India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష వాయిదా పడినట్లు ఐటీడీఏ పీవో విష్ణుచరణ్ తెలిపారు. శనివారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈనెల 13న పరీక్ష జరగాల్సి ఉంది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో సమ్మేటివ్-2 పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈనెల 20కు పరీక్ష వాయిదా వేసినట్లు తెలిపారు.
రాయచోటి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత అర్.రమేశ్ కుమార్ రెడ్డిని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు రమేశ్ రెడ్డిని వైసీపీలోకి చేరడానికి పూర్తి స్థాయి చర్చలు జరిపినట్లు సమాచారం. దీంతో ఆయన కూడా వైసీపీలో చేరడానికి సుముఖత చూపడంతో అతి త్వరలో తేదీన ప్రకటించి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారని పార్టీ వర్గాలు తెలిపారు.
2019 ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో JSP అభ్యర్థి బండ్రెడ్డి రామకృష్ణకు అవనిగడ్డ, పెడనలో 24 వేలకు పైబడి ఓట్లు లభించాయి. నియోజకవర్గాల వారీగా రామకృష్ణకు వచ్చిన ఓట్లలో అవనిగడ్డలో 24,594, పెడనలో 24,134 ఓట్లు రాగా, అత్యల్పంగా పామర్రులో 8,615 ఓట్లు లభించాయి. తాజా ఎన్నికల్లో జనసేన నుంచి బాలశౌరి పోటీ చేస్తుండగా ఈ రెండు నియోజకవర్గాలలో ఎలాంటి ఫలితం వస్తుందోనని జిల్లాలో ఆసక్తి నెలకొంది.
కొమరోలులోని చర్చి వీధిలో నివాసం ఉంటున్న గర్భిణీ ప్రసన్న (30) అనుమానాస్పద స్థితిలో శనివారం సాయంత్రం మృతి చెందింది. ఆమె భర్త నారాయణ కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రసన్న బాత్రూంలో జారిపడి మృతి చెందినట్లుగా భర్త నారాయణ తెలిపాడు. ప్రసన్నను భర్త చంపి ఉంటాడని ఆమె తమ్ముడు సాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మాధవధారలో పాత కక్షల నేపథ్యంలో గురువారం కత్తిపోట్లకు గురైన అంబేడ్కర్ కాలనీకి చెందిన మూగ బాలుడు తేజ (17) రెండు రోజులపాటు కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతికి కారణమైన ఉదయకుమార్, రాజకుమార్, జగదీష్, శివశంకర్, సన్యాసిరావులపై శనివారం ఎయిర్ పోర్టు పోలీసులు హత్య కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు. ఆరో వ్యక్తి మైనర్ కావడంతో జువైనల్ హోంకు తరలించారు.
సౌదీ అరేబియాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుత్తలూరు, గుంటూరుకు చెందిన ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయ. నర్రవాడకు చెందిన సత్యబాబు సౌదీలోని ఓ పారిశ్రామిక సంస్థలో ఇంజినీరుగా పని చేస్తున్నారు. భార్య పిల్లలతో కలిసి అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో అతని మామ గుంటూరుకు చెందిన రామారావు దంపతులు వారి వద్దకు విజిటింగ్ వీసాపై వెళ్లారు. విమానాశ్రయం నుంచి కారులో వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు.
పులిచెర్ల మండలం కల్లూరు అడవి ప్రాంతంలో శనివారం రాత్రి చిరుతపులి సంచరించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కల్లూరు నుంచి కొమ్మిరెడ్డిగారిపల్లెకు కారులో వెళుతున్న స్థానికులు చిరుతపులి రోడ్డు దాటడాన్ని గుర్తించారు. వెంటనే కల్లూరు ఎస్సై రవి ప్రకాష్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. పులి సంచరించిన ప్రాంతానికి చేరుకున్న ఎస్సై పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తూర్పు గోదావరి జిల్లాలో లబ్ధిదారులకు శనివారం నాటికి 98.78 శాతం పెన్షన్లను పంపిణీ చేయడం జరిగిందని కలెక్టర్ మాధవి లత తెలిపారు. ఈ మేరకు ఆమె శనివారం రాత్రి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న మొత్తం 2,43,831 మంది పెన్షన్ దారులకు రూ.72,39,79,500 అందించాల్సి ఉందని ఆమె తెలిపారు. 98.78శాతం పూర్తి కాగా.. మిగిలిన వారికీ వెంటనే అందజేయాలని అధికారులను ఆదేశించారు.
కర్నూల్ అవుట్డోర్ స్టేడియంలో ఈనెల 13న ఉమ్మడి కర్నూలు జిల్లా స్థాయి లేజర్ రన్ ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా మాడ్రన్ పెంటాథలాన్ సంఘం కార్యదర్శి అవినాష్ శెట్టి శనివారం తెలిపారు. జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన క్రీడాకారులు ఈ నెల 20 నుంచి 21 వరకు నెల్లూరు జిల్లా కావలిలో జరగబోయే 8వ రాష్ట్ర స్థాయి పోటీలకు ఉమ్మడి కర్నూలు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు.
అనకాపల్లి జిల్లాలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ రవి సుభాష్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎన్నికల నిర్వహణపై ఎస్పీ మురళీకృష్ణతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల నిర్వహణపై చేస్తున్న ఏర్పాట్లను ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.