Andhra Pradesh

News April 9, 2024

పల్నాడు: నేడు వైసీపీ మేనిఫెస్టో విడుదల.?

image

సీఎం జగన్ నేడు ఉగాది పర్వదినం సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తారని సమాచారం. ప్రస్తుతం ఆయన ‘మేమంతా సిద్ధం’ యాత్రలో భాగంగా పల్నాడు జిల్లాలో ఉన్నారు. నేడు శావల్యాపురం మండలంలోని గంటావారిపాలెంలో వేడుకల్లో పాల్గొననున్న ఆయన, మేనిఫెస్టో ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి కూడా ఉగాది రోజు మేనిఫెస్టో ప్రకటన ఉన్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.

News April 9, 2024

అద్దంకిలో ఆ రికార్డ్ బద్దలయ్యేనా..

image

2009లో కాంగ్రెస్ నుంచి గొట్టిపాటి రవి కుమార్ 15,764 ఓట్లు మెజార్టీతో విజయం సాధించగా.. 1999లో టీడీపీ నుంచి బి.గరటయ్య కేవలం 249 ఓట్లతో గెలిచారు. అద్దంకిలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగగా.. గొట్టిపాటికి వచ్చిన 15,764 ఓట్ల మెజార్టీనే అత్యధిక రికార్డు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి హనిమిరెడ్డి, కూటమి నుంచి మరోసారి గొట్టిపాటి బరిలో ఉన్నారు. ఈయన రికార్డును హనిమిరెడ్డి బ్రేక్ చేయగలరనుకుంటున్నారా.

News April 9, 2024

జమ్మలమడుగులో ఆ రికార్డ్ బద్దలయ్యేనా..

image

జమ్మలమడుగులో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 1985లో టీడీపీ నుంచి పి.శివారెడ్డి 55,170 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. కాగా 1999లో టీడీపీ నుంచి బరిలో నిలిచిన పి.రామసుబ్బారెడ్డి కేవలం 357 ఓట్లతో గెలిచారు. తాజా ఎన్నికల్లో వైసీపీ నుంచి సుధీర్ రెడ్డి, కూటమి నుంచి ఆదినారాయణ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో ఎవరు ఆ రికార్డ్‌ను బ్రేక్ చేస్తారనుకుంటున్నారు.

News April 9, 2024

శావల్యాపురం: నేడు ఉగాది వేడుకల్లో సీఎం జగన్ దంపతులు

image

పల్నాడు జిల్లాలో బస్సు యాత్ర నిర్వహిస్తున్న సీఎం జగన్ మంగళవారం ప్రజల మధ్య ఉగాది వేడుకలు జరుపుకోనున్నారు. వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం గంటవారిపాలెంలో జగన్ సతీసమేతంగా వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన ఉగాది పంచాంగ శ్రవణం వింటారు. నిన్న జగన్ యాత్ర పల్నాడు జిల్లాలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.

News April 9, 2024

ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గద్దల రాజు

image

పత్తికొండ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలవనున్నట్లు గద్దల రాజు తెలిపారు. ఆదివారం పత్తికొండలో విలేకరులతో ఆయన మాట్లాడారు. నియోజకవర్గం అభివృద్ధి చేయాలని తపనతో తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నానని అన్నారు. గతంలో అనేక పార్టీల నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు.. మంత్రి పదవులు చేపట్టినా నియోజకవర్గం అభివృద్ధి నోచుకోలేదన్నారు. తాగు, సాగునీరు అందించడంలో స్థానిక ఎమ్మెల్యేలు విఫలమయ్యారన్నారు.

News April 9, 2024

ఏలూరు జిల్లాలో 16 కిలోల బంగారం స్వాధీనం

image

ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లాలోని చెక్ పోస్టుల వద్ద విస్తృత వాహన తనిఖీలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏలూరు జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో మొత్తం రూ. 22,18,600 నగదు, 140 లీటర్ల మద్యం, 16.258 కిలోల బంగారం, 31.42 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

News April 9, 2024

ప్రొద్దుటూరులో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

image

ప్రొద్దుటూరులోని పవర్ హౌస్ రోడ్లో మల్లీ అనే వ్యక్తి సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని ఒకటో పట్టణ ఎస్సై మంజునాథ్ తెలిపారు. స్థానిక మిట్టమడి వీధిలో బాడుగ ఇంట్లో మల్లీ, ఆయన భార్య, ఇద్దరు పిల్లలుతో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా దంపతులు మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట భార్యాభర్తల మధ్య గొడవ జరగింది. మనస్తాపంతో మల్లీ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

News April 9, 2024

పిఠాపురం రానున్న పవన్ కళ్యాణ్

image

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ మంగళవారం పిఠాపురం నియోజకవర్గానికి రానున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో జరగనున్న ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు గొల్లప్రోలు హెలిప్యాడ్‌కు చేరుకుని అక్కడి నుంచి చేబ్రోలులో ఏర్పాటు చేసిన నివాసానికి చేరుకుంటారు. అనంతరం ఇంటిలోకి కొబ్బరికాయ కొట్టి ప్రవేశిస్తారు. ఇప్పటికే చేబ్రోలు నివాసం వద్ద పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగత భద్రతా సిబ్బంది మొహరించారు.

News April 9, 2024

కేశేపల్లిలో చేనేత కార్మికుడి ఆత్మహత్య

image

నార్పల మండల పరిధిలోని కేశేపల్లిలో సోమవారం రాత్రి నాగానంద అనే చేనేత కార్మికుడు తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నాగానందం ఆర్థిక ఇబ్బందులతోనే ఉరి వేసుకున్నాడని స్థానికులు తెలిపారు. మృతుడు నాగానందానికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి సందర్శించి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

News April 9, 2024

చిత్తూరు: రాజకీయ పార్టీలకు ఎస్పీ సూచనలు

image

ఇంటింటి ప్రచారం కోసం ముందస్తుగా పోలీసు అధికారులకు సమాచారం అందించాలని రాజకీయ పార్టీలకు ఎస్పీ మణికంఠ సూచించారు. ఎన్నికల ప్రచార సమయంలో బాణసంచా ఉపయోగించరాదన్నారు. పోస్టాఫీసులు, బ్యాంకుల నుంచి నగదును ఇతర పోస్టాఫీసులు, బ్యాంకులకు తరలిస్తుంటే ఆయా రిటర్నింగ్‌ అధికారులకు ముందస్తు సమాచారం అందించాలన్నారు. ఈ సమావేశంలో జేసీ శ్రీనివాసులు, డీఆర్వో పుల్లయ్య, వివిధ బృందాల అధికారులు,నోడల్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.