Andhra Pradesh

News April 6, 2024

పార్వతీపురం జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల తనిఖీలు

image

జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికలు పటిష్ఠంగా జరిపేందుకు చర్యలు చేపట్టామన్నారు. నాలుగు నియోజకవర్గాలలో 48 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 36 స్టాటిక్ సర్వేలియన్స్ బృందాలు, 16 వీడియో సర్వేలియన్, 4 వీడియో వ్యూయింగ్ బృందాలు ఏర్పాటు చేశామన్నారు.

News April 6, 2024

కృష్ణా: చంద్రబాబు రేపటి పర్యటన షెడ్యూల్ వివరాలు

image

టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 4.30 వరకు పామర్రు ఎన్టీఆర్ సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు టీడీపీ శ్రేణులు తెలిపారు. సభ అనంతరం చంద్రబాబు రోడ్డు మార్గాన ఉయ్యూరు మార్కెట్ సెంటర్ చేరుకొని సాయంత్రం 6 నుంచి 7.30 వరకు బహిరంగ సభ నిర్వహిస్తారని చెప్పారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు చంద్రబాబు రేపటి పర్యటనల షెడ్యూల్ విడుదల చేశాయి. 

News April 6, 2024

వైసీపీలో చేరిన శెట్టిబత్తుల రాజాబాబు

image

3 రోజుల కింద జనసేనకు రాజీనామా చేసిన అమలాపురం ఇన్‌ఛార్జి శెట్టిబత్తుల రాజాబాబు వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో అమలాపురం నుంచి పోటీ చేసిన రాజాబాబు 45వేలకు పైగా ఓట్లు సాధించారు. ఈసారి పొత్తులో భాగంగా టికెట్ TDPకి ఇవ్వడంతో అసంతృప్తికి లోనయ్యారు. చివరకు ఈ రోజున వైసీపీ గూటికి చేరారు.

News April 6, 2024

ప్రకాశం: ఈతకు వెళ్లి ఇద్దరి యువకులు మృతి

image

దొనకొండ మండలంలోని ఇండ్లచెరువులో శనివారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మన్నెం వెంకటేశ్వర్లు, పత్తి వెంకటేశ్వర్లు అనే ఇద్దరు యువకులు మల్లెల వాగు వద్ద భారీగా తీసిన నీటి గుంతలో ఈతకు వెళ్లి మృతి చెందారు. ఓకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అకస్మాత్తుగా మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు చేపట్టారు.

News April 6, 2024

మహిళా కోటాలో గుండ లక్ష్మీదేవికి కేటాయించాలి:మాజీ మంత్రి

image

నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా మహిళా కోటాలో గుండ లక్ష్మీదేవికి కేటాయించాలని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ పార్టీ అధినేత చంద్రబాబును కోరారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కష్టకాలంలో ఇన్‌ఛార్జ్‌గా విజయవంతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన లక్ష్మీదేవికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తికి యువత పేరుతో టికెట్ కేటాయించడం సబబు కాదని ఆయన అన్నారు.

News April 6, 2024

జనసేనను మూసేసి త్యాగం చేయండి: ముద్రగడ

image

పవన్ ఇప్పుడు పోటీ చేస్తున్న 20 సీట్లు త్యాగం చేసి జనసేన పార్టీని మూసివేయండి అని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. శనివారం తణుకులో ఆయన మాట్లాడారు. 2024లో జనసేనను మూసివేసే దిశగా ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ముందుగానే పార్టీని మూసివేసి త్యాగమూర్తిగా చరిత్రలో నిలిచిపోవాలని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ముద్రగడ మాట్లాడారు.

News April 6, 2024

కృష్ణా: ఫార్మసీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

కృష్ణా వర్సిటీ పరిధిలో బీ-ఫార్మసీ విద్యార్థులు రాయాల్సిన 1,8వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 24 నుంచి మే 2వ తేదీ వరకూ నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా టైం టేబుల్, పరీక్ష కేంద్రాల పూర్తి వివరాలకు విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

News April 6, 2024

20 సీట్లతో ఎలా సీఎం అయిపోతారు: ముద్రగడ

image

పవన్ 20 సీట్లతో ముఖ్యమంత్రి ఎలా అయిపోతారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. శనివారం తణుకులో వైసీపీ కాపు నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి అధికారంలోకి వస్తే పథకాలన్నీ పక్కాగా అమలు చేస్తామని చెబుతున్న చంద్రబాబునాయుడు.. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదా ..?అని అడిగారు.

News April 6, 2024

గజపతినగరంలో అతనొక్కడే ఏకగ్రీవం

image

గజపతినగరం నియోజకవర్గంలో ఏకగ్రీవంగా గెలిచిన ఒకే ఒక్కరు పెనుమత్స సాంబశివరాజు. ఈయన గజపతినగరం నుంచి 1967లో ఇండిపెండెంట్‌గా గెలిచి తొలిసారి అసెంబ్లీకి వెళ్లారు. 1972లో ఆయనకి ప్రత్యర్థి లేకపోవడంతో విజయం ఏకగ్రీవం అయ్యింది. 1978 నుంచి 2004 వరకు అప్పటి సతివాడ నియోజకవర్గం నుంచి 7సార్లు పోటీ చేయగా.. 1994 మినహా మిగిలిన 6 సార్లు విజయం సాధించారు. ఈయన వారసుడు సురేశ్ ఇప్పడు వైసీపీ నుంచి MLCగా కొనసాగుతున్నారు.

News April 6, 2024

కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా జంగాల

image

సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్‌ను ఇండియా కూటమి బలపరిచిన గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా ప్రతిపాదించినట్లు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా నాయకులు, కార్యకర్తలు ఆయనను ఘనంగా సత్కరించారు. కంకి కొడవలి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.