Andhra Pradesh

News April 5, 2024

విశాఖ: 7న జూలో ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు

image

ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో జాతీయ’జూ ప్రేమికుల దినోత్సవం’ ఈనెల 8వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. ఈ సందర్భంగా ఈనెల 7వ తేదీన ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు. 3 నుంచి 12 సంవత్సరాల లోపు వయస్సు గల చిన్నారులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు అన్నారు. జూలోని జంతువుల మాదిరి చిన్నారులు డ్రెస్ వేసుకుని పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు.

News April 5, 2024

ఉమ్మడి అనంత జిల్లాలో పలువురు జడ్జిల బదిలీ

image

ఉమ్మడి అనంత జిల్లాలోని పలువురు జడ్జిలు బదిలీ అయ్యారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం కోర్టులో పనిచేస్తున్న ప్రిన్సిపల్‌ సివిల్‌ జడ్జి దీన ఒంగోలు సివిల్‌ జడ్జిగా అనంతపురం బదిలీ అయ్యారు. పెనుకొండ కోర్టులో పనిచేస్తున్న సివిల్‌ జడ్జి శంకర్రావును అనంతపురం సివిల్‌ జడ్జిగా బదిలీ చేశారు. అలాగే, బొబ్బిలిలో సివిల్‌ జడ్జిగా ఉన్న వాసుదేవన్‌ను పెనుకొండకు బదిలీ చేశారు.

News April 5, 2024

శ్రీకాకుళం: ACCIDENT.. కానిస్టేబుల్ మృతి

image

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస అవుట్ పోస్టులో జీఆర్పీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బొడ్డేపల్లి గన్నయ్య(44) గురువారం రాత్రి రోడ్డుప్రమాదంలో మృతి చెందారు. విధుల్లో భాగంగా విజయనగరం వెళ్లి తిరిగి వస్తుండగా ఆర్టీసీ కాలనీ రోడ్డు వద్ద లారీ ఢీకొట్టగా చనిపోయారు. మృతుని భార్య ఫిర్యాదుమేరకు శ్రీకాకుళం రూరల్ ఎస్సై కేసు నమోదు చేశారు.  

News April 5, 2024

ఆళ్లగడ్డ: 5సార్లు ఎన్నికలబరిలో నిలిచి.. గెలిచి

image

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా శోభానాగిరెడ్డిది ప్రత్యేక స్థానంగా చెప్పవచ్చు. 5 సార్లు ఎన్నికల బరిలో నిలిచి గెలిపొందారు. 2009 నుంచి 2014 వరకు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గ చరిత్రలోనే 1997లో టీడీపీ ఎమ్మెల్యేగా 46959 అత్యధిక ఓట్ల మెజార్టీ, 2012లో 36795 రెండవ అత్యధిక మెజార్టీతో గెలిచిన రికార్డు ఉంది. ఈ ఎన్నికలలో ఆళ్లగడ్డలో ఈ మెజార్టీని బ్రేక్ చేసే అవకాశం ఉందా.. కామెంట్ చేయండి

News April 5, 2024

CTR: న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బదిలీ

image

చిత్తూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కరుణ కుమార్ బదిలీ అయ్యారు. ఆయన్ను నెల్లూరు జిల్లాలోని ప్రిన్సిపల్ సివిల్ జడ్జి(సీనియర్ డివిజన్)గా నియమిస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరులో పనిచేస్తున్న అడిషనల్ సివిల్ జడ్జి(సీనియర్ డివిజన్) వెన్నెలకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

News April 5, 2024

నెల్లూరు: న్యాయమూర్తుల బదిలీ

image

నెల్లూరు ప్రత్యేక ఏసీబీ కోర్టు, రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి సత్యవాణి అనంతపురం జిల్లాకు బదిలీ అయ్యారు. కడపలో పనిచేస్తున్న గీతను నెల్లూరు ప్రత్యేక మహిళా కోర్టు, 8వ అదనపు సెషన్స్ జడ్జిగా నియమించారు. నెల్లూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మీనారాయణను గుడివాడకు బదిలీ చేయగా, ఆయన స్థానంలో చిత్తూరు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా పనిచేస్తున్న కరుణకుమార్ నియమితులయ్యారు.

News April 5, 2024

శ్రీకాకుళం: న్యాయమూర్తులకు స్థానచలనం

image

శ్రీకాకుళం జిల్లాలో పలువురు న్యాయమూర్తులకు స్థానచలనం కల్పిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ గురువారం ఉత్తర్వులిచ్చారు. శ్రీకాకుళం 1వ అదనపు జిల్లా జడ్జి శ్రీదేవిని కాకినాడ జిల్లా పోక్సోకోర్టు న్యాయమూర్తిగా, వైజాగ్ మెట్రోపాలిటీ మెజిస్ట్రేట్ హిమబిందును శ్రీకాకుళం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్‌గా, వైజాగ్ 1వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ యుగంధర్‌ను శ్రీకాకుళం అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీచేశారు.

News April 5, 2024

పెనుకొండ నుంచి 60వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన నాయకుడు

image

పెనుకొండ నియోజకవర్గంలో పరిటాల రవీంద్రది ఒక ప్రత్యేక స్థానంగా చెప్పవచ్చు. 1994 నుంచి 2004 వరకు వరుసగా నాలుగుసార్లు ఎన్నికల బరిలో నిలిచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గ చరిత్రలోని 1996లో 60010 ఓట్ల అత్యధిక మెజార్టీ, 1999లో 57877 రెండవ అత్యధిక మెజార్టీతో గెలిచిన రికార్డు ఉంది. ఈ ఎన్నికలలో ఈ అత్యధిక మెజార్టీని బ్రేక్ చేసే అవకాశం ఉందా.. కామెంట్ చేయండి.

News April 5, 2024

బాధ్యతలు స్వీకరించిన నెల్లూరు ఎస్పీ

image

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని.. వారు ఎప్పుడైనా తనను నిర్భయంగా కలవవచ్చని నెల్లూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సూచించారు. నూతన ఎస్పీగా గురువారం రాత్రి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బెంగళూరుకు చెందిన ఆరిఫ్ హఫీజ్ 2015 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. తొలి పోస్టింగ్‌లో నర్సీపట్నం ఏఎస్పీగా, అనంతరం రంపచోడవరం ఓఎస్డీగా పని చేశారు.

News April 5, 2024

ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఇద్దరు జడ్జిల బదిలీ

image

రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది జడ్జీలను బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని ఏలూరు ఒకటో అదనపు జిల్లా జడ్జి జి.రామగోపాల్‌ తిరుపతి ఐదవ, ఫ్యామిలీ కోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు. భీమవరం మూడో అడిషనల్‌ జిల్లా జడ్జిగా పనిచేస్తున్న పి.శ్రీసత్యదేవి స్పెషల్‌ సెషన్స్‌ జడ్జి ఎస్సీ, ఎస్టీ కోర్టు విశాఖపట్టణానికి బదిలీ అయ్యారు.