Andhra Pradesh

News April 5, 2024

విజయవాడ: ఇక్కడ గెలిస్తే ప్రభుత్వం స్థాపించినట్లే.!

image

2008లో ఏర్పడ్డ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గెలిచిన పార్టీ గత 3 సార్లు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపించింది. ఉమ్మడి ఆంధ్రలో 2009లో విష్ణు(కాంగ్రెస్), నవ్యాంధ్రలో 2014లో బొండా ఉమ(టీడీపీ), 2019లో విష్ణు(వైసీపీ) ఇక్కడ గెలవగా వారు గెలిచిన పార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. తాజాగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ వైసీపీ నుంచి, ఉమ టీడీపీ నుంచి తలపడుతున్నారు.

News April 5, 2024

చిత్తూరు జిల్లా కలెక్టర్‌ను కలిసిన నూతన ఎస్పీ

image

చిత్తూరు జిల్లా కలెక్టర్ షగిలి షణ్మోహన్‌ను నూతన ఎస్పీ మణికంఠ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బొకే అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీగా విజయ్ మణికంఠ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

News April 5, 2024

రూరల్‌లో ఎక్కువ.. అర్బన్‌లో తక్కువ: కలెక్టర్

image

ప.గో జిల్లాలోని 7 నియోజకవర్గాలలో ఏడాదిగా ఓటర్ నమోదు కార్యక్రమాలను నిర్వహించగా.. 14,63,014 మంది కొత్తగా నమోదయ్యారని కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం తెలిపారు. గత ఎన్నికల్లోని పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే రూరల్‌లో ఎక్కువ శాతం, అర్బన్‌లో తక్కువ శాతం నమోదవుతూ వచ్చిందని అన్నారు. మే 13న ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News April 5, 2024

విశాఖ ఎంపీగా గెలిస్తే అభివృద్ధి చేస్తా: కేఏ పాల్

image

విశాఖలో పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. వారిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశానన్నారు. విశాఖ రైల్వే న్యూ కాలనీలో గల పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ-టీడీపీ ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేశాయన్నారు. రుషికొండలో కొండను మాయం చేశారని పేర్కొన్నారు. విశాఖ ఎంపీగా గెలిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు.

News April 5, 2024

శ్రీకాకుళం: టీ షర్ట్ కోసం అన్నదమ్ముల గొడవ.. అన్న మృతి

image

సంతబొమ్మాళి మండలం కాకరాపల్లికి చెందిన రమేశ్(31), సురేశ్ (25) అన్నదమ్ములు. గురువారం రాత్రి రమేశ్ టీ షర్ట్ ను సురేశ్ వేసుకున్నాడు. దీంతో వారి మధ్య ఘర్షణ జరిగింది. రమేశ్‌ను తమ్ముడు సురేశ్ నెట్టివేయడంతో తలకు రాయి తగిలి, తీవ్ర గాయమైంది. స్థానికులు శ్రీకాకుళంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం రమేశ్ మృతిచెందినట్లు ఎస్సై సిద్ధార్థ తెలిపారు.

News April 5, 2024

అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా అమిత్ బర్దార్ బాధ్యతలు

image

సార్వత్రిక ఎన్నికలు- 2024 జిల్లాలో ఎలాంటి ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యమని నూతన ఎస్పీ పేర్కొన్నారు.
జిల్లా యంత్రాంగంతో కలసి పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కృషి చేస్తామన్నారు. ఎస్పీ ఎలాంటి సమస్యలు, సవాళ్లు ఉన్నా.. సమిష్ఠిగా ఎదుర్కొని పరిష్కరిస్తామన్నారు. 

News April 5, 2024

బుగ్గ రామలింగేశ్వరుడిని తాకిన సూర్యుని కిరణాలు

image

తాడిపత్రి పట్టణంలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మూల విరాట్‌ను సూర్యుడు గురువారం సాయంత్రం కిరణాలు తాకాయి.  ప్రతి సంవత్సరం పాల్గుణ వైశాఖ మాసంలో సూర్యహస్తమయ సమయంలో కిరణాలు మూల విరాట్‌పై పడతాయని అర్చకులు తెలిపారు. శుద్ధ ఏకాదశి కావడంతో సూర్యుడి కిరణాలు స్వామి వారి మూల విరాట్‌పై పడ్డాయని అర్చకులు తెలిపారు.

News April 5, 2024

విశాఖ: 7న జూలో ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు

image

ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో జాతీయ’జూ ప్రేమికుల దినోత్సవం’ ఈనెల 8వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. ఈ సందర్భంగా ఈనెల 7వ తేదీన ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు. 3 నుంచి 12 సంవత్సరాల లోపు వయస్సు గల చిన్నారులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు అన్నారు. జూలోని జంతువుల మాదిరి చిన్నారులు డ్రెస్ వేసుకుని పోటీల్లో పాల్గొనవచ్చు అన్నారు.

News April 5, 2024

వినుకొండకు ఏప్రిల్ 8న సీఎం జగన్ రాక

image

వినుకొండ పట్టణంలో ఏప్రిల్ 8 న జరగనున్న ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమంలో సీఎం జగన్ పొల్గొననున్నారని ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తెలిపారు. పట్టణంలోని వైసీపీ ఆఫీసులో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు బొల్లా బ్రహ్మనాయుడు, అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి సమావేశం నిర్వహించారు. పల్నాడు జిల్లా వినుకొండలో ప్రారంభమైన మేమంతా సభ తర్వాత గురజాలలో జరుగుతుందని తెలిపారు.

News April 5, 2024

విజయవాడ: పింఛన్ సొమ్ముతో సచివాలయం ఉద్యోగి పరార్

image

విజయవాడలో పింఛను డబ్బుతో సచివాలయ ఉద్యోగి పరారైన ఘటన శుక్రవారం జరిగింది.మధురానగర్ సచివాలయం-208కి చెందిన ఉద్యోగి నాగమల్లేశ్వరావుగా అధికారులు గుర్తించారు. సచివాలయంలో పింఛను పంపిణీ సొమ్ములో తేడా రావడంతో విషయం వెలుగుచూసింది. అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.