Andhra Pradesh

News April 9, 2024

విశాఖ: ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని దరఖాస్తులు

image

ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని 200 మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సార్వత్రిక ఎన్నికల మానవ వనరుల విభాగ ఇన్ఛార్జి, వీఎంఆర్డీఓ జాయింట్ కమిషనర్ రవీంద్రకు దరఖాస్తులు అందజేశారు. అనారోగ్య కారణాలు, పదవీ విరమణ అంశాలను ప్రధానంగా చూపుతున్నారు. దీంతో అనారోగ్యం కారణాలపై వచ్చిన దరఖాస్తులను వడబోసేందుకు అయిదుగురు వైద్యులతో కూడిన మెడికల్ బోర్డును ఏర్పాటు చేశారు.

News April 9, 2024

మంగళగిరి సీపీఎం అభ్యర్థిగా జొన్నా శివశంకర్

image

ఇండియా కూటమిలో భాగంగా సీపీఎం రాష్ట్రంలోని 10 ఎమ్మెల్యే, ఒక లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలో మంగళగిరి సీపీఎం అభ్యర్థిగా జొన్నా శివశంకర్‌‌కు టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ పార్టీలో చర్చల అనంతరం సీపీఎం సోమవారం అభ్యర్థులను ఫైనల్ చేసింది. మరోవైపు, మంగళగిరి నుంచి వైసీపీ బరిలో మురుగుడు లావణ్య, కూటమి అభ్యర్థిగా నారా లోకేశ్ బరిలో దిగుతున్న విషయం తెలిసిందే.

News April 9, 2024

శ్రీ సత్యసాయి: సచివాలయ సర్వేయర్ మృతి

image

పరిగి మండలం ఎర్రగుంట్ల సచివాలయ పరిధిలో పనిచేస్తున్న సర్వేయర్ రాజేశ్వరి సోమవారం రాత్రి మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సర్వేయర్ మృతి పట్ల తోటి ఉద్యోగులు సంతాపం తెలిపారు.

News April 9, 2024

కర్నూలు: ప్రేమ జంట ఆత్మహత్యకు ఇదే కారణమా?

image

మంత్రాలయం మండలంలోని తుంగభద్ర రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మండలంలోని రచ్చుమర్రికి చెందిన వెంకటేష్ (21), మంత్రాలయానికి చెందిన నందిని(18) గతేడాది నుంచి ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ విషయం ఇరువురి తల్లిదండ్రులకు తెలుపగా వారు ఒప్పుకోలేదని రైలు కిందపడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.

News April 9, 2024

శ్రీకాకుళం: 98.98 శాతం పింఛన్లు పంపిణీ పూర్తి

image

శ్రీకాకుళం జిల్లాలో సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ ప్రక్రియ సోమవారం నాటికి 98.98 శాతం పూర్తయింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రక్రియను చేపట్టారు. పింఛన్లు పంపిణీ ప్రత్యేక కాస్త ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ జిల్లా వ్యాప్తంగా 732 గ్రామ వార్డు సచివాలయాల్లో పంపిణీ పూర్తి చేశారు. జిల్లాలో 3,21, 689 మంది గాను 3,18,392 పింఛన్లు పంపిణీ చేశామని డీఆర్డిఏ పీడీ తెలిపారు.

News April 9, 2024

ప్రకాశం: 70 మంది ఎన్నికల సిబ్బందికి నోటీసులు

image

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రిసైడింగ్, ఏపీవోలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రెండో విడతలో 70 మంది అధికారులు నియామక ఉత్తర్వులు అందుకుని శిక్షణకు గైర్హాజరు అయ్యారు. వారందరికీ జిల్లా ఎన్నికల అధికారి దినేశ్ కుమార్ సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో సెలవు తీసుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

News April 9, 2024

తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు: కలెక్టర్

image

పుట్టపర్తి టౌన్ క్రోధినామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, ఈ ఉగాది అందరి జీవితాల్లో ఉషస్సులు నింపాలని కలెక్టర్ అరుణ్బాబు, ఆకాంక్షించారు. క్రోధి నామ సంవత్సర తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు, పోలీస్, జిల్లా యంత్రాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ కొత్త ఆలోచనలతో ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలని పిలుపునిచ్చారు. రైతులు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు.

News April 9, 2024

విశాఖ: ముగిసిన టెన్త్ మూల్యాంకనం

image

టెన్త్ జవాబుపత్రాల మూల్యాంకనం సోమవారంతో ముగిసింది. ఈనెల ఒకటో తేదీన జ్ఞానాపురం జూబ్లీ హైస్కూలులో మూల్యాంకనం ప్రారంభమైంది. ఎనిమిది రోజుల్లో మొత్తం 1,76,924 జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు. అత్యధికంగా ఇంగ్లిష్‌ సబ్జెక్టు సంబంధించి 29 వేలు, సోషల్‌ స్టడీస్‌లో 28 వేల పత్రాలు జిల్లాకు వచ్చాయి. మూల్యాంకనం కోసం 104 మంది చీఫ్‌ ఎగ్జామినర్లు, 624 మంది అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు, 208 మంది సహాయకులు పనిచేసారు.

News April 9, 2024

కృష్ణా: పీజీ, ఎం-ఫార్మసీ పరీక్షల ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో కింది కోర్సులకు సంబంధించిన పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఆయా పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలకు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
☞ పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ)- 3వ సెమిస్టర్
☞ ఎం- ఫార్మసీ- 2వ సెమిస్టర్

News April 9, 2024

కడప జిల్లాలో YCP కీలక నేత రాజీనామా

image

కడప జిల్లాలో వైసీపీ మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్ ఖాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు రాజీనామా పత్రాన్ని పంపించారు. ఎమ్మెల్యే సీటు ఇస్తానన్న హామీని ముఖ్యమంత్రి మరిచారని అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. కనీసం కలవడానికి కూడా తనకు జిల్లా నాయకులు అపాయింట్మెంట్ ఇప్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.