Andhra Pradesh

News April 6, 2024

వస్తువుల విడుదలకు సులభతరం: కడప కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో స్వాధీనం చేసుకున్న నగదు, వస్తువులను సులభంగా విడుదల చేసేందుకు జిల్లా స్థాయి అధికారులైన ముగ్గురు సభ్యులతో కూడిన సీజర్స్ పరిష్కార కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని కడప కలెక్టర్ విజయ్ రామరాజు ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ లోని వీసీ హాలులో ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు సీజర్స్ పరిష్కార కమిటీ సభ్యులు హాజరవుతారని, విచారించి త్వరితగతిన నగదు, వస్తువులు అప్పగిస్తారన్నారు.

News April 6, 2024

యువ ఓటర్ల చైతన్యం కోసం షార్ట్ ఫిలిం పోటీలు: కలెక్టర్ ప్రవీణ్ కుమార్

image

జిల్లాలో యువ ఓటర్లను చైతన్యం చేసేందుకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. వీడియో నిడివి గరిష్టంగా 100 సెకన్లు మించరాదని చెప్పారు. ఓటు విలువ తెలియజేసేలా, నిజాయితీగా ఓటు వేయడంపై జిల్లాలో ఓటు టర్న్ ఔట్ శాతం పెరిగేందుకు సూచనలతో వీడియోను రూపొందించాలని తెలియజేశారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి 20 చివరి తేదీ అన్నారు. 

News April 6, 2024

ప్రకాశం: కలెక్టర్‌ను కలిసిన నూతన ఎస్పీ

image

ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ ను నూతనంగా జిల్లాకు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సుమిత్ సునీల్ ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు ఎస్పీ పూల బొకేను అందజేశారు. అనంతరం రాబోయే ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో గల పరిస్థితుల గురించి సుదీర్ఘంగా కలెక్టర్‌తో ఎస్పీ చర్చించారు.

News April 6, 2024

ఎన్నికల వేళ ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలి: గుంటూరు SP తుషార్

image

జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఐటీ కోర్, కంట్రోల్ రూమ్ విభాగాలను శుక్రవారం ఎస్పీ తుషార్ ఆకస్మిక తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరు ఐటి కోర్ బృందంలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలన్నారు. డయల్ 100కు కాల్స్ వచ్చిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి అప్రమత్తం చేయాలన్నారు.

News April 5, 2024

ఎన్నికలకు భరోసా కల్పిస్తాం: ఎస్పీ

image

ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాలలో పోలీసులు కవాతు నిర్వహించారని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు, ఎటువంటి అల్లర్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా, శాంతిభద్రతలను కాపాడడానికి కేంద్ర సాయుధ బలగాల పోలీసులతో కవాతు నిర్వహించారన్నారు.

News April 5, 2024

పకడ్బందీగా పర్యవేక్షణ జరగాలి: కలెక్టర్

image

సాధారణ ఎన్నికలు 2024 కోసం ఏర్పాటు చేసిన జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ పకడ్బందీగా జరగాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.వి.వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం రాత్రి అనంతపురం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సెంటర్ ను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి తనిఖీ చేశారు.

News April 5, 2024

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ టుడే

image

1. విజయవాడ: వాలంటీర్ల రాజీనామా.. TDPలో చేరిక
2. ‘పెనమలూరు’లో పవర్ ఎవరిదో?
3. జన సైనికులను మోసం చేసింది బుద్ధ ప్రసాదే: సింహాద్రి
4. విజయవాడ: పానీపూరీ లేదన్నందుకు దాడి
5. విజయవాడ: పింఛన్ సొమ్ముతో పరార్
6. కృష్ణా: ఎం-ఫార్మసీ పరీక్షల టైం టేబుల్ విడుదల
7. విజయవాడ: ఇక్కడ గెలిస్తే ప్రభుత్వం స్థాపించినట్లే.!
8. తోట్లవల్లూరులో మహిళ అస్తిపంజరం
9. గుడివాడలో TDPకి ఆధిక్యం తెచ్చిన క్రాస్ ఓటింగ్

News April 5, 2024

తూ.గో.: నిన్న టీడీపీ.. నేడు వైసీపీ

image

కాట్రేనికోన మండలం బలుసుతిప్పలో ఎంపీటీసీ-1 ఓలేటి ధర్మారావు, ఓలేటి బాపూజీ, కామాది నందం తదితరులు ముమ్మిడివరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో గురువారం వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. శుక్రవారం ఉదయం మళ్లీ టీడీపీని వదిలి వైసీపీలో చేరారు. 

News April 5, 2024

రెంటచింతలలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

పల్నాడు జిల్లా రెంటచింతలలో శుక్రవారం 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రతి సంవత్సరం మే మొదటి వారంలో ఈ ఉష్ణోగ్రత నమోదవుతుందని మే 15 నుంచి 25 నాటికి ఉష్ణోగ్రతలు ఇక్కడ 50 డిగ్రీలకు మించుతుందని ఈ సంవత్సరం ఇప్పుడే 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కావటం ఆందోళన కలిగిస్తోందని స్థానికులు చెబుతున్నారు. రోహిణి కార్తెలో ఎంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయేమోనని ఆందోళన వ్యక్తం అవుతోంది.

News April 5, 2024

తిరుపతి : LLB ఫలితాలు విడుదల

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గతేడాది నవంబర్ నెలలో ఎల్ఎల్‌‌బి (LLB) రెండో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఫలితాలు శుక్రవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in, www.schools9.com ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.