Andhra Pradesh

News April 5, 2024

చిత్తూరు: 95 శాతం పెన్షన్లు పంపిణీ

image

చిత్తూరు జిల్లాలో 95 శాతం పెన్షన్ పంపిణీ పూర్తయినట్లు కలెక్టరేట్ అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నగిరి మున్సిపాలిటీ 98 శాతం, చిత్తూరు మున్సిపాలిటీ 98 శాతం, పలమనేరు మున్సిపాలిటీ 97%, పుంగనూరు మున్సిపాలిటీ 97% పెన్షన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే నగరి 97%, రామకుప్పం 97%, సోమల 97%, అత్యధికంగా పంపిణీ చేశారు. మిగిలిన ప్రాంతాల్లో 95 శాతం పెన్షన్ పంపిణీ పూర్తయింది.

News April 5, 2024

RRR చేరికపై ఉత్కంఠకు తెర.. పోటీ ఎక్కడి నుంచి..?

image

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏ పార్టీలో చేరుతారనే ఉత్కంఠకు నేటితో తెరపడింది. పాలకొల్లు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకున్నారు. అయితే.. రఘురామ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు..? ఒకవేళ బరిలో ఉంటే లోక్‌సభకా..? అసెంబ్లీకా ..? అనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉంది. ‘కూటమి నుంచి పక్కా బరిలో ఉంటా. రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది’ అని అన్న రఘురామకు ఏ టికెట్ ఇస్తారో వేచి చూడాలి.

News April 5, 2024

కర్నూలు: రేపటి నుంచి ఎస్ఏ-2 పరీక్షలు

image

కర్నూలు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు శనివారం నుంచి సమ్మెటివ్ అసెస్మెంట్(ఎస్ఏ)-2 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కే.శామ్యూల్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 19వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. స్కూల్ కాంప్లెక్స్ నుంచే పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశ్న పత్రాలను తీసుకువెళ్లాలని పేర్కొన్నారు.

News April 5, 2024

శ్రీ సత్యసాయి: విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

image

చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దెల గ్రామానికి చెందిన వీరనారమ్మ(48) తన ఇంటి ముందు స్టూల్ మీద నిలబడి తన ఇంటి గోడకు సున్నం కొడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై కిందపడింది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను CK పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షించి మృతి చెందిందని నిర్ధారించారు. వీరనారమ్మకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.

News April 5, 2024

RRR చేరికపై ఉత్కంఠకు తెర.. పోటీ ఎక్కడి నుంచి..?

image

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏ పార్టీలో చేరుతారనే ఉత్కంఠకు నేటితో తెరపడింది. పాలకొల్లు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకున్నారు. అయితే.. రఘురామ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు..? ఒకవేళ బరిలో ఉంటే లోక్‌సభకా..? అసెంబ్లీకా ..? అనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉంది. ‘కూటమి నుంచి పక్కా బరిలో ఉంటా. రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది’ అని అన్న రఘురామకు ఏ టికెట్ ఇస్తారో వేచి చూడాలి.

News April 5, 2024

గాజువాక వైన్ షాప్‌లో చోరీ.. నిందితుడు అరెస్టు

image

గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీనగర్ రైల్వే గేట్ వద్ద గల గవర్నమెంట్ వైన్ షాపులో ఈనెల 18న చొరబడి రూ.5,50,580 నగదును దొంగిలించిన మిత్తిరెడ్డి శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రూ.2,85,00 నగదు రూ.38 వేల విలువగల మొబైల్ ఫోన్ రికవరీ చేసినట్లు తెలిపారు. నిందితుడు అనకాపల్లి జిల్లా పరవాడ మండలం మంత్రి పాలెం గ్రామానికి చెందినవాడని పోలీసులు తెలిపారు.

News April 5, 2024

అల్లూరి జిల్లాలో జోరుగా పింఛన్ల పంపిణీ: కలెక్టర్

image

సామాజిక పింఛన్ల పంపిణీలో అల్లూరి జిల్లా రాష్ట్రంలో 4వ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత తెలిపారు. శుక్రవారం నాటికి జిల్లాలో ఉన్న 1లక్ష 27వేల 894 పింఛనుదారులకు గాను 1లక్ష 20వేల 825మందికి పింఛను పంపిణీ చేయడం జరిగిందన్నారు. 94.47 శాతం పింఛను పంపిణీ పూర్తయిందన్నారు. ఈమేరకు పింఛను పంపిణీ ఇన్చార్జి అధికారులు జాయింట్ కలెక్టర్ భావన వశిస్ట్, ఐటీడీఏ పీవో వీ.అభిషేక్ తదితర అధికారులను అభినందించారు.

News April 5, 2024

ఉమ్మడి అనంతపురం జిల్లాలో మండిన ఎండలు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం భానుడు మండుతున్నాడు. అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో 43.83 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నెలకొంది. సింగనమలలో 43.59, ఎల్లనూరులో 43.40 డిగ్రీల ఉష్ణోగ్రత నెలకొనగా, శ్రీ సత్యసాయి జిల్లాలో అధికంగా పుట్టపర్తి మండలంలో 42.58 డిగ్రీలు, పరిగి మండలంలో 42.50, చెన్నేకొత్తపల్లిలో 42.50, కొత్తచెరువులో 42.40, ముదిగుబ్బ మండలంలో 42.20 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నెలకొంది.

News April 5, 2024

కర్నూలు జిల్లాలో 93% పెన్షన్ల పంపిణీ

image

కర్నూలు జిల్లాలో సామాజిక భద్రత పెన్షన్లు దాదాపుగా 93% పంపిణీ ప్రక్రియ పూర్తయినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ట్రాఫిక్ డైరెక్టర్ సలీం భాషా శుక్రవారం వెల్లడించారు. జిల్లాలో మొత్తం పెన్షన్లు 2,46,871 ఉండగా.. 2,31,892 పెన్షన్లను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఇంకా దాదాపుగా 14,979 పెన్షన్లను పంపిణీ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. శనివారం నాటికి 100% పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.

News April 5, 2024

కృష్ణా: ఇంజినీరింగ్ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

కృష్ణా వర్సిటీ పరిధిలో బీటెక్ విద్యార్థులు రాయాల్సిన 4, 6వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 25 నుంచి మే 4 వరకు నిర్ణీత తేదీలలో ఈ పరీక్షలు జరుగుతాయని వర్సిటీతెలిపింది. సబ్జెక్టువారీగా పరీక్షల టైం టేబుల్, పరీక్షా కేంద్రాల వివరాలకు విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది.