India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖపట్నంకు చెందిన బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ మంగళవారం టీడీపీలో చేరారు. ఈ మేరకు ఆయనను టీడీపీ అధినేత చంద్రబాబు మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ.. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కూటమి అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తానని అన్నారు. ఇటీవల సుధాకర్ వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
చీరాలలో రాజకీయం రోజురోజుకీ ఆసక్తిగా మారుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన YCP నుంచి కరణం వెంకటేశ్, TDP నుంచి కొండయ్య పోటీ పడుతుండగా ప్రచారం కూడా ముమ్మరం చేశారు. అయితే వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డ ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో చీరాలలో త్రిముఖ పోటీ తప్పదని ప్రజలు అంటున్నారు. ఇప్పటికే చీరాల నుంచి రెండు సార్లు గెలిచిన ఆమంచికి బలమైన కేడర్ ఉన్నా TDP, YCPపై గెలిచేనా?
భారత చైతన్య యువజన పార్టీ(బిసివై) పత్తికొండ అసెంబ్లీ అభ్యర్థిగా మిద్దె వెంకటేశ్వర్లను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ మంగళవారం ప్రకటించారు. తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన వెంకటేశ్వర్లు సామాన్య రైతు కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చారు. బీసీ యువనేతగా ఉన్న ఆయనకు సర్వే ద్వారా సీటు కేటాయించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు.
ఈ నెల 12న గుంటూరు నగరంలో సీఎం జగన్ మేమంతా సిద్ధం సభ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ తలశిల రఘురాం తెలిపారు. మంగళవారం ఆయన సభ జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 12న సీఎం జగన్ యాత్ర సత్తెనపల్లి, పేరేచర్ల, నల్లపాడు మీదుగా గుంటూరులోని ఏటుకూరు సెంటర్‌కు చేరుకుంటుదన్నారు. అక్కడ సభలో జగన్ ప్రసంగిస్తారని చెప్పారు.
టెక్కలి నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ముగ్గురు మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీని వీడి షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఇక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్, టీడీపీ కూటమి అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు పోటీలో ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది. 2024లో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ నెలకొంది.
సంగమేశ్వర ఆలయం సమీపంలోని సంగాల మడుగులో పడి తాటిమాకుల పల్లెకు చెందిన సంజయ్ కుమార్(13) అనే బాలుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం సంజయ్ కుమార్ స్నేహితులతో కలిసి సంఘాల మడుగులో ఈతకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. నీటిలో మునిగిపోతున్న మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలుడి మృతితో పండగ పూట ఆ ఇంట విషాదం నెలకొంది.
టీటీడీ విద్య, వైద్య విభాగం జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా గౌతమిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. చిత్తూరు జిల్లా వాసి అయిన ఈమె గతంలో అనంతపురం జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఎండోమెంట్ రెవెన్యూ విభాగంలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు. బదిలీ నిమిత్తం తిరుపతి జేఈఓగా వెళ్లనున్నారు.
పండగలు నేపథ్యంలో పూల ధరలు పెరిగాయి. జిల్లాలో సాగయ్యే కనకాంబరాలు పూలు తక్కువగా రావడం, డిమాండు అధికంగా ఉండటంతో కిలో రూ.1000 ధర పలికింది. ఇక, బంతిపూల మాల రూ.200 నుంచి రూ.250 వరకు పలికాయి. కిలో బంతులు ఒకటో రకం రూ.120- నుంచి రూ. 100 ధరతో లభిస్తున్నాయి. మల్లెపూలు రకాలను బట్టి రూ. 400 నుంచి 700 వరకు ఉన్నాయి. పండుగల నేపథ్యంతో పాటు పూల సాగు తగ్గడంతో ధరల పెరుగుదల ఉన్నట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
ఆత్మకూరు నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆత్మకూరు ఎంపీపీ కేతా వేణుగోపాల్‌రెడ్డి, రావులకొల్లు సర్పంచి రామిరెడ్డి మోహన్‌రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. నెల్లూరులోని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసంలో టీడీపీలో చేరారు. వారికి వేమిరెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి పసుపు కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు.
విజయవాడ పశ్చిమ టికెట్ ఆశించి భంగపడి, జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేశ్ మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాట ఇచ్చి మడమ తిప్పని నాయకుడితో కలుస్తానన్నారు. జనసేన అధ్యక్షుడికి సొంత పార్టీపై ప్రేమ లేదని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను బట్టి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కూటమిలో భాగంగా వెస్ట్ టికెట్ సుజనా చౌదరికి దక్కిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.