Andhra Pradesh

News April 6, 2024

రణస్థలం: 48 మంది వాలంటీర్లు రాజీనామా

image

రణస్థలం మండలం జే.ఆర్.పురం 1, 2 గ్రామ సచివాలయాల పరిధిలోని 48 మంది గ్రామ వాలంటీర్లు ప్రతిపక్ష పార్టీల ఆరోపణలకు వ్యతిరేకంగా శనివారం స్వచ్చందంగా రాజీనామా చేశారు. ఈ సందర్బంగా వాలంటీర్లు మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి అమలు చేసి అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా వివరిస్తూ, రానున్న ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.

News April 6, 2024

మచిలీపట్నం: 15 నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం

image

మచిలీపట్నం సముద్రంలో ఈ నెల 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు చేపల వేటను నిషేధిస్తూ జిల్లా మత్స్యశాఖకు శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. యాంత్రిక పడవలు, మెకనైజ్డ్ , మోటార్ బోట్లు ద్వారా జరిగే అన్ని రకాల చేపల వేటకు 61 రోజుల పాటు నిషేధించామని తెలిపారు. సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యలను సంరక్షించడం ద్వారా మత్స్యసంపద పెరుగుతోందని తెలిపారు.

News April 6, 2024

పశ్చిమ ప్రకాశంలో తాండవం చేస్తున్న నీటి కొరత

image

వేసవి కాలం ఆరంభంలోనే పశ్చిమ ప్రకాశంలో నీటి కొరత తాండవం చేస్తోంది. యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం తదితర 8 మండలాల పరిధిలో నీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నాయి. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని అధికారులు భావించినప్పటికీ సాధ్యపడలేదు. ఆయా గ్రామాల్లోని ప్రజలు ఆందోళనలతో ప్రభుత్వం రోజుకు మనిషికి 40 లీటర్ల నీటిని సరఫరా చేస్తోంది. వీటిని 70 లీటర్లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

News April 6, 2024

అనంతలో అమాంతం పెరిగిన టమాటా ధరలు

image

అనంతపురంలో టమాటా ధర కొండెక్కింది. కిలో ధర రూ.50కు చేరింది. నెలలుగా కిలో రూ.20లు దాటని ధర అమాంతం పెరిగింది. టమాటా సాగు చేస్తున్న రైతులు, టోకు వ్యాపారులను పెరిగిన టమాటా ధర ఆనందం కల్గిస్తుంటే.. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News April 6, 2024

మదనపల్లె: ఈనెల 17వరకు ఓటు నమోదుకు అవకాశం

image

18 ఏళ్ళు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకునేలా అధికారులు, నాయకులు కృషి చేయాలని మదనపల్లె ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ హరిప్రసాద్ ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం రాజకీయ నాయకులు, అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ.. ఈనెల17 వరకు 18 ఏళ్ళు నిండిన యువతీ, యువకులు కొత్త ఓటరుగా నమోదు చేసుకునేలా చైతన్యం కల్పించాలని సూచించారు.

News April 6, 2024

బద్వేల్‌లో అత్యధిక మెజారిటీ భార్యా భర్తలదే..

image

బద్వేల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 18 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019లో వైసీపీ తరఫున దివంగత జి.వెంకటసుబ్బయ్య 44734 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆయన మరణాంతరం జరిగిన ఉప ఎన్నికల్లో దాసరి సుధ 90 వేల ఓట్ల పైచిలుకు మెజారిటితో గెలిచారు. ఇప్పటి వరకు ఇదే అత్యధిక మెజారిటీ. తాజాగా వైసీపీ నుంచి దాసరి సుధ, కూటమి నుంచి బొజ్జ రోషన్న బరిలో ఉన్నారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో మీ అభిప్రాయం చెప్పండి.

News April 6, 2024

నరసాపురం ముఖ్యనేతలతో చంద్రబాబు MEETING

image

ప్రజాగళం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం పాలకొల్లులోని S.కన్వెన్షన్‌లో నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 30 మందిని మాత్రమే సమావేశానికి అనుమతించారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు తదితరులు పాల్గొన్నారు.

News April 6, 2024

చీపురుపల్లిలో కాపులదే కీలక పాత్ర

image

చీపురుపల్లి నియోజకవర్గంలోని రాజకీయాలపై కాపు సామాజిక వర్గం పాత్ర కీలకం. దీనికి గల కారణం నియోజకవర్గంలోని మొత్తం ఓటర్ల సంఖ్యలో 80 శాతం ఈ సామాజిక వర్గానికి చెందిన వారు ఉండటమే. ఈ సమీకరణాలతో రెండు ప్రధాన పార్టీలు ఆ సామాజిక వర్గానికి చెందిన వారినే పోటీలో నిలిపాయి. YCP నుంచి బొత్స పోటీ చేస్తుండగా, TDP నుంచి కళా బరిలో నిలిచారు. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఈ వర్గం ఎవరివైపు మొగ్గుచూపుతుందనే ఉత్కంఠ నెలకొంది.

News April 6, 2024

నేటి నుంచి శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనం రద్దు

image

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల క్షేత్రంలో నేటి శనివారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. అందరికీ స్వామివారి దర్శనం కల్పించాలని ఉద్దేశంతో మల్లన్న స్పర్శ దర్శనాన్ని నేటి నుంచి ఉగాది ఉత్సవాలు ముగిసే వరకు రద్దు చేస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. అందరికీ అలంకార దర్శనమేనని తెలిపారు. కాగా శుక్రవారం వరకు భక్తులందరికీ స్వామివారి స్పర్శ దర్శనాన్ని కల్పించారు.

News April 6, 2024

పర్చూరు నియోజకవర్గ తొలి మహిళా ఎమ్మెల్యే లక్ష్మీపద్మావతి

image

పర్చూరు నియోజకవర్గంలో 1999 సాధారణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు జాగర్లమూడి లక్ష్మీ పద్మావతి టీడీపీ తరపున పోటీచేసి విజయం సాధించారు. దీంతో ఆమె పర్చూరు నియోజకవర్గంలో తొలి మహిళా ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. దీంతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తొలి మహిళా మంత్రిగా మరో గుర్తింపు పొందారు.