India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఆదివారం జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ.. భావితరాల ఉజ్వల భవిష్యత్తుకు, రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన అధినేత పొత్తు నిర్ణయం తీసుకోవడం చరిత్రాత్మకమైందని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వమన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక చేతితో రూపాయి ఇస్తూ.. మరో చేతితో రూ.10 లాగేసుకుంటున్నారని ఆరోపించారు.
రాయదుర్గం-అనంతపురం జాతీయ రహదారిపై మారెంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి 7.30 గంటలకు చోటు చేసుకుంది. గుమ్మగట్ట మండలం మారెంపల్లికి చెందిన శంకర్ అనే యువకుడు బైక్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు అవ్వడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి మృతదేహాన్ిన రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కొరిసపాడు మండలం పమిడిపాడులో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటు చేసుకున్నట్లు పోలీసుల తెలిపారు. అత్తింటి చిన్న అంజయ్య(50) పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకుల వివరాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
సముద్ర జలాల్లో 61 రోజులపాటు చేపల వేట నిషేధిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ మేరకు జిల్లా మత్స్యశాఖ అధికారి ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. 15 ఏప్రిల్ నుంచి జూన్ 14 వరకు యాంత్రిక పడవలు, మెకనైజ్డ్ మోటర్ బోట్ల ద్వారా చేపల వేటను నిషేధిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కాలంలో చేపల, రొయ్యల జాతుల సంతానోత్పత్తి జరుగుతుందని తెలిపారు. ఎవరైనా చేపలు వేట చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
దైవదర్శనానికి వెళ్లివస్తుండగా రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. కోవెలకుంట్లకు చెందిన రాణిబాయి(22) మండలంలోని భీమునిపాడు స్పెషల్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. అహోబిలేశుడిని దర్శించుకుని తమ్ముడు శ్రీధర్ నాయక్ బైక్‌లో వస్తున్నారు. ఈక్రమంలో చీర కొంగు బైక్ చక్రానికి చుట్టుకోవడంతో కిందపడి అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసినట్లు ఎస్‌ఐ నగీన తెలిపారు.
ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఇందుకూరుపేటకు చెందిన సుబ్బరత్నమ్మ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె భర్త మాట వినకుండా నిత్యం ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తుండేది. ఈక్రమంలో శనివారం కూలి పనికి వెళ్తున్నట్లు భర్తకు చెప్పి తిరిగి రాలేదు. ఆదివారం కోడూరుపాడులోని టెంకాయతోటలో సుబ్బరత్నమ్మ మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర షెడ్యూల్ సోమవారం ఇలా సాగనుంది. ఆదివారం రాత్రి దర్శి మండలంలోని వెంకటాచలంలో బస చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు బస్సు యాత్ర ప్రారంభిస్తారు. భోదనంపాడు, కురిచేడు, చీకటిగలపాలెం, కనమర్లపూడి మీదుగా శావల్యాపురం చేరుకుంటారు. అక్కడే రాత్రికి బస చేస్తారు. వినుకొండలో ఆయన రోడ్ షో నిర్వహిస్తారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పిస్తోందని కలెక్టర్, ఎన్నికల అధికారి డా. జి.సృజన ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కొరకు సర్వీసు ఓటర్లైతే నేరుగా సంబంధిత రిటర్నింగ్ అధికారి జారీ చేస్తారని, దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. స్పెషల్ ఓటర్లైతే కనీసం పోలింగ్ తేదీకి 10 రోజుల ముందు ఫార్మ్-12 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రాలను టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ ఆదివారం పరిశీలించారు. మండలంలోని లింగాలవలస, శెలిగాం, పోలవరం, రాధవల్లభాపురం, గంగధరపేట, రావివలస, ధర్మనీలాపురం, తలగాం, తేలినీలాపురంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎన్నికల సిబ్బంది ఉండేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఓటర్లకు కల్పించే సదుపాయాలను పర్యవేక్షించి పరిశీలించారు.
ఏలూరు జిల్లాలో 16.25 లక్షల ఓటర్లు ఉన్నారని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఓటు హక్కు సద్వినియోగంపై జిల్లా వ్యాప్తంగా ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. మే 13న జరగబోయే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఇందుకోసం వాట్సాప్ నెం 94910 41435 అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. సమస్యలు ఉంటే ఫొటో, వీడియోతో పై నెంబరుకు పంపాలని ప్రజలకు సూచించారు.
Sorry, no posts matched your criteria.