India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
G.M. వలస మండలాన్ని గజరాజులు వీడడం లేదు. రబీ సీజన్లో రైతులు వేసిన పంటలను ఏనుగుల గుంపు నాశనం చేస్తుంది. అరటి, మొక్కజొన్న, కర్బూజా వంటి పంటలతో పాటు వరి చేలలో ఏనుగుల గుంపు సంచరించడంతో పంటలు పాడవుతున్నాయి. వేలాది రూపాయలు మదుపులుగా పెట్టి పంటను చేతికి అందుతున్న తరుణంలో ఏనుగులు పాడు చేయడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తక్షణమే ఈ ప్రాంతం నుంచి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.
2019లో గుడివాడ అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. నోటాకు 3,285 ఓట్లు(1.96%) పోల్ అవ్వగా.. కాంగ్రెస్ అభ్యర్థి దత్తాత్రేయులుకు 1,401(0.83%) ఓట్లు, బీజేపీ అభ్యర్థి గుత్తికొండ శ్రీ రాజబాబు 1,212(0.72%) ఓట్లు సాధించారు. ప్రస్తుతం బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకోగా, కాంగ్రెస్ ఈ సారి వామపక్షాలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగనుంది.
శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఈ నెల అన్ని రకాల పింఛన్లు కలిపి మొత్తం 3,21,689 మందికి సంబంధించి సొమ్ము విడుదల చేశారు. గురువారం 2,77,353 (86.22శాతం) అందించారు. ఇంకా 44,336 మందికి పింఛన్ డబ్బులను అందించాల్సి ఉంది. సంతబొమ్మాళి (81.40 శాతం), లావేరు (81.56 శాతం), కోటబొమ్మాళి (81.59 శాతం), ఎల్‌ఎన్‌పేట (82.57 శాతం), గార (83.02 శాతం), సోంపేట (83.76 శాతం), తదితర మండలాలు పంపిణీలో అట్టడుగున ఉన్నాయి.
2019లో గుడివాడలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి అవినాశ్‌కు 70,354 ఓట్లు రాగా టీడీపీ ఎంపీ అభ్యర్థి కొనకళ్లకు 75,790ఓట్లు లభించాయి. 2019లో క్రాస్ ఓటింగ్ కారణంగా గుడివాడలో ఎంపీ అభ్యర్థి కొనకళ్లకు 751ఓట్ల ఆధిక్యం లభించింది. గుడివాడలో వైసీపీ ఎంపీ అభ్యర్థి బాలశౌరికి 75,039ఓట్లు దక్కగా, MLA అభ్యర్థి నాని 89,833ఓట్లు సాధించి అవినాశ్‌పై 19,479ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ సారి క్రాస్ ఓటింగ్ ఉంటుందా.. మీ కామెంట్
అరుకు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీకి పోటీ చేస్తున్న తెదేపా బీజేపీ జనసేన అభ్యర్థుల సమావేశం విశాఖపట్నంలో శుక్రవారం జిల్లా పార్టీ అధ్యక్షులు కిడారి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో అరుకు ఎంపీగా పోటీ చేస్తున్న కొత్తపల్లి గీతతో పాటు పార్వతీపురం మన్యం జిల్లా నుంచి పార్వతీపురం, సాలూరు, కురుపాం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థులు విజయచంద్ర, గుమ్మడి సంధ్యారాణి, జగదీశ్వరి హాజరయ్యారు.
వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డే సీఎం అవుతారని శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం మిడుతూరు మండలం 49 బన్నూరులో ఆయన పర్యటించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గ అభ్యర్థి ధారా సుదీర్‌ను ఎమ్మెల్యే, జగన్మోహన్ రెడ్డిని సీఎంగా భారీ మెజార్టీతో గెలిపించాలని బన్నూరు ప్రజలను ఆయన కోరారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు బలరాముడు, తదితరులు పాల్గొన్నారు.
యాడికి మండలంలో వడదెబ్బకు గురై బీటెక్ విద్యార్ధి మృతిచెందాడు. మండల పరిధిలోని రాయలచెరువుకు చెందిన నిఖిల్ చౌదరి తమ సొంత పరిశ్రమ పనుల నిమిత్తం 2 రోజులు ఎండలో తిరగడంతో వడదెబ్బకు గురై అస్వస్థతకు గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
బ్రహ్మంగారిమఠం మండలం చెంచయ్యగారిపల్లెకు చెందిన రజకుడు పొంగూరు సుబ్బయ్య(65)అనే వ్యక్తి వడ దెబ్బకు గురై మృతి చెందాడు. గురువారం పింఛను కోసం మల్లేపల్లి సచివాలయం వద్దకొచ్చి వృద్ధాప్య పింఛను తీసుకున్నాడు. ఈ క్రమంలో ఎండధాటికి వడదెబ్బకు గురయ్యాడు. తీవ్ర అస్వస్థతకు గురైన సుబ్బయ్యను శుక్రవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు 108లో మైదుకూరుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.
విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన మాచర్ల మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన శీలం శ్రీను (50) ఉదయాన్నే రైట్ కెనాల్ పక్కనే ఉన్న మరసకుంట వద్దకు బహిర్భూమికి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు పొలానికి నీరు పెట్టే విద్యుత్ మోటారు వైరు తగిలి కరెంటు షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విజయపురి సౌత్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తిరుపతి జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. పాకాల జడ్పీటీసీ నంగా పద్మజ, ఆమె భర్త బాబు రెడ్డి చెవిరెడ్డి తీరును నిరసిస్తూ నిన్న వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప.గో జిల్లా గోపాలపురంలో మాజీ సీఎం చంద్రబాబును కలిశారు. ఆయన సమక్షంలో టీడీపీలో చేరారు. అనంతరం నంగా దంపతులు మాట్లాడుతూ.. కష్టపడిన వారికి వైసీపీలో గుర్తింపు లేదని.. ఆ పార్టీలో ఉత్సవ విగ్రహాలు లాగా ఉండలేక రాజీనామా చేశామని చెప్పారు.
Sorry, no posts matched your criteria.