India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అద్దంకి మండలంలోని ధేనువకొండ గ్రామానికి చెందిన 17 మంది వాలంటీర్లు శనివారం స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. అనంతరం అద్దంకి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చిన్న హనిమిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. స్వచ్ఛందంగా ప్రజా సేవలు చేస్తుంటే తమపై రాజకీయ బురదజల్లడంతో మనస్తాపం చెంది రాజీనామా చేసే వాలంటీర్లు పేర్కొన్నారు.
పవన్ 20 సీట్లతో ముఖ్యమంత్రి ఎలా అయిపోతారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. శనివారం తణుకులో వైసీపీ కాపు నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి అధికారంలోకి వస్తే పథకాలన్నీ పక్కాగా అమలు చేస్తామని చెబుతున్న చంద్రబాబునాయుడు.. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదా ..?అని అడిగారు.
కాకినాడ జిల్లా ఏలేశ్వరానికి చెందిన ప్రేమ జంట సూసైడ్ చేసుకుంది. ఏలేశ్వరం వాసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని పెద్దవీధికి చెందిన అశోక్(25), మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) ప్రేమించుకున్నారు. పెద్దలు అంగీకరించరనే భయంతో శుక్రవారం నర్సీపట్నంలో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అపస్మారస్థితిలో పడి ఉండగా.. కాకినాడకు తరలించి వైద్యం అందిస్తుండగా వారిద్దరూ మృతి చెందారు. దీంతో విషాదం నెలకొంది.
ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో జారీ కానున్న నేపథ్యంలో ఎన్నికల ముందస్తు ఏర్పాట్లును సాధ్యమైన త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. BZA నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన జిల్లా కలెక్టర్ పర్చువల్‌గా హాజరయ్యారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్ఠంగా అమలు పర్చాలన్నారు .
నందవరం మండలం కొత్త నదికైరవాడిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కాశి అనే రైతు గుడిసె దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న రూ.5 లక్షల ఆస్తినష్టం జరిగింది. శనివారం మధ్యాహ్నం కాశీ భార్య ఈరమ్మ, పిల్లలు ఇంట్లో ఉండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇరుగు పొరుగు వారి సహకారంతో మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో రూ.20 వేల నగదు, ఫ్రిజ్, సామగ్రి మంటల్లో కాలిపోయిందని బాధితులు తెలిపారు.
చౌడేపల్లి మండలం చారాల గ్రామం, పరికిదోన సచివాలయ పరిధిలో సుమారు 30 మంది వాలంటీర్లు చౌడేపల్లి ఎంపీడీవోకి రాజీనామాలు సమర్పించారు. వాలంటీర్లు మాట్లాడుతూ.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్, చంద్రబాబు, పవన్, బీజేపీ నీచ రాజకీయాలకు మేము మనస్తాపం చెంది రాజీనామాలు సమర్పించామని తెలియజేశారు. సీఎం జగన్ గెలుపుకోసం పనిచేస్తామన్నారు.
కాపుల వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం తణుకులోని కమ్మ కళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన వైసీపీ కాపు నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి తనకు జడ్పీ ఛైర్మన్‌గా అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు తన కుమారుడికి ఎంపీ సీటు ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డిని జీవితంలో మర్చిపోలేనని అన్నారు.
ఎచ్చెర్ల మండలం చిన్నరావుపల్లి గ్రామంలో కరెంట్ బిల్లు చూసి బాధితులు శనివారం కంగుతిన్నారు. పప్పల ముకుందరావు అనే వారి ఇంటి కరెంట్ బిల్లు రూ.1,22,206 వచ్చింది. చిన్న ఇంటిలో భార్యాభర్తలు ఇద్దరే ఉంటున్నారు. వారికి ఇంత కరెంట్ బిల్లు రావడంతో మేము ఎలా కట్టేది అని ఇంటి యజమాని లబోదిబోమంటున్నారు. వారి ఇద్దరు పిల్లలు బతుకుదెరువు కోసం వేరే ఊరిలో ఉంటున్నారు. సంబంధిత అధికారుల తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
నెల్లూరు పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని శనివారం జబర్దస్త్ ఫేమ్ రియాజ్ కలిశారు. పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన వైఎస్ జగన్‌ను కలిశారు. కాగా రియాజ్ వైసీపీ దివ్యాంగుల నగర కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. రియాజ్ మాట్లాడుతూ.. సీఎం జగన్‌ని కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
గుంటూరు నగర శివారు జాతీయ రహదారి అంకిరెడ్డిపాలెం సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ చేరెడ్డి జగన్మోహనరావు (61) మృతి చెందాడు. జాతీయ రహదారి పక్కన పూల బస్తాలను తరలించే క్రమంలో ఇతను ఆటోదిగి ఫోన్ మాట్లాడుతున్నాడు. అదే సమయంలో చిలకలూరిపేట నుంచి గుంటూరు వైపు వస్తున్న కంటైనర్ అదుపుతప్పి అతణ్ని ఢీకొంది. ఈ ఘటనలో జగన్మోహనరావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై ఏడుకొండలు కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.