలోని ఆయ‌న నివాసంలో మంగళవారం విలేక‌రుల‌తో మాట్లాడారు. అధిష్ఠానం టికెట్ ఇత‌రుల‌కు ఇచ్చినా వారితో క‌లిసి ప‌ని చేస్తాన‌న్నారు. అభివృద్ధి జ‌ర‌గాలంటే ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్య‌మ‌న్నారు.

News April 10, 2024

అమలాపురం MLA అభ్యర్థి ప్రకటన

image

రానున్న ఎన్నికల్లో అమలాపురం అసెంబ్లీ అభ్యర్థిగా బీఎస్పీ నుంచి పాలమూరి మోహన్ పోటీ చేస్తారని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి తెలిపారు. ఉప్పలగుప్తం మండలం సరిపెల్ల గ్రామానికి చెందిన మోహన్ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్నారు. పార్టీ ఆశయాల పట్ల ఆకర్షితులై ఇటీవల బీఎస్పీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో నియోజవర్గంలో మోహన్‌ను గెలిపించాలని కోరారు.

News April 10, 2024

కురిచేడు: విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

image

కురిచేడు మండలంలోని పడమర నాయుడుపాలెంలో విద్యుత్‌షాక్‌ తగిలి వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు..  గ్రామానికి చెందిన పల్లె పాపయ్య(49) ఇంట్లో ఫ్యాన్‌ తిరగకపోవడంతో మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.