India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ తన ఓటును విశాఖకు బదిలీ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గతేడాది తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచిన ఆయన ఇప్పుడు ఏపీకి వచ్చారు. నగరంలోని శ్రీకన్య థియేటర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. తన ఓటును విశాఖ ఉత్తర నియోజకవర్గానికి బదిలీ చేయడానికి దరఖాస్తు చేసినా, అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
పాయకరావుపేట మండలంలోని పెద్దరామ భద్రపురం హత్య కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏడాది జనవరి 11న గ్రామంలో తలెత్తిన వివాదంలో గంపల నూకరాజు హత్యకు గురైన విషయం తెలిసిందే. హత్యకు పాల్పడిన వారిలో ఇప్పటికే 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇన్నాళ్లు పరారీలో ఉన్న పాయకరావుపేటకు చెందిన గ్రామ వాలంటీర్ పెద్దాడ గాంధీని శనివారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
విజయవాడలో పోలీసులు రూ.కోటి బంగారం కొట్టేశారనే వార్త అవాస్తవమని పోలీస్ కమిషనర్ కార్యాలయం తెలిపింది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత సత్యనారాయణపురం పరిధిలో, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో నిర్వహించిన తనిఖీలలో ఎటువంటి బంగారం దొరకలేదని అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచురిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో పింఛన్ల పంపిణీ పూర్తయింది. 99% మందికి సచివాలయ సిబ్బంది పింఛన్లను అందజేశారు. విశాఖ జిల్లాలో 1,65,432 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా 1,63,553 మందికి అందజేశారు. అనకాపల్లి జిల్లాలో 2,66,208 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా 2,63,232 మందికి పంపిణీ చేశారు. అల్లూరి జిల్లాలో పింఛన్ లబ్ధిదారులు 1,27,894 మంది కాగా 1,26,573 మందికి పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
రాజాంలోని క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న తెలగవీధి, పుచ్చలవీధికి చెందిన ఇద్దరు వ్యక్తుపై కేసు నమోదు చేసి రూ.18,500 నగదు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు రాజాం టౌన్ సీఐ మోహనరావు శనివారం రాత్రి తెలిపారు. బెట్టింగ్ నిర్వహణకు సంబంధించిన పుస్తకాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. బెట్టింగ్‌కు పాల్పడిన, అసాంఘిక చర్యలు జరిగినా వెంటనే డయల్ 100 సమాచారం ఇవ్వాలన్నారు.
జిల్లాలో మొత్తం 777 అంగన్‌వాడీ సెంటర్లు ఉండగా, వీటిలో 190 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయి. తొలి దశలో 42 కేంద్రాలకు రూ.10 వేలు చొప్పున కూరగాయల మొక్కల పెంపకానికి కేంద్రం నిధులను మంజూరుచేసింది. రెండో విడత మరికొన్ని కేంద్రాలకు విడుదల చేయనుందని అధికారులు చెబుతున్నారు. కేంద్రం పరిధిలో కాయగూరలు పండించనున్నారు. వీటిని అదే కేంద్రాల్లో వంటకు వినియోగించనున్నారు. నిర్వహణ బాధ్యతను పూర్తిగా ఆయాలు చూడాలి.
ప్రముఖ బీసీ నేత, బీసీ సాధికారత రాష్ట్ర కన్వీనర్ చలమోలు అశోక్ గౌడ్ శనివారం టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీలో అవమానాలు, వేధింపులు తట్టుకోలేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అంటే ఆత్మాభిమానం కలిగిన వర్గాలే తప్ప పల్లకీలు మోసే బోయలు కాదని అన్నారు.
శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవాలను ఈనెల 18 నుంచి 24వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్టు దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి తెలిపారు. కల్యాణోత్సవాలను పురస్కరించుకుని విశేషంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈనెల 19న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం, ఎదుర్కోలు ఉత్సవం, రథోత్సవం నిర్వహణ తదితర అంశాలపై చర్చించామని తెలిపారు.
ఆత్మకూరులో విద్యుత్ కంచె వేసి ఎలుగుబంటిని చంపిన నలుగురు వేటగాళ్లను అరెస్ట్ చేసినట్లు ఆత్మకూరు డీఎఫ్ఎ సాయిబాబా తెలిపారు. పట్టణ సమీపంలోని సూర్య గార్డెన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా వేటగాళ్లుగా బయటపడిందన్నారు. వారి నుంచి ఎలుగుబంటి తల, అవయవాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వేటగాళ్లపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు తెలిపారు .
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఈనెల 10వ తేదీ నుంచి జరగాల్సిన పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేశామని సీఈ ఆర్ ప్రకాశరావు తెలిపారు. ఈనెల 22వ తేదీ నుంచి నాలుగో సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. కళాశాలల ప్రిన్సిపల్స్, యాజమాన్యాలు, విద్యార్థులు ఈ మార్పును గమనించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.