India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భీమిలి మండలం అన్నవరంలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు బుధవారం ఉదయం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ముందుగా గ్రామంలో గల రామాలయంలో సతీసమేతంగా విశేష పూజలు నిర్వహించారు. అనంతరం విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్‌తో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని అన్నారు.
గుంటూరు జిల్లా బుడంపాడు సమీపంలో రహదారిపై బుధవారం వృద్ధుడి మృతదేహం పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు వివరాల మేరకు.. నారాకోడూరు నుంచి బుడంపాడు మార్గంలో రహదారిపై ఓ వృద్ధుడు పడి ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న స్థానికులు అంబులెన్స్‌లో జీజీహెచ్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులకు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కొవ్వూరుకు చెందిన షేక్ నాగూర్ వలిని మంగళవారం అరెస్ట్ చేశామని అవనిగడ్డ ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. అవనిగడ్డ యూనియన్ బ్యాంకులో రుణం చెల్లించేందుకు సోమవారం రూ.50 వేలు తెచ్చిన వృద్ధురాలు వాకా కృష్ణకుమారిని నమ్మించి నగదుతో పరారయ్యాడు. కాగా నాగూర్ వలి గజదొంగ అని అతనిపై 70 కేసులు ఉన్నాయన్నారు. బ్యాంకులకు వచ్చే వృద్ధులను టార్గెట్ చేసుకొని వారిని నమ్మించి మోసం చేస్తుంటాడని తెలిపారు.
తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి అత్యధిక సార్లు ఎంపీగా ఎన్నికైన ఘనత చింతామోహన్ దే. 1984లో టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన ఆయన 1989, 1991, 1998, 2004, 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించి లోక్ సభలో ప్రవేశించారు. కేంద్ర మంత్రిగానూ వ్యవహరించారు. 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగానే బరిలోకి దిగుతున్నారు.
వారంరోజులుగా నిప్పుల కొలిమిని తలపించిన ఎండలు.. చిత్తూరులో మంగళవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. మండలాలవారీగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు.. శ్రీరంగరాజపురంలో 39.4, నిండ్రలో 39.0, విజయపురంలో 38.9, నగరిలో 38.9, పుంగనూరులో 38.8, గుడిపాలలో 38.7, తవణంపల్లెలో 38.3, గుడుపల్లెలో 38.0, పాలసముద్రంలో 37.8, చిత్తూరులో 37.6, సదుంలో 37.6, శాంతిపురంలో 37.4, కుప్పంలో 37.1, బంగారుపాళ్యంలో 37.0, నమోదయ్యాయి.
కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా టిపుటూరుకు చెందిన అనూషా సైబర్ మోసానికి గురయ్యారు. గత ఏడాది డిసెంబర్‌లో ఆమె బ్యాంకు ఖాతా నుంచి వివిధ దశల్లో రూ.20 లక్షలను సైబర్ నేరస్తులు లాగేశారు. దీనిపై కర్ణాటక పోలీసులు విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో నెల్లూరు శోధన్ నగర్‌కు చెందిన డి.జగదీశ్, సంతోశ్, వెంకటగిరి మండలం వల్లివేడుకు చెందిన సురేశ్, కార్వేటినగరానికి చెందిన మునీంద్ర ఉన్నారు.
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన షేక్ నాగూర్ వలిని మంగళవారం అరెస్ట్ చేశామని అవనిగడ్డ ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. అవనిగడ్డ యూనియన్ బ్యాంకులో రుణం చెల్లించేందుకు సోమవారం రూ.50 వేలు తెచ్చిన వృద్ధురాలు వాకా కృష్ణకుమారిని నమ్మించి నగదుతో పరారయ్యాడు. కాగా నాగూర్ వలి గజదొంగ అని అతనిపై 70 కేసులు ఉన్నాయన్నారు. బ్యాంకులకు వచ్చే వృద్ధులను టార్గెట్ చేసుకొని వారిని నమ్మించి మోసం చేస్తుంటాడని తెలిపారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకులు పార్టీల ఫిరాయింపులతో ఉమ్మడి కడప జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా రాయచోటి మాజీ YCP ఆర్.రమేశ్ కుమార్ రెడ్డి TDPకి రాజీనామా చేసి, నేడు జగన్ సమక్షంలో YCPలో చేరుతున్నట్లు స్పష్టంచేశారు. అయితే సోదరుడు శ్రీనువాసులరెడ్డి సతీమణి మాధవిరెడ్డి కడప TDP MLA అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దీంతో సోదరులు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఉండటంతో ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట ఎంపీ స్థానానికి జి.అలెగ్జాండర్‌ను పార్టీ ఖరారు చేసింది. ఆయన నరసరావుపేట అసెంబ్లీ స్థానానికి 2014, 2019లో పోటీ చేసి ఓడిపోయారు. 1993 నుంచి అలెగ్జాండర్ న్యాయవాద వృత్తిలో ఉన్నారు. న్యాయవాదుల సంఘ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. ఈయన పూర్తి పేరు గర్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్. మండలంలోని గురవాయపాలెంలో పుట్టి, నరసరావుపేటలో స్థిరపడ్డారు.
భానుడి భగభగలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మంగళవారం ఆదోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలకు తోడు వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మంత్రాలయంలో 41.3 డిగ్రీలు, చాగలమర్రిలో 40.6, కౌతాళంలో 40.3, గడివేములలో 40.2, బనగానపల్లె, డోన్, నందికొట్కూరు, గోస్పాడు మండలాల్లో 40.1, చిప్పగిరిలో 36.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Sorry, no posts matched your criteria.