India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జగన్ సీఎం అయ్యాక ఈనెల 8న తొలిసారి గురజాల నియోజకవర్గానికి వస్తుండటంతో వైసీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మేమంతా సిద్ధం సభకు పిడుగురాళ్ల సమీపంలో హైవే వద్ద సభా స్థలాన్ని సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పరిశీలించారు. 2019 ఎన్నికల తర్వాత తొలిసారి వస్తున్న సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులు సమాయాత్తం అవుతున్నాయి.
జిల్లాలో 917 గ్రామ పంచాయతీలకు 2023-24 సంవత్సరంలో 11 నెలల కాలానికి గానూ జిల్లాలో వీధిదీపాలు, రక్షిత నీటి పథకాలకు సంబంధించి రూ.12 కోట్లు విద్యుత్ బకాయిలు ఉన్నాయి. వాటిని తక్షణమే జమ చేయాలని పంచాయతీరాజ్ కమిషనర్ మొదలుకొని జిల్లాస్థాయిలో డీపీవో, సీఈవో, ట్రాన్స్‌కో ఎస్‌ఈ తదితర శాఖల ఉన్నతాధికారులు డిమాండ్ చేశారు.
కాచిగూడ-తిరుపతి (07655/ 07654)ప్రత్యేక రైలును కడప మీదుగా నడవనున్నట్లు కడప రైల్వే చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ ఉమర్ బాషా, సీనియర్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. ఈనెల 11, 18, 25, మే 1వ తేదీల్లో కాచిగూడ నుంచి తిరుపతికి ఈ రైలు నడుస్తుందన్నారు. అలాగే ఈనెల 12, 19, 26, మే 2వ తేదీల్లో తిరుపతి నుంచి కాచిగూడకు వెళుతుందన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నరసాపురం, పాలకొల్లులో TDP అధినేత చంద్రబాబు పర్యటనతో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం నెలకొంది. ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ.. పార్టీ నాయకుల్లో జోష్ నింపుతూ ప్రసంగం సాగించారు. నరసాపురం MLA ముదునూరి ప్రసాదరాజు మహాముదురు, ఇసుక అక్రమరవాణా ద్వారా రూ.30 కోట్లు దోచేశారని ఆరోపించారు. పార్టీ శ్రేణులు నరసాపూర్ ఎక్స్‌ప్రెస్‌లా దూసుకుపోవాలని పిలుపునిచ్చారు. బాబు పర్యటన TDP విజయానికి తోడ్పడుతోందా.
– మీ కామెంట్..?
సైబర్ నేరగాళ్లు రూ.18 లక్షలు కాజేశారు. పెనమలూరు మండలం కానూరుకు చెందిన శ్రీనివాసరావు బీమా కంపెనీలో పని చేస్తుంటాడు. జనవరిలో ఆయనకు వాట్సాప్‌లో గూగూల్ మ్యాప్ రేటింగ్, రివ్యూస్ చేస్తే సొమ్ము ఇస్తామని మెసేజ్ వచ్చింది. తొలుత ఆయనకు కొంతమేర ఆదాయం చూపి, వ్యాపార లావాదేవీల పేరుతో నేరగాళ్లు రూ.18 లక్షలు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయించారు. చివరకు మోసపోయానని గుర్తించిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఒత్తిళ్లు లేదా ఇతర కారణాల వలన చాలామంది వాలంటీర్లు రాజీనామాలు చేసి వైసీపీ ప్రచారంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా గురువారం నాటికి 67మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు సమాచారం. వీరిలో గురువారమే కోట మండలంలో 24మంది, ఏర్పేడులో ఐదుగురు, పుత్తూరులో ఇద్దరు, తిరుపతిలో మరో 31 మందితో పాటు ఇంతా పలు చోట్ల వాలంటీర్లు రాజీనామా చేసినట్లు అధికారులు తెలిపారు.
భీమిలి టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈనెల మూడవ తేదీన భీమిలి నియోజకవర్గం ఈశాన్య ప్రాంతం అన్నవరం నుంచి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. అయితే అమావాస్య సెంటిమెంట్‌తో ప్రచారం ప్రారంభాన్ని ఈనెల 10వ తేదీకి వాయిదా వేశారు. కాగా నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
పర్చూరు మండల పరిధిలోని నాగుల పాలెంకు చెందిన కొల్లా రామయ్య 19 ఏళ్ల ప్రాయంలో భారత జాతీయ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి కమ్యూనిస్టు యోధుడు కొల్లా వెంకయ్యను ఓడించారు. కమ్యూనిస్టు ప్రభావం ఉన్న తరుణంలో అంతటి ఉద్దండుని ఓడించిన కొల్లా రామయ్య దేశ రాజకీయాల్లో సంచలనంగా మారారు. అప్పటి ప్రధానిగా ఉన్న నెహ్రూ కొల్లా రామయ్యను ప్రత్యేకంగా అభినందించారు.
ఉరవకొండ పట్టణంలోని మల్లేశ్వర ఆలయ సమీపంలో నివసిస్తున్న దునోజ్ కుమార్(18) మూడు రోజుల కిందట వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికంగా ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఉన్న ఒక కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు మల్లికార్జున, రేణుకమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఉండి నియోజకవర్గానికి 1952 నుంచి ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. కాగా 1970లో జరిగిన ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన కె.ఆండాళమ్మ విజయం సాధించింది. నియోజకవర్గ చరిత్రలో ఆమె ఒక్కరే మహిళా MLAగా గెలిచి రికార్డు సొంతం చేసుకున్నారు. మరో విశేషం ఏంటంటే ఆమె ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలవగా ప్రత్యర్థిగా ఉన్న జి.ఎస్.రాజు సైతం ఇండిపెండెంట్‌గా ఉండటం విశేషం.
Sorry, no posts matched your criteria.