Andhra Pradesh

News April 8, 2024

విధుల నిర్వహణలో నిర్లక్ష్యం తగదు:కలెక్టర్

image

విధుల నిర్వహణలో నిర్లక్ష్యం తగదని, ఫిర్యాదు వచ్చిన వెంటనే చర్యలు చేపట్టి 24 గంటల్లో దాని పరిష్కారించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ స్పష్టం చేశారు. సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఆర్ఓలు, ఎఆర్ఓలు, నోడల్ అధికారులతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. అధికారులు, సిబ్బంది ముందస్తు అనుమతులు లేకుండా వారు పని చేస్తున్న కేంద్రాన్ని విడిచి వెళ్లరాదన్నారు.

News April 8, 2024

పార్వతీపురం: ఎన్నికల విధుల్లో వైఫల్యాలకు కఠిన చర్యలు

image

ఎన్నికల విధుల్లో వైఫల్యాలకు కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ హెచ్చరించారు. రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ది అధికారులతో జిల్లా కలెక్టరు కార్యాలయంలో ఎన్నికలపై జిల్లా ఎన్నికల అధికారి శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయి సంసిద్ధత ఉండాలన్నారు.

News April 8, 2024

వైసీపీకి మాజీ MLC శమంతకమణి రాజీనామా

image

శింగనమల నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ పామిడి శమంతకమణి, ఆమె కుమారుడు బలపనూరు అశోక్ వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజీనామా పత్రాన్ని మీడియాకు విడుదల చేశారు. వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడికి రాజీనామా పత్రాన్ని పంపుతున్నట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.

News April 8, 2024

అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు:SP

image

అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పి K.ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోకి ప్రవేశించే అన్ని మార్గాలలో చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి నిరంతరం వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. అక్రమ నగదు, మద్యం, నాటు సారా, గంజాయి మొదలగు ఇతర అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు.

News April 8, 2024

రైతులు బాగుపడాలంటే టీడీపీ గెలవాలి:కొండ్రు

image

రాజాం నియోజకవర్గం సంతకవిటి మండల పరిధిలోని గోళ్లవలస గ్రామంలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సమావేశంలో నియోజకవర్గం కూటమి అభ్యర్థి కొండ్రు మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు ప్రభుత్వం అంటూనే రాష్ట్రంలో జగన్ రైతులను నట్టేట ముంచారన్నారు. పంటలు ఎండిపోవడంతో పాటు పశువులకు తాగునీరు లేని దుస్థితి నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కోళ్ల అప్పలనాయుడు పాల్గొన్నారు.

News April 8, 2024

తూ.గో: ఇప్పటివరకు 672 మంది వాలంటీర్ల రాజీనామా

image

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వాలంటీర్ల రాజీనామాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 672 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. తాజాగా సోమవారం కొత్తపేట మండలం మోడెకూరు గ్రామ సచివాలయం-1, 2కు చెందిన వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. వారి రిజైన్ లెటర్స్‌ని పంచాయతీ కార్యదర్శికి అందజేశారు. 

News April 8, 2024

తోటపల్లి కాలువలో మృతదేహం

image

గరుగుబిల్లి మండలం తోటపల్లి డ్యామ్ ఎడమ కాలువ వద్ద సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహన్ని గుర్తించినట్లు స్థానిక ఎస్ఐ తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 50 నుంచి 55 సంవత్సరాలు ఉంటుందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తి సమాచారం తెలిసిన వారు పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

News April 8, 2024

చిత్తూరు: నిన్న వైసీపీలోకి.. నేడు టీడీపీలోకి

image

గుడిపల్లి : మండల పరిధిలోని గుండ్ల సాగరం పంచాయతీ పరిధిలో ఆదివారం చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ శ్రేణులు 24 గంటలు గడవక ముందే మళ్లీ యూ టర్న్ తీసుకున్నారు. గుండ్ల సాగరం గ్రామానికి చెందిన పది కుటుంబాలు సోమవారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సమక్షంలో సొంత గూటికి చేరారు. కుప్పం నియోజకవర్గంలో ఇలా 24 గంటలు గడవక ముందే నేతలు సొంతగూటికి చేరుతుండడం రాజకీయంగా చర్చనీయంగా మారింది.

News April 8, 2024

ఈ నెల 24న మంత్రి అంబటి నామినేషన్

image

ఈనెల 10న పిడుగురాళ్ల బైపాస్ వద్ద సీఎం జగన్ మేమంతా సిద్ధం బహిరంగ సభ జరుగుతుందని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. సోమవారం కొండమోడులో విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. 12వ తేదీన రాజుపాలెం నుంచి గుంటూరు వైపు సత్తెనపల్లి మీదుగా రోడ్ షో ఉంటుందని తెలిపారు. అలాగే 24న సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థిగా తాను నామినేషన్ దాఖలు చేస్తున్నానని చెప్పారు. 

News April 8, 2024

అనకాపల్లిలో చిన్నారిని ఎత్తుకున్న పవన్ కళ్యాణ్

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనకాపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో ప్రజలను ఆకట్టుకునే విధంగా వ్యవహరించారు. ఓ చిన్నారిని ఎత్తుకున్న సీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే అనకాపల్లి ప్రజల సెంటిమెంట్ అయిన నూకాంబిక అమ్మవారిని తలుచుకుని ప్రసంగాన్ని ప్రారంభించారు. కూటమి అధికారంలోకి వస్తే నూకాంబిక జాతరకు రాష్ట్రస్థాయి గుర్తింపు కల్పిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.