India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏలూరు MP అభ్యర్థిగా కావూరి లావణ్యను కాంగ్రెస్ ఖరారు చేసింది. ఇక్కడి నుంచి కావూరి సాంబశివరావు 2004, 2009 ఎన్నికల్లో 2సార్లు ఎంపీగా గెలిచారు. ఈసారి ఎన్నికల్లో ‘కావూరి’ ఫ్యామిలీకి చెందిన NRI లావణ్య కాంగ్రెస్ తరపున బరిలో దిగుతున్నారు. సాంబశివరావు కేంద్ర మంత్రిగా ఏలూరులో తనదైన ముద్ర వేశారు. కాగా.. ఇక్కడ వైసీపీ నుంచి కారుమూరి సునీల్ కుమార్, కూటమి నుంచి పుట్టా మహేశ్ బరిలో ఉన్నారు.
టెక్కలి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కిల్లి కృపారాణి పోటీచేయనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం మరో 12 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను మంగళవారం రాత్రి విడుదల చేయగా.. కృపారాణి పేరు అందులో ఖరారైంది. వైసీపీని వీడిన ఆమె ఇటీవలే వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడం తెలిసిందే.
కాంగ్రెస్ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా కొప్పుల రాజు పేరు ఖరారైంది. గతంలో ఆయన జాతీయ ఎస్సీ, ఎస్టీ సెల్ చైర్మన్‌గా పని చేశారు. రాహుల్ గాంధీ అంతరంగికుడిగా కీలకంగా వ్యవహరించారు. దీంతో నెల్లూరు ఎంపీగా ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇదే స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైసీపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి బరిలో ఉన్నారు.
మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారయత్నం చేసిన నిందితుడు నగరుకు చెందిన ముత్తుకూరు రాముడును అరెస్టు చేసినట్టు సీఐ హనుమంతప్ప మంగళవారం తెలిపారు. బిణిగేరికి చెందిన మతిస్థిమితం లేని మహిళను రాముడు ఆదివారం రాత్రి బలవంతంగా అత్యాచారం చేస్తుండగా కొందరు వెళ్లేసరికి అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. సోమవారం బాధితురాలు అన్న ఫిర్యాదు మేరకు ఆస్పరిలో పోలీసులు అరెస్టు చేశారు.
సంతమాగులూరు మండలంలో రేపు సీఎం జగన్ మేము సిద్ధం బస్సు యాత్ర జరగనుంది. 12వ రోజు యాత్రలో భాగంగా జగన్ గంటవారిపాలెం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరనున్నారు. జిల్లా పరిధిలోని వెల్లలచెరువు, కామేపల్లి పుట్టవారిపాలెం జంక్షన్‌లలో ఈ యాత్ర సాగనుందని పార్టీ నేతలు తెలిపారు. విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారని చెప్పారు.
సార్వత్రిక ఎన్నికల మస్కట్ రూపకల్పనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ మంగళవారం తెలిపారు. ఎన్నికల మస్కట్ రూపకల్పనలో జిల్లా ప్రజలు, డ్రాయింగ్, క్రాఫ్ట్ టీచర్లు, కేజీబీవీ పాఠశాల, కళాశాల విద్యార్థులు, ఇంజనీరింగ్ కళాశాలలు, జేఎన్టీయూ, ఎస్కేయు, పెయింటింగ్ సంస్థలు ఎన్నికల మస్కట్ రూపకల్పనలో పాలుపంచుకోవచ్చన్నారు.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం నగరంతో పాటు నరసన్నపేట, పలాస, ఇతర ప్రాంతాల్లో బంగారం దుకాణాలు కళకళలాడాయి. పసిడి ధరలు పరుగులు పెడుతున్నా ఏమాత్రం వెనుకాడకుండా బంగారం, ఆభరణాలు, వెండి వస్తువులు కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపారు. తెలుగు వారు చేసుకునే తొలి పండుగ ఉగాది. ఉగాది రోజున కొత్త వస్తువులు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే ఏడాది పొడవునా అదే తరహాలో కొనుగోలు చేస్తుంటారని ఒక నమ్మకం.
కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ చింతామోహన్‌ను అధిష్ఠానం ఖరారు చేసింది. ఆయన ఇప్పటి వరకు 6 సార్లు తిరుపతి ఎంపీగా గెలిచారు. అలాగే ఇటీవల వైసీపీని వీడి హస్తం గూటికి చేరిన MS బాబుకు పూతలపట్టు MLA టికెట్ దక్కింది. ఆయన 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆయనకు వైసీపీ టికెట్ నిరాకరించడంతో పార్టీ మారారు. జీడీనెల్లూరు కాంగ్రెస్ MLA అభ్యర్థిగా రమేశ్ బాబు పోటీ చేయనున్నారు.
భారత చైతన్య యువజన పార్టీ మొదటి జాబితాను ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆకుల వెంకటస్వామికి టికెట్ కేటాయించారు. ప్రముఖ న్యాయవాదిగా, మాజీ కౌన్సిలర్‌గా పని చేశారు. జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులుగా, నరసాపురం పార్లమెంటరీ కో-ఆర్డినేటర్‌గా పనిచేసి రాజీనామా చేశారు.
విజయనగరం పట్టణంలో వెలసిన శ్రీ దేవీ దండుమారమ్మ దేవాలయంలో అమ్మవారి ఉత్సవాలను ఏప్రిల్ 9 నుంచి 16 వరకు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మంగళవారం విజయనగరం జిల్లా ఎస్పీ ఎం. దీపికా పాటిల్, మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ దంపతులు పాల్గొని, జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఎస్పీ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.