India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చేబ్రోలులో పవన్ కళ్యాణ్‌తో రఘురామ కృష్ణరాజు భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎంపీగా పోటీ చేస్తానో, ఎమ్మెల్యేగా పోటీ చేస్తానో అసంపూర్తిగా ఉందని, దీనిపై పవనే త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డే పిఠాపురంలో ఉన్నా .. పవన్‌కు 65వేలకు పైగా మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
భారత చైతన్య యువజన పార్టీ నెల్లూరు సిటీ అభ్యర్థిగా కాళహస్తి చెంచు మహేశ్ బరిలో నిలవబోతున్నారు. ఈ మేరకు బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. ఈ జాబితాలో నెల్లూరు సిటీ అభ్యర్ధిగా చెంచు మహేశ్‌ను ప్రకటించారు.
ఏపీలో భారత చైతన్య యువజన పార్టీ తరఫున పోటీ చేసే 32 మంది అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్(RCY) విడుదల చేశారు. పుంగనూరు నుంచి RCY పోటీ చేయనుండగా తిరుపతిలో కృష్ణవేణి యాదవ్, శ్రీకాళహస్తిలో దినాడ్ బాబు, పూతలపట్టులో నాంపల్లి భాను ప్రసాద్ బరిలో ఉంటారు. మిగిలిన అభ్యర్థుల జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు.
చేబ్రోలులో పవన్ కళ్యాణ్‌తో రఘురామ కృష్ణరాజు భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎంపీగా పోటీ చేస్తానో, ఎమ్మెల్యేగా పోటీ చేస్తానో అసంపూర్తిగా ఉందని, దీనిపై పవనే త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డే పిఠాపురంలో ఉన్నా .. పవన్‌కు 65వేలకు పైగా మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
చికెన్ ధరలు రోజురోజుకీ పెరుగుతుండడంతో వినియోగదారులు హడలిపోతున్నారు. మొన్నటివరకు 200 నుండి 220 రూపాయల వరకు పెరిగిన చికెన్ ధరలు మంగళవారం నాటికి 310 కి చేరుకుంది. దీంతో మాంసాహార ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉగాది పండుగ సందర్భంగా చికెన్ దుకాణాల వద్ద వినియోగదారులు రద్దీగా ఉన్నప్పటికీ అధిక మోతాదులో చికెన్ విక్రయాలు జరగడంలేదని వ్యాపారస్థులు తెలిపారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని టీడీపీ నేత అయ్యన్న, బీజేపీ నేత సీఎం రమేశ్‌కు ఆర్డీఓ జయరాం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 6న బీజేపీ సమావేశానికి హాజరైన మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారన్న ఫిర్యాదుపై ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేసేందుకు వచ్చారు. వారి ఎదుట అయ్యన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలను తీవ్ర పదజాలంతో విమర్శించారని, సీఎం రమేశ్ పక్కనే ఉన్నారని.. ఇద్దరి సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేశారు.
సాలూరులో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ఉగాది పర్వదినం సందర్భంగా బంగారు చీరతో అలంకరించారు. సుమారు 1500 గ్రాముల బంగారు తాపడంతో ప్రత్యేకంగా రూపొందించిన ఈ బంగారు చీరలో తల్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల నుంచి అధిక మొత్తంలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ట్రాఫిక్ మెయిన్‌టెనెన్స్ కారణంగా చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వచ్చే జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను(నెం.12077) దారి మళ్లించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు మంగళవారాలు మినహా ఈ నెల 10 నుంచి 30 వరకు ఈ ట్రైన్ న్యూ గుంటూరు స్టేషన్ మీదుగా కాక తెనాలి, దుగ్గిరాల, కృష్ణా కెనాల్ స్టేషన్ల మీదుగా విజయవాడ చేరుకుంటుందన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరుతూ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
శ్రీశైలానికి కాలినడకన వచ్చి వెళుతున్న కన్నడ వాసుల సౌకర్యార్థం విజయవాడ నుంచి గిద్దలూరు మీదుగా హుబ్లీకి ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 10న విజయవాడలో రైలు మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 6.48 గంటలకు గిద్దలూరుకు చేరుకుంటుందన్నారు. మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు హుబ్లీ చేరుతుందని చీఫ్ కమర్షియల్ మేనేజర్ లక్ష్మీనారాయణ తెలిపారు.
మద్యం అక్రమ రవాణాదారులకు కొంతమంది సెబ్ సిబ్బంది సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, విచారణలో నిజమని తేలితే చర్యలు తప్పవని కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు హెచ్చరించారు. నుంచి కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాల సెబ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. చెక్‌పోస్టులలో తనిఖీలు ముమ్మరం చేయడం ద్వారా మద్యం, డబ్బు, కానుకలు అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.