Andhra Pradesh

News April 9, 2024

పలమనేరు: తాళిబొట్టుతో మాంత్రికుడు పరార్

image

పలమనేరు పట్టణ పరిధిలోని గంటావూరు కాలనీలో ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చి మనశ్శాంతి ఉండేలా చేయాలని జ్యోతి కర్ణాటక ప్రాంతంలోని ఓ మాంత్రికుడ్ని ఆశ్రయించారు. మాంత్రికుడు ఇంటికి వచ్చి ఆమె మెడలోని తాళిబొట్టుకు పూజలు చేయాలని తీసుకున్నాడు. ఒక చెంబులో ఉంచి పూజలు చేశాడు. రోజంతా దేవుని చిత్రపటం వద్ద ఉంచాలన్నాడు. చెంబు తెరిచి చూడగా అందులో 20 గ్రాముల బంగారు తాళిబొట్టు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News April 9, 2024

విజయనగరంలో రూ.9.30 లక్షల వెండి సీజ్

image

విజయనగరం పట్టణంలోని గంట స్తంభం సమీపంలో సోమవారం ఎటువంటి పత్రాలు లేకుండా ఓ వ్యక్తి వద్ద ఉన్న 14.405 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నామని 1వ పట్టణ సీఐ వెంకట్రావు తెలిపారు. వెండి వస్తువులకు ఎటువంటి పత్రాలు లేకపోవడంతో తదుపరి చర్యల నిమిత్తం తహశీల్దార్‌కు అప్పగించామని చెప్పారు. సీజ్ చేసిన వెండి వస్తువుల విలువ సుమారు రూ.9.30 లక్షలు ఉంటుందని తెలిపారు.

News April 9, 2024

కంచిలి: చెరువులో పడి వ్యక్తి మృతి

image

కంచిలి మండల కేంద్రంలో మటన్ చెరువులో సోమవారం ప్రమాదవశాత్తు మునిగి బుడ్డేపు నీలాద్రి మరణించాడు. మృతుడు, అతని భార్య జానకి కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. బహిర్భూమికి కోసం వెళ్లిన నీలాద్రి చెరువులో ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కంచిలి ఎస్సై జి. రాజేష్ తెలిపారు.

News April 9, 2024

TDP ప్రచారంలో AR కానిస్టేబుల్

image

నెల్లూరు జిల్లాలోని వింజమూరు మండలం చాకలికొండలో టీడీపీ ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేశ్‌కు మద్దతుగా ప్రచారం జరిగింది. ఇందులో ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ పాల్గొన్నారు. ప్రభుత్వం ద్వారా జీతం తీసుకునే ఏ ఒక్కరూ ప్రచారాల్లో పాల్గొన వద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయినప్పటికీ కొందరు ఇలా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. బాలకృష్ణ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గన్‌మెన్‌గా పని చేస్తున్నట్లు సమాచారం.

News April 9, 2024

వారి జీతం ఆపేస్తే అన్ని పంపిణీ చేయవచ్చు: కోటంరెడ్డి

image

గతంలో సంక్రాంతి, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా ఇచ్చేవారని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. సీఎం జగన్ చుట్టూ ఉన్న సలహాదారుల నెల జీతం ఆపేస్తే పేద ప్రజలకు అన్ని కానుకలు పంపిణీ చేయవచ్చన్నారు. సోమవారం సాయంత్రం ఉప్పుటూరు, కందమూరు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

News April 9, 2024

అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపాలి: ఎస్పీ

image

అక్రమ మద్యం, నాటుసారా, గంజాయి వంటి మత్తుపదార్థాలు అమ్మకం వంటి అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సెబ్ అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో నాటు సారా తయారీ, రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నియమావళికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలన్నారు.

News April 9, 2024

పాడేరు ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్

image

పాడేరులోని మాతా శిశు ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలువురు గర్భిణులు, బాలింతలతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవలు, ఆహారం తదితర అంశాలపై ఆరా తీశారు. చీడివలసకు చెందిన ఓ బాలింతకు అది నాలుగో కాన్పు అని తెలుసుకొని, ఆమెకు కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సకు ఒప్పించినట్లు పేర్కొన్నారు.

News April 9, 2024

కలపర్రు టోల్ గేట్ వద్ద పట్టుబడ్డ ఆభరణాల వివరాలు

image

పెదపాడు మండలం కలపర్రు టోల్ గేటు వద్ద సోమవారం పట్టుబడిన నగదు వివరాలను అధికారులు వెల్లడించారు. ఒక వాహనంలో రూ.15,52,300 నగదు మరో వాహనంలో 16.528 కేజీల బంగారు ఆభరణములు, 31.042 కేజీల వెండి ఉందన్నారు. నగదు, ఆభరణాలకు సంబంధించిన యజమానులు సరైన పత్రాలను జిల్లా త్రిసభ్య కమిటీ వారికి సమర్పించాలన్నారు. పరిశీలించిన తర్వాత నగదు, ఆభరణాలు తిరిగి అందజేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.

News April 9, 2024

ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి:కలెక్టర్

image

ఎన్నికల విధుల్లో వైఫల్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ హెచ్చరించారు. సోమవారం మన్యం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయి సంసిద్ధత ఉండాలన్నారు. వచ్చే పది రోజులు కీలకమని, ప్రతి అంశంపై శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై వచ్చే ప్రతి అంశాన్ని పరిశీలించాలన్నారు.

News April 9, 2024

నంద్యాల: వడగాల్పులపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శ్రీనివాసులు సూచించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధి కూలీలు ఎండ తీవ్రత పట్ల జాగ్రత్తగా ఉండేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. ప్రధాన కూడళ్ళలో చలువ పందిళ్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు అత్యవసరమైన ప్రదేశాలలో వైద్య శిబిరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.