India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప జిల్లాలో ఉగాది రోజు విషాదం నెలకొంది. వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట వద్ద ఈతకు వెళ్లిన వ్యక్తి మృతిచెందాడు. కడపకు చెందిన డేవిడ్ నలుగురు స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు ఆనకట్ట వద్దకు వచ్చాడు. ఈత కొట్టే క్రమంలో నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు మృతదేహాన్ని వెలికి తీశారు. వల్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా తుమ్మల రామస్వామి (బాబు) నియమితులయ్యారు. పెద్దాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న రామస్వామికి టికెట్ దక్కపోవడంతో ఆయనను జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జగ్గంపేట నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిగా ఉన్న పాఠంశెట్టి సూర్యచంద్రను తొలగించి.. తుమ్మలపల్లి రమేశ్‌ను నియమించారు. కాకినాడ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కమిటీ కార్యదర్శిగా తోట సుధీర్ నియమితులయ్యారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 4 అసెంబ్లీ స్థానాలకు భారత చైతన్య యువజన పార్టీ(BCY) తరఫున MLA అభ్యర్థులను ఆ పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్ ప్రకటించారు. మిగిలిన 10 స్థానాలకు కూడా త్వరలో MLA, నంద్యాల, కర్నూలు ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. నంద్యాల – చింతలపల్లె సుధాకర రావు, డోన్- తరి గోపుల, బాలసుబ్బయ్య (బాలు యాదవ్) పత్తికొండ – మిద్దె వెంకటేశ్వర్లు ఆలూరు – మోహన్ ప్రసాద్ పేర్లను ఖరారు చేశారు.
రణస్థలం మండలంలోని పైడిభీమవరం చెక్‌పోస్ట్ వద్ద ఎటువంటి రసీదులు, ఆధారాలు లేని వ్యక్తి నుంచి రూ.6,75,000 జేఆర్ పురం ఎస్సై కే. గోవిందరావు, ఎస్సై ఉమామహేశ్ పట్టుకున్నారు. ఆ వ్యక్తి అనపర్తి నుంచి కోటబొమ్మాళికి వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుకున్న నగదును ఆర్వోకు అందజేశామని ఎస్సై తెలిపారు. సంబంధిత రసీదులు అందజేస్తే నగదు అందజేస్తామని తెలిపారు.
పెద్దవడుగూరు మండలం చిత్రచేడు గ్రామంలో మంగళవారం ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్న పుల్లన్న పొరపాటున మద్యంలో పురుగు మందు కలుపుకొని తాగినట్లు సమాచారం. అయితే తాగిన గంటలోనే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పెద్దవడుగూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాకుమాను గ్రామ సచివాలయం-2లో వాలంటీర్‌గా పనిచేస్తున్న స్వాంగ రత్న కిషోర్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి, వైసీపీ సంబంధించిన ర్యాలీలో మంగళవారం పాల్గొన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి.. పార్టీ ర్యాలీలో పాల్గొన్న వాలంటీర్‌ను తొలగించామని కాకుమాను పంచాయతీ కార్యదర్శి నివేదిక సమర్పించారు. వాలంటీర్‌ను విధుల నుంచి ఎంపీడీఓ తొలగించారు.
ఏపీలో భారత చైతన్య యువజన పార్టీ తరఫున పోటీ చేసే 32 మంది అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్(RCY) విడుదల చేశారు. తొలి జాబితాలో ఉమ్మడి కడప జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం కల్పించారు. పులివెందులలో సూరే నిర్మల, రైల్వేకోడూరులో పూటిక సుబ్బారాయుడు పోటీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలోని మిగిలిన 8 స్థానాలకు త్వరలో అభ్యర్థులను ఖరారు చేస్తామని రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు.
చిత్తూరు జిల్లాలో చంద్రబాబు 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్ సృష్టించారు. ఆయన 1978లో చంద్రగిరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. 1983లో అక్కడ ఓడిపోయారు. 1985లో ఎక్కడా పోటీ చేయలేదు. 1989 నుంచి వరుసగా ఏడు సార్లు కుప్పం నుంచి గెలిచారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి 6 సార్లు విజయం సాధించారు. పీలేరు, పుంగనూరు నుంచి మూడేసి సార్లు MLAగా ఎన్నికయ్యారు.
నెల్లూరు, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో మూడు దశాబ్దాలుగా ప్రజా తీర్పు ఒకేలా ఉంటోంది. 1989, 91, 96, 98లో రెండు చోట్లా కాంగ్రెస్ అభ్యర్థులు ఎంపీలుగా గెలిచారు. 1999లో నెల్లూరులో టీడీపీ, తిరుపతి ఎంపీగా టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, 2014, 19 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను విజయం వరించింది. ప్రస్తుత ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుందో.
కృష్ణా వర్సిటీ పరిధిలో డిసెంబర్ 2023లో నిర్వహించిన పీజీ 3వ సెమిస్టర్ పరీక్షలకు(2022- 23) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీవాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 22వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.9,00 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చన్నారు.
Sorry, no posts matched your criteria.