India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇటీవలి కాలంలో కొన్ని వార్తా పత్రికలు, న్యూస్ ఛానల్స్‌లో ఐపీఎస్ అధికారులపై వచ్చిన అవాస్తవ కథనాలను ఖండిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారుల సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, విజయవాడ సీపీ కాంతి రానా టాటా అన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనాని కలిసి ఈ ఘటనలపై రవీంద్రబాబు ఐపీఎస్‌తో కలిసి ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో ఈ ఘటనలు జరగకుండా నియంత్రించాలని కాంతి రానా టాటా కోరారు.
దమ్మపేట మండలం మందలపల్లిలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం, చీమలపాడు గ్రామానికి చెందిన చీపు లక్ష్మి(32), ఇద్దరు కూతుళ్లు శరణ్య(8), శాన్విక(6) అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో భర్త రామకృష్ణ(35)కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వేగంగా విస్తరిస్తున్న సైబర్ క్రైమ్‌కు సాంకేతికతను వినియోగించి అడ్డుకట్ట వేయాలని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ సూచించారు. సైబర్ క్రైమ్ నియంత్రించేందుకు అత్యాధునిక సాంకేతికత వినియోగంపై విశాఖలో నిర్వహిస్తున్న రెండు రోజుల వర్క్ షాప్‌ను కమిషనర్ శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 90 మంది సిబ్బందిని వర్క్ షాప్‌కు ఎంపిక చేశామన్నారు.
తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది డిసెంబర్ నెలలో ఎంటెక్ రెండో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఫలితాలు శనివారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in, www.schools9.com ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎర్నాకుళం- బ్రహ్మపుర్- ఎర్నాకుళం (ట్రైన్ నంబర్స్ 06087/06088) రైలుకు కొత్తవలసలో హాల్ట్ ఇచ్చారు. ఈ రైలు ఎర్నాకుళంలో ప్రతి శనివారం రాత్రి 11 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస మీదుగా బ్రహ్మపుర్ చేరుతుంది. తిరిగి బ్రహ్మపుర్‌లో సోమవారం మధ్యాహ్నం 12.40 గంటలకు బయలుదేరి కొత్తవలస, దువ్వాడ, గూడూరు, నెల్లూరు మీదుగా ఎర్నాకుళం చేరుతుంది.
ప్రకాశం జిల్లాలో రేపు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటన వివరాలను అధికారులకు సీఎం సమాచారం అందజేసింది. రేపు ఉదయం 9గంటలకు కనిగిరి నియోజకవర్గంలో మొదలయ్యే సీఎం జగన్ పర్యటన చిన్నారికట్ల మీదుగా కొనకనమిట్ల చేరుకొంటుంది. అక్కడ జరిగే పబ్లిక్ మీటింగ్ లో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతరం రాత్రికి దర్శి నియోజకవర్గానికి చేరుకొని అక్కడ సీఎం బస చేయనున్నట్లుగా పేర్కొన్నారు.
కృష్ణా జిల్లాలో 6,7,8 క్లైమ్ ఫారాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 3,078 దరఖాస్తులు పరిష్కరిస్తామని కలెక్టర్ DK బాలాజీ తెలిపారు. శనివారం మచిలీపట్నం కలెక్టరేట్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో బాలాజీతో పాటు జిల్లాలోని ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలుపై క్షేత్ర స్థాయి అధికారులకు ఆదేశాలిచ్చామని ఉన్నతాధికారులకు కలెక్టర్ చెప్పారు.
కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన మందస మండలం చిక్కిడిగాం గ్రామంలో చోటుచేసుకుంది. భర్త కృష్ణ జీడి తోటకు వెళ్లి పనులు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి, కడుపు నొప్పి తీవ్రంగా ఉందంటూ భార్య సంగీత చెప్పింది. ఏమైందని కృష్ణ అడగగా కడుపునొప్పి తాళలేక గన్నేరు పప్పు తాగానని తెలపడంతో వైద్యం నిమిత్తం టెక్కలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించింది.
రోలుగుంట మండలం పెదపేట గంగాలమ్మ దేవాలయం సమీపంలో రోలుగుంట రావికమతం పోలీస్ సిబ్బంది దాడులు నిర్వహించి 590 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. గంజాయిని రవాణాకు సిద్ధం చేసినట్లు అందిన సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు. గంజాయి రవాణాలో ప్రమేయం ఉన్న నిందితులు ముగ్గురిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. గంజాయి విలువ రూ.30.40 లక్షలు ఉంటుందన్నారు.
మండలంలోని అనుపులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మత్యకారుడు మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయపురిసౌత్‌లోని డౌన్ మార్కెట్‌కు చెందిన బొందు తాతారావు(50) అనుపు వద్ద కృష్ణా నదిలో చేపలను పడుతుండగా.. ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని నదిలో కొట్టుకుపోయాడు. మృతుడి కుటుంబ సభ్యులు గాలించగా తాతారావు అనుపు వద్ద కృష్ణా జలాశయంలో శవమై తేలియాడుతూ కనిపించాడు.
Sorry, no posts matched your criteria.