Andhra Pradesh

News April 6, 2024

పవన్ కళ్యాణ్ ఉగాది వేడుకలు పిఠాపురంలోనే

image

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ 2వ విడత పర్యటన ఖరారైంది. 7వ తేదీన అనకాపల్లి, 8వ తేదీన యలమంచిలిలో పర్యటించి అక్కడ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. అనంతరం 9వ తేదీన పిఠాపురం నియోజకవర్గంలో జరిగే ఉగాది వేడుకల్లో పాల్గొంటారు. 9వ తేదీ అనంతరం షెడ్యూల్‌ను తర్వాత విడుదల చేస్తామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

News April 6, 2024

చెన్నై – భువనేశ్వర్ మధ్య ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చెన్నై-భువనేశ్వర్ మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం తెలిపారు. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-భువనేశ్వర్(06073) మే 6, 13, 20, 27 తేదీల్లో అర్ధరాత్రి 11.45 గంటలకు చెన్నైలో బయలుదేరి తరువాత రోజు ఉదయం 11.15 గంటలకు దువ్వాడ వచ్చి.. వెళుతుందన్నారు. భువనేశ్వర్-చెన్నై సెంట్రల్ (06074) మే 7, 14, 21, 28, జూన్ 4 తేదీల్లో రాత్రి 9కి భువనేశ్వర్‌లో బయలుదేరుతుందన్నారు.

News April 6, 2024

కర్నూలు: ఆ ఎమ్మెల్యే అభ్యర్థి హ్యాట్రిక్ కొడతారా..?

image

ఆదోని నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు గెలిచి హ్యట్రిక్ కొట్టిన ఎమ్మెల్యే అభ్యర్థి లేరు. హెచ్. సత్యనారయణ, రాయచోటి రామయ్య, మీనాక్షి నాయుడులు వరుసగా రెండుసార్లు గెలిచి హ్యాట్రిక్ మిస్స్ అయ్యారు. 2014, 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వై.సాయి ప్రసాద్ రెడ్డి ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొడతారా కామెంట్ చేయండి.

News April 6, 2024

VZM: చికిత్స పొందుతూ యువకుడి మృతి

image

విజయనగరంలోని కేఎల్ పురం సమీపంలో గతనెల 29న ఓ కారు అదుపు తప్పి గోడను ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కేఎల్ పురం ప్రాంతానికి చెందిన శ్రవణ్ కుమార్(33) పనిమీద కారులో వెళ్తుండగా, వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న గోడను ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి, ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు.

News April 6, 2024

విశాఖ: మద్యానికి బానిసైన వ్యక్తి ఆత్మహత్య

image

మహారాణి పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సాలిపేటలోని పాడుబడిన భవనంలో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగ శ్రీనివాస్ జగదాంబ జంక్షన్ వద్ద గల ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిస కావడంతో భార్య లావణ్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 6, 2024

నెల్లూరు జిల్లాలో నేడు సీఎం జగన్ బస్సు యాత్ర

image

నెల్లూరు జిల్లాలో నేడు సీఎం జగన్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న బస్సు యాత్ర కోవూరు క్రాస్ రోడ్, సున్నపుబట్టి,తిప్ప, గౌరవరం మీదుగా ఆరేస్సార్ ఇంటర్నేషనల్ వద్దకు చేరుకొని కొద్దిసేపు భోజన విరామం ఉంటుంది. అనంతరం కావలి పరిధిలోని జాతీయ రహదారి వద్దకు చేరుకొని మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.

News April 6, 2024

వి.కోట: ఇంటి వద్దే గంజాయి సాగు

image

వి.కోట మండలం చింతమాకులపల్లె పంచాయతీ పసలమందలో గంజాయి సాగు చేస్తున్న సంపత్‌(45)ను ఎస్‌ఈబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడు ఇంటి వద్దే గంజాయి మొక్కలను సాగు చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న సీఐ లింగప్ప ఘటనాస్థలానికి చేరుకున్నారు. నిందితుడి ఇంటి వద్ద గంజాయి సాగును నిర్ధారించుకుని ఎస్‌ఈబీ వారికి సమాచారాన్ని తెలియజేశారు. దీంతో వారు నిందితుడిని అదుపులోకి తీసుకుని మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.

News April 6, 2024

పుట్టపర్తి : నేటి నుంచి సమ్మెటివ్-2 పరీక్షలు

image

జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో సమ్మెటివ్-2 పరీక్షలు నేటి నుంచి ప్రారంభమవుతాయని డీఈఓ మీనాక్షి తెలిపారు. 1 నుంచి 9వ తరగతులకు – ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయన్నారు. 6 నుంచి 19వ తేదీ వరకు పరీక్షలు ఉంటాయన్నారు. ఎంఈఓలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని డీఈఓ ఆదేశించారు.

News April 6, 2024

ప్రకాశం: మహిళపై గడ్డపారతో దాడి.. ఏడాది జైలు శిక్ష

image

ప్రహరీ వివాదంలో మహిళపై గడ్డపారతో దాడిచేసిన వ్యక్తికి న్యాయస్థానం ఏడాది పాటు జైలు శిక్ష రూ.200 జరిమానా విధించింది. గిద్దలూరు మండలం అంబవరం గ్రామంలో నరేంద్ర తన స్థలంలో ప్రహరీ నిర్మిస్తుండగా వెంకటసుబ్బయ్య గడ్డపారతో దాడి చేశాడు. పక్కనే ఉన్న నరేంద్ర భార్య రమణమ్మ తలకు తగిలి గాయమైంది‌. ఈ ఘటనపై గిద్దలూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. విచారణ అనంతరం జడ్జి మేరీ నిందితునికి ఏడాదిపాటు పాటు శిక్ష విధించారు.

News April 6, 2024

నంద్యాల: తల్లి మందలించిందని బాలిక ఆత్మహత్య

image

తల్లి మందలించిందని బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. నంద్యాల పట్టణం బైటిపేటకు చెందిన సుధారాణి, నరసింహులు పెద్ద కూతురు దివ్య ఇంట్లో చదువుకోకుండా స్నేహితులతో ఆడుకుంటోందని తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన దివ్య ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.