Andhra Pradesh

News April 7, 2024

ప్రకాశం: రోడ్డు ప్రమాదంలో ఐదేళ్ల చిన్నారి మృతి

image

కొరిసపాడు మండలంలోని పి.గుడిపాడులోని ఆశ్రమ సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి రైల్వేకోడూరు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనగా, అనంతరం లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదు సంవత్సరాల పాప అక్కడికక్కడే మృతిచెందగా.. మిగిలిన వారికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 7, 2024

హిందూపురం: పోలీసులపై దాడి

image

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని హుస్నాబాద్ సమీపంలోని ఓ వర్గం శ్మశాన వాటిక వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘర్షణ చోటు చేసుకుంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు గొడవకు దిగారు. బందోబస్తుకు వెళ్లిన ఏఎస్ఐ, పలువురు కానిస్టేబుల్ లపై ఆందోళన కారులు దాడులు నిర్వహించారు. దీంతో గాయపడ్డ పోలీసులను ఆసుపత్రికి తరలించారు.

News April 7, 2024

కడప: నేడు షర్మిల బస్సు యాత్ర షెడ్యూల్

image

కడప జిల్లాలో 3వ రోజు APCC చీఫ్& కడప కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ షర్మిల ఏపీ న్యాయ యాత్ర కొనసాగనుంది. ఈరోజు కమలాపురం నియోజకవర్గంలో ఉదయం 10.30 గంటలకు పర్యటన ప్రారంభం కానుందని పార్టీ వర్గాలు తెలిపారు. Ck దిన్నె, ఎల్లటూరు, పెండ్లిమర్రి, నందిమండలం, తంగేడుపల్లి, వీఎన్ పల్లి, కమలాపురం, వల్లూరు, చెన్నూరు మీదుగా న్యాయ యాత్ర జరగనుంది.

News April 7, 2024

కర్నూలు: డిగ్రీ 3, 5 సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను VCసుధీర్ ప్రేమ్కుమార్ ఆదేశాలతో విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వెంకటేశ్వర్లు తెలిపారు. 3 సెమిస్టర్లో రెగ్యులర్ విద్యార్థులు 5,900 మందికిగాను 3,081 మంది, సప్లిమెంటరీ విద్యార్థులు 9,140 మందికి 4,182 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఫలితాలు rayalaseemauniversity.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు.

News April 7, 2024

విజయనగరం: గంజాయితో ముగ్గురు అరెస్ట్

image

ఎస్.కోట మండలంలో బొలేరోలో తరలిస్తున్న 200 కిలోల గంజాయిని శనివారం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వై.మురళీరావు తెలిపారు. పందిరప్పన్న కూడలి వద్ద ఎస్ఐ గంగరాజు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా.. అరకు నుంచి వచ్చిన వాహనంలో గంజాయి బస్తాలను గుర్తించారన్నారు. గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు. ముగ్గురు నిందితులను రిమాండుకు తరలించామని పేర్కొన్నారు.

News April 7, 2024

చాట్రాయి: కోనేటి చెరువులో పడి పశువుల కాపరి మృతి 

image

మర్లపాలెం కోనేటి చెరువులో పడి శనివారం పశువుల కాపరి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. చాట్రాయి మండలం మర్లపాలెం గ్రామానికి చెందిన తానంకి చంటి (55) గేదెలు కాయడానికి వెళ్ళి చెరువులో పడి మృతి చెందాడు. చెరువు వద్ద మృతుడి కాలు చెప్పు కనబడటంతో చాట్రాయి ఎస్సై స్వామి దాని ఆధారంగా జాలర్లను తీసుకువచ్చి వెతికించడంతో మృతదేహం దొరికింది. 

News April 7, 2024

జగ్గంపేట.. ఈ సారి ఎవరికి కంచు కోట..?

image

రాజకీయ ఉద్దండుల కోటగా పేరుగాంచిన జగ్గంపేట నియోజకవర్గంలో ఓటర్లు గత ఆరేళ్లుగా భిన్న తీర్పును ఇస్తున్నారు. 1994 నుంచి జరిగిన అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే.. 1994, 1999లో టీడీపీ, 2004, 2009లో కాంగ్రెస్, 2014, 2019లో వైసీపీకి పట్టం కట్టారు. ఒక్కోపార్టీకి 2 సార్లు అవకాశం ఇస్తూ వచ్చిన జగ్గంపేట ఓటర్లు ఈ ఎన్నికల్లో ఎవరికి అవకాశం ఇస్తారో చూడాలి మరి.
– మీ కామెంట్ ఏంటి..?

News April 7, 2024

విశాఖ: హిందుస్థాన్ షిప్ యార్డ్ టర్నోవర్ రూ. 1,597 కోట్లు

image

హిందుస్థాన్ షిప్ యార్డ్ టర్నోవర్ వరుస ఆర్థిక సంవత్సరాల్లో రూ.478 కోట్ల నుంచి రూ. 1,597 కోట్లకు పెరిగి రికార్డు నెలకొల్పిందని సంస్థ యాజమాన్యం శనివారం తెలియజేసింది. 2020-21 ఆర్థిక ఏడాదిలో రూ.478 కోట్ల టర్నోవర్ ఉన్నప్పటికీ సంస్థ రూ.14 కోట్ల నష్టాల్లో ఉండేది. ఆ తర్వాత 2021-22లో రూ.755 కోట్ల టర్నోవర్కు చేరి రూ.51 కోట్ల లాభం గడించింది. 2022-23లో రూ.1103 కోట్ల టర్నోవర్కు రూ.65 కోట్ల లాభం వచ్చింది.

News April 7, 2024

విశాఖ: వృద్ధురాలిపై అత్యాచారం కేసులో ముగ్గురు అరెస్టు

image

ఓ వృద్ధురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు యువకుల్ని అత్యాచార నేరం కింద ఎంవీపీ స్టేషన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 4న పెదవాల్తేరులో ఓ వృద్ధురాలు ఒంటరిగా ఇంట్లో ఉందని పసిగట్టిన ముగ్గురు యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందింది. ఈ సంఘటనలో యనమరెడ్డి నరేష్ (21), కృష్ణవంశీ (22), బారిక స్వామి(23)పై అత్యాచార నేరం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సి.ఐ. సంజీవరావు తెలిపారు.

News April 7, 2024

విడుదల రజనీ పై ఎన్నికల అధికారికి ఫిర్యాదు

image

గుంటూరు పశ్చిమ వైసీపీ అభ్యర్థి విడుదల రజనీ ఎలక్షన్ కోడ్‌ను ఉల్లంఘించారని ముస్లిం సేనా రాష్ట్ర అధ్యక్షులు షేక్ సుభాని తెలిపారు. ఎన్నికల కోడ్‌కి విరుద్ధంగా మసీదులలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు గుంటూరు పశ్చిమ ఎన్నికల అధికారి రాజ్యలక్ష్మిని షేక్ సుభాని శనివారం కలిసి ఫిర్యాదు చేశారు. రజినీ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.