India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆస్పరి మండలం కైరుప్పలలో ఉగాది తర్వాతి రోజు పిడకల సమరం జరుగుతుంది. త్రేతాయుగంలో భద్రకాళి దేవిని ప్రేమించి పెళ్లి చేసుకోకుండా వీరభద్ర స్వామి మోసం చేశారని అమ్మవారి భక్తులు నమ్మి ఆయనను పిడకలతో కొట్టాలని చూస్తారు. వీరభద్రుడిని అమ్మవారి ఆలయం వైపు వెళ్లొద్దని భక్తులు వేడుకున్నా.. అటువైపు వెళ్లడంతో ఆయనపై పిడకలతో దాడిచేశారు. స్వామివారి భక్తులు కూడా పిడకలతో అమ్మవారి భక్తులపై ఎదురుదాడికి దిగారని చెబుతుంటారు.
ప్రజలు ఓట్లేసి గెలిపించింది హత్యలు చేయించడానికా అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పెండ్లిమర్రి మండలం యాదవపురంలో చిన్న సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. సుబ్బరాయుడు కుమారుడు శ్రీనివాస్ యాదవ్ ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. నిందితులంతా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే అనుచరులేనని ఆమె ఆరోపించారు. భూమి కోసం అవినాష్ అనుచరులే హత్య చేశారని ఆరోపించారు. బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెలికాప్టర్‌లో అనకాపల్లి చేరుకున్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అనకాపల్లి పట్టణం నెహ్రు చౌక్ వద్ద ఎన్డీఏ శ్రేణులు బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
తాడేపల్లిగూడెం పట్టణంలోని పెన్షనర్ల అసోసియేషన్ భవనంలో ఆదివారం పెన్షనర్ల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పెన్షనర్లు పడే ఇబ్బందులు తనకు తెలుసని, వాటి పరిష్కారానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తానని అన్నారు.
ఈనెల 9వ తేదీ నుంచి 15 వరకు పాండిచ్చేరిలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగే 38వ యూత్ నేషనల్ బాస్కెట్ బాల్ ఛాంపియన్ షిప్‌లో పాల్గొనే ఏపీ బాలుర జట్టులో ధర్మవరానికి చెందిన విజయ్‌కు చోటు దక్కింది. విజయ్ రాష్ట్ర బాస్కెట్ బాల్ జట్టుకు ఎంపిక కావడం గర్వకారణమని ధర్మాంభ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శెట్టిపి జయచంద్రా రెడ్డి తెలిపారు. పలువురు క్రీడాకారుడికి అభినందనలు తెలిపారు.
గుంటూరు పట్టణంలో ఓ ప్రైవేట్ వైద్యశాలలో నర్సుగా పనిచేస్తున్న బెల్లంకొండ మండలానికి చెందిన యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికుల కథనం మేరకు యువతికి తల్లిదండ్రులు లేరని ప్రైవేట్ వైద్యశాలలో నర్సుగా పనిచేస్తూ జీవనం సాగిస్తుందన్నారు. ఆదివారం యువతి నిస్సహాయ స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
టెక్కలి మండలం అక్కవరం జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం లారీ ఢీకొని ముంజేటి గురయ్య(70) అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. శ్యాంసుందరపురం గ్రామంలోని తన కుమార్తెను చూసి తిరిగి వస్తున్న క్రమంలో అక్కవరం జాతీయ రహదారిపై శ్రీకాకుళం వెళ్తున్న గుర్తుతెలియని ఓ లారీ ఢీకొనడంతో వృద్ధుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటన స్థలాన్ని టెక్కలి పోలీసులు పరిశీలించారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్‌ని వదులుకునే ప్రసక్తే లేదని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి స్పష్టం చేశారు. ఆదివారం గాజువాకలో మాజీ ఎమ్మెల్యే వెంకటరామయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. వైవీ సుబ్బారెడ్డి, గాజువాక అభ్యర్థి గుడివాడ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
బ్లూ షర్ట్ వేసుకున్నానని వైసీపీ, పసుపు కండువా కప్పుకున్నానని టీడీపీ, రోజూ బొట్టు పెట్టుకుంటానని బీజేపీ అనొద్దని, తనకు రాజకీయాలు అంటగట్టొద్దని దివంగత ఆనం వివేకానంద రెడ్డి కుమారుడు ఏసీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. మహానాయకులు , పెద్దనాయకులు చాలా మంది ఉన్నారన్నారు. నెల్లూరు కోటమిట్టలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత పెదపారుపూడిలో నమోదు అయింది. ఆదివారం పెదపారుపూడిలో 43.58 డిగ్రీలు నమోదు అయింది. కంకిపాడులో 41.75 డిగ్రీలు, బాపులపాడులో 41.64 డిగ్రీలు, గుడివాడ మండలం మెరకగూడెంలో 41.51 డిగ్రీలు, పెద్ద అవుటుపల్లిలో 41.42 డిగ్రీలు, నందివాడలో 41.17 డిగ్రీలు, ఉంగుటూరు మండలం నందమూరులో 41.0 డిగ్రీలు నమోదు అయింది. పామర్రులో 40, తేలప్రోలులో 39.75 డిగ్రీలు, పోలుకొండలో 39.5 డిగ్రీలు నమోదైంది.
Sorry, no posts matched your criteria.